For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరు నెలల గర్భధారణలో వచ్చే మార్పులు

|

గర్భధారణ సమయంలో మీకు కొత్త అనుభూతి మరియు మీ కుటుంబంలో కొత్త సభ్యుని ఆహ్వానించడం మీద మీ దృష్టి అంతా ఉంటుంది. మీ గర్భం గురించి తెలుసుకోవటానికి అనేక విషయాలు ఉన్నాయి. అయితే మీ రెండవ త్రైమాసికం ముగింపు చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం. ఆరు నెలల గర్భంలో శిశువు మరియు మీ శరీరంలో అనేక మార్పులు జరిగే సమయం అని చెప్పవచ్చు.

మీ శిశువు మునుపటి వారంతో పోలిస్తే 4 ఔన్సుల బరువు క్రమంగా పెరుగుతూ ఉండే విషయాన్ని గ్రహించటం ప్రారంభమవుతుంది. మీ శిశువు బొద్దుగా మారటం అనేది ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది. తన మెదడు ఎప్పుడూ కంటే ఉత్తమంగా పెరుగుతోంది. అంతేకాక తన రుచి మొగ్గలు అభివృద్ధి కూడా మొదలవుతుంది. ఆరు నెలల గర్భం మీ జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. ఇప్పుడు మీ గర్భాశయం బొడ్డు బటన్ పైకి పెరగటం కనుగొంటారు. అందువలన మీ బొడ్డు యొక్క పరిమాణం పెరుగుతుంది. ఈ ఆరు నెలల గర్భధారణ సమయంలో మధుమేహం కొరకు పరీక్షిస్తారు. ఎందుకంటే మధుమేహంనకు చికిత్స చేయకుండా వదిలేస్తే డెలివరీ సమయంలో రిస్క్ ఉంటుంది.

ముందుగా డెలివరీ సంకేతాలను ఈ ఆరు నెలల గర్భధారణ సమయంలో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ ఆరు నెలల గర్భధారణ మరియు శరీర మార్పుల గురించి తెలుసుకోవటానికి కొన్ని విషయాల జాబితా ఉన్నది.

మీ శిశువు లోపల ఏమి జరుగుతుంది?

మీ శిశువు లోపల ఏమి జరుగుతుంది?

ఆరు నెలల గర్భధారణలో శిశువు యొక్క శరీర కండరాల అభివృద్ధి మరియు పిండం కదలికలు అత్యంత శక్తివంతముగా ఉండే సమయం అని చెప్పవచ్చు. మీ శిశువు 14 ఔన్సుల నుండి 3 పౌండ్ల బరువు ఉంటుంది. అంతేకాక 11-16 అంగుళాల పొడవు ఉంటుంది.

మీలో సంభవించే మార్పులు

మీలో సంభవించే మార్పులు

గర్భధారణ సమయంలో శరీరం మార్పులను ఎల్లప్పుడూ గమనించాలి. అంతేకాక అనేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఆరు నెలల గర్భధారణ మామ్ లో అనేక శారీరక మార్పులు జరిగే అవకాశంఉంది. గర్భధారణ మామ్ లో మలబద్ధకం వంటి లక్షణాలు,ఉబ్బరం,గుండె మంట,అజీర్ణం, తలనొప్పి,ముక్కు సమస్యలు మొదలైనవి సంభవించవచ్చు.

మీ ఆరోగ్యం మరియు పోషణ పట్ల శ్రద్ధ వహించాలి

మీ ఆరోగ్యం మరియు పోషణ పట్ల శ్రద్ధ వహించాలి

మీ ఆరోగ్యం మరియు పోషణ పట్ల మంచి సంరక్షణ తీసుకోవాలి. ఆరు నెలల గర్భధారణలో మాత్రమే శరీర మార్పులు జరిగే సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఖచ్చితంగా మీ శరీరం పట్ల పూర్తి శ్రద్ధ అవసరం. అంతేకాక ఈ సమయంలో హార్మోన్లు పనితీరు వలన కొంచెం క్రేజీ గా ఉండవచ్చు.

సంబంధాలు

సంబంధాలు

గర్భధారణ అనేది జీవితంలో అనేక మార్పులు వచ్చే సమయం.మీ సంబంధాలలో చాలా మార్పులు రావచ్చు. అంతేకాక కొన్నిసార్లు హాని కలగవచ్చు. కేవలం గర్భధారణ సమయంలో శరీరం మార్పులు, భావోద్వేగాలు మరియు మీ సంబంధాలలో చాలా మార్పులు వస్తాయి.

ముందుగా డెలివరీ సంకేతాలు తెలుసుకోండి

ముందుగా డెలివరీ సంకేతాలు తెలుసుకోండి

ఆరు నెలల గర్భధారణ సమయంలో ముందుగా డెలివరీ మరియు దాని గుర్తులు గురించి తెలుసుకోవడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని లక్షణాలు యోని స్రావం లేదా చుక్కలు,డిచ్ఛార్జ్ రకం మార్పు వలన యోని డిచ్ఛార్జ్ పెరగటం,పెల్విక్ ప్రాంతంలో ఒత్తిడి పెరగటం, తక్కువగా బ్యాక్ నొప్పి లేదా కడుపు నొప్పి ఉంటాయి.

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి

సరిగ్గా వండని మాంసం,చీజ్,పచ్చి ఆహారం వంటి వాటికీ దూరంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు ఆరు నెలల గర్భధారణ మహిళల్లో సమస్యకు కారణం కావచ్చు. హానికరమైన బాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ఈ ఆహారాలు తల్లి మరియు బిడ్డకి ప్రమాదకరంగా మారవచ్చు.

ఒక చిన్న సలహా

ఒక చిన్న సలహా

మీ జీవితంలో ఆరు నెలల గర్భధారణ అనేది అత్యంత ప్రత్యేక దశ మరియు చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సలహాలను అనుసరించండి. ఈ కాలంలో నిటారుగా ఉండడానికి,మీరు నిల్చున్నప్పుడు మీ అడుగులు సమాంతరముగా ఉండేలా శ్రద్ధ వహించండి. మీ లోయర్ బ్యాక్ వీలైనంత నిటారుగా ఉండేటట్లు చూడండి. మీరు కూర్చుని ఉన్నప్పుడు నేలపై సమాంతరముగా మీ అడుగులు ఉంచడం మర్చిపోవద్దు. అన్ని చిట్కాలను జాగ్రత్తగా అనుసరించి మీ గర్భధారణ సమయంను ఆనందించండి.

English summary

Six month of pregnancy: Changes

When you are cherishing about the new feeling and all geared up to welcome the new member in your family. There are also a number of things; you need to know about your pregnancy.
Story first published: Saturday, November 9, 2013, 14:59 [IST]
Desktop Bottom Promotion