For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు చర్మ సంరక్షణ జాగ్రత్తలు

|

గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ శరీరంలో గణనీయమైన మార్పులు వొస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో, వాటి ప్రభావం ఎక్కువగా ఉండి, శరీరం యొక్క చర్మం బయటి పొర మీద ప్రభావం ఎక్కువగా చూపుతుంది. అన్ని సౌందర్య ఉత్పత్తులు గర్భధారణ సమయంలో అనుకూలంగా ఉండవు మరియు వీటిలోని అనేక పదార్థాలు కాబోయే తల్లికి మరియు బిడ్డకి హాని కలుగచేయవొచ్చు. కాబట్టి, మీరీ మీ చర్మ సంరక్షణ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

గర్భధారణ సమయంలో మీ చర్మసంరక్షణ గురించి తీసుకునే జాగ్రత్తలలో ఈ క్రింద ఇచ్చిన స్కిన్ సొల్యూషన్స్ సహాయపడతాయి మరియు ఈ ఐదు ప్రత్యేక చిట్కాలు మీ చర్మానికి సరిపడే చర్మసంరక్షణ ఉత్పత్తిని ఎంచుకోవటంలో ఉపయోగపడతాయి.

సూర్యరశ్మిని తప్పించుకోండి

సూర్యరశ్మిని తప్పించుకోండి

గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ శరీరం గణనీయమైన మార్పులను ఎదుర్కొంటుంది. దీనివలన వారి శరీరం చాలా సున్నితంగా తయారవుతుంది. దీని ఫలితంగా,వారి చర్మం నలుపుగా మారుతుంది మరియు రంగును శరీరతత్వం మారుతుంది. హార్మోన్ల అసమతుల్యత తప్పించడం సాధ్యము కాదు కానీ మీరు ఖచ్చితంగా ఎండలో బయటకు వెళ్ళటం నివారించుకోవొచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగిలే శరీరాన్ని కవర్ చేసుకోండి. మీ మొహంపై సూర్యకిరణాలు పడకుండా నివారించేందుకు ఒక టోపీని ధరించండి.

సూర్యుని బ్లాక్ ఉపయోగించండి

సూర్యుని బ్లాక్ ఉపయోగించండి

పూర్తిగా సూర్యుడిని తప్పించటం సాధ్యంకాని విషయం. మీ కారులో మరియు ఇంటిలో కిటికీలోనుండి వొచ్చే సూర్యరశ్మి కిరణాలు మీ చర్మానికి హాని కలిగించవొచ్చు. అందువలన, చర్మవ్యాధి నిపుణులు కనీసం SPF30 + + కలిగి సూర్యుని బ్లాక్ క్రీమ్ ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నారు. SPF 30,UVB సూర్యకాంతిని సూచిస్తే, + +, UVA సూర్యకాంతిని సూచిస్తుంది. ఈ రెండు రకాల నుండి చర్మాన్ని రక్షించేందుకు విస్తృత వర్ణపట సూర్య రక్షణ ముఖ్యం. సూర్యుని బ్లాక్ ప్రభావం చూపడానికి 30 నిమిషాలు పడుతుంది కాబట్టి దీనిని ఉదయం వేళ సూర్యుడు క్రూరమైన వేడిని చూపకముందే వర్తింపచేయండి. దీని యొక్క ప్రభావం మాయమవకముందే దీనిని ప్రతి 3-4 గంటలకొకసారి వాడండి.

ఇంట్లోని రసాయనాలకు దూరంగా ఉండండి

ఇంట్లోని రసాయనాలకు దూరంగా ఉండండి

గర్భిణీ స్త్రీలు ఇంట్లోని అలెర్జీ మూలకాలనుండి దూరంగా ఉండవలసిన అత్యవసరం ఉన్నది, అవి వారికి, పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించవొచ్చు. ఆ ఉత్పత్తుల్లో పదార్థాలు సురక్షితమని, అవి పిల్లలకి హానికారకాలు కావని నిర్ధారించుకోండి. హైడ్రోక్వినన్, స్టెరాయిడ్స్ మరియు ఇతర హానికరమైన బ్లీచింగ్ కారకాలు వంటి పదార్థాలు నివారించటం చాలా ఉత్తమం, లేకపోతే ఒక చర్మవ్యాధి నిపుణుడి పర్యవేక్షణలో వాడటం మంచిది. ఈ పదార్థాలు సాధారణంగా పిగ్మెంటేషన్ తగ్గించేందుకు ఉపయోగిస్తారు మరియు తరచూ వైద్య సలహా లేకుండా కౌంటర్లో కొనుగోలు చేస్తుంటారు. ఈ ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రభావాలు చాలా హానికరం.

ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు వాడండి

ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు వాడండి

ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు, గర్భావతులలో పిగ్మెంటేషన్ చికిత్సకు చాలా సురక్షితమైనవి. ఇవి సహజ పదార్ధాలు మరియు గ్లైకోలిక్ యాసిడ్ మరియు లాక్టిక్ ఆమ్లం ఉండటం చాలా ముఖ్యమైన విషయం. గ్లైకోలిక్ యాసిడ్ చెరకు నుండి వొస్తుంది మరియు లాక్టిక్ ఆమ్లం పాల నుండి వొస్తుంది. ఈ రెండు ఆమ్లాలు పిగ్మెంటేషన్ చికిత్సలో చాలా ప్రభావం చూపుతాయి, అయినప్పటికీ సూర్యుని నుండి సంరక్షణ అవసరం. అదనంగా, దురదలు నిరోధించడానికి, గ్లైకోలిక్ యాసిడ్ మరియు లాక్టిక్ ఆమ్లం కలిపి ఉపయోగించండి, ఈ లాక్టిక్ ఆమ్లం తేమగలది(మాయిశ్చరైజర్)గా తెలిసిన విషయమే.

చర్మవ్యాధి నిపుణుడిని సందర్శించండి

చర్మవ్యాధి నిపుణుడిని సందర్శించండి

కాబోయే తల్లిగా మీరు మీ చర్మాన్ని,దద్దుర్లు, చర్మం దురద లేదా ఇతర చర్మవ్యాధుల సమస్యలు రాకుండా శ్రద్దగలిగి ఉండాలి. మీరు ఈ లక్షణాలు గమనించిన వెంటనే సరైన వైద్యసలహా కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. మీరు ఎప్పటికప్పుడు వైద్య సలహా తీసుకోవటం మీకు, మీ బిడ్డకి చాలా మంచిది.

English summary

Skin care tips for pregnant women

Pregnancy is a time when a woman's body undergoes significant changes. Hormone fluctuations are such that they take a toll on the most vulnerable and outermost layer of the body - skin.
Desktop Bottom Promotion