For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు గర్భం ధరించారని తెలుసుకోవడానికి సులభ చిట్కాలు...!

|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గర్భం ధరించడం ఒక పెద్ద విషయం. అయితే గర్భం ధరించామో లేదో తెలుసుకోకుండా అందరికీ చెప్పడం మంచి పద్దతి కాదు . కాబట్టి ముందుగా మీరు గర్భనిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం . అందుకు ఈ రోజుల్లో చాలా రకాల టెస్ట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కటీ డాక్టర్ నిర్ధారణ చేయందే మనం ఒక నిర్ణయానికి రాలేం. ఎందుకంటే మనకంటే వైద్యులకే ఎక్కువ తెలుసు కాబట్టి. పీరియడ్స్ లేటైన గర్భంగా భావించి ఆదోళన చెందుతుంటారు కొంత మంది. తీరా టెస్ట్ చేస్తే నెగటివ్ అని వస్తుంది. కాబట్టి మీ నిర్ధారణతో పాటు డాక్టర్ నిర్ధారణకు కూడా చాలా అవసరం.

మీరు గర్భం ధరించినట్లు మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సంభ్యలును తెలపాడనికంటే ముందు మీరు నిజంగా గర్భధాల్చారని నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే గర్భాధారణ అనేది మీకు మరియు మీ ప్రియమైన వారికి ఇది ఒక సంతోషకరమైన భావోద్వేగమైన విషయం కాబట్టి. గర్భం లేదని తెలిస్తే మీ ప్రియమైన వ్యక్తులతో పాటు మీరు బాధించాల్సి వస్తుంది.

చాలా మంది మహిళలు వారికి గర్భాధారణ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వివిధ రకాల పద్దతులున్నాయ తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు . హోం ప్రెగ్రెన్నీ టెస్ట్ కిట్ మీరు ప్రారంభ గర్భాధారణ సంకేతాలను అంటే రక్తంలోని హెచ్ సిజి హార్మోన్ లెవల్స్ ను తెలుపుతుంది. అందులో హార్మోన్ లెవల్స్ ఎక్కువ లేదా తక్కువ ఉన్నా డాక్టర్లు మాత్రం ఒక పాతలాజికల్ పద్దతుల ద్వారా మీరు గర్భం ధరించారని నిర్ణయిస్తారు. హెచ్ సిజి అంటే మహిళల హార్మోన్ ఇది. ఇది మహిళలో శరీరంలో గర్భంలో పిండం ఎప్పడైతే ఏర్పడుతుందో అప్పుడు హెచ్ సిజి హార్మోన్లలో మార్పులు కనబడుతాయి.

మరి మీరు గర్భం ధరించారని నిర్ధారించుకోవడానికి ఇక్కడ కొన్ని సులభం పద్దతులున్నాయి..అవేంటో పరిశీలించండి...

మీ గర్భం ధరించారని నిర్ధారించుకోవడానికి కొన్ని పద్దతులు:

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

పీరియడ్ (రుతుక్రమం తప్పుతుంది): గర్భాధరణ నిర్ధారణకు మొదటి సంకేతం మీ రుతు క్రమం తప్పడమే. మీ పీరియడ్స్ రావాల్సిన తేది కాంటే వారం రోజులు ఆలస్యం అయితే మీరు గర్భం ధరించ ఉండవచ్చు.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

ఫెయింట్ లైన్: మీ పీరియడ్(రుతుక్రమం)రావాల్సిన తేది కంటే 7-10 రోజుల ఆలస్యం అయితే ఇంట్లోనే హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో యూరిన్ ఒకటి లేదా రెండు చుక్కల వేయడం వల్ల , ఆ మీటర్ లో రెండు లైన్స్ ఉంటాయి. వాటిలో ఫెయింట్ లైన్ వస్తే మీరు గర్భధరింవచ్చు. అందుకు మరి కొంత సమయం(మరో వారం)వేచి చూడాలి.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

లక్షణాలు: ఎప్పడుతే, మీరు గర్భం కోసం ఎదురు చూస్తుంటారో అప్పుడు కొన్ని లక్షణాలు గుర్తించవచ్చు. కడుపులో తిప్పడం, వాంతి వచ్చేట్లు ఉండటం. కళ్ళు తిరునట్టు అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా గర్భధరించడానికి సాధ్యం అని మాత్రమే తెలుపుతుంది. అయితే ఖచ్చితం మాత్రం కాదు.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

డార్క్ లైన్: మీ పీరియడ్(రుతు క్రమం)నిలిచిపోయిన రెండు వారాల తర్వాత మళ్ళీ యూరిన్ టెస్ట్ హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం ద్వారా డార్క్ లైన్ కనబడితే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ ను కలిసే అవసరం వచ్చిందని గుర్తించాలి.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

డాక్టర్ ను సంప్రదించాలి: మీరు ఇంట్లో చేసిన గైనిక్ టెస్ట్ కిట్ ను డాక్టర్ కు చూపించండి . అయితే ఒక్క విషయం గుర్తించుకోవాలి, డాక్టర్ మీరిచ్చిన కిట్ తోనే నిర్ధారించుకోరు . హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ తో పాటు మరికొన్ని టెస్ట్ లు చేసిన తర్వాతే గర్భాధారణను నిర్ధారిస్తారు.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

పీరియడ్స్ నిలిచిన తర్వాత బ్లీడింగ్: ఈ రెండు వారాల్లోపు బ్లీడింగ్ అవ్వడం లేదా ఒకటి రెండు చుక్కలు కనబడం వంటి లక్షణాలు మీరు గుర్తించినట్లైతే మీరు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే బహుశా అది మిస్ కరేజ్ అవ్వొచ్చు. అయితే చాలా సందర్భాల్లో చాలా మంది మహిళల్లో ఇలా కొద్ది పాటి బ్లీడింగ్ అవ్వడం సహజం.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

పాథలాజికల్ టెస్ట్: చాలా మంది డాక్టర్లు పాథలాజికల్ టెస్ట్ కిట్ తో యూరిన్ టెస్ట్ చేసి రక్తంలోని హెచ్ జిసి హార్మోన్ లెవల్స్ ను కనుగొంటారు.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

రక్తంలో హెచ్ సిజి లెవల్స్: బ్లడ్ టెస్ట్ వల్ల యూరిన్ టెస్ట్ కంటే ఇంకా బెటర్ గా హెచ్ సిజ్ హార్మోన్ లెవల్స్ ను గుర్తించవచ్చు . ఎందుకంటే యూరిన్ టెస్ట్ ఉదయం నిద్రలేవగానే చేయాలి. లేదంటే సరైన ఫలితాలను చూపించకపోవచ్చు. కాబట్టి బ్లడ్ టేస్ట్ కూడా ముఖ్యమే.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

బ్లర్ రిమపోర్ట్: మీ రక్తంలో హెచ్ సిజి లెవల్స్ ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో, మీరు జనరల్ బ్లడ్ స్కాన్ కూడా చేయించుకోవాలి. ఇందులో డయాబెటిస్, థైరాయిడ్, ప్లేట్ లెట్స్ మరియు హీమోగ్లోబిన్ వంటి వాటిని ఆరోగ్యస్థితిగతులను తెలపడం వల్ల మీరు గర్భం దాల్చడానికి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుపుతుంది.

ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

ప్రెగ్నెన్సీ స్కాన్: ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ మీరు ఎప్పుడైతే ఎనిమిది వారాల ప్రెగ్నెంట్ గా ఉన్నారో అప్పుడు ఇది చాలా అవసరం . అదే విధంగా కొన్ని లక్షణాలు అంటే కడుపులో నొప్పి, బ్లీడింగ్ మొ..వంటివి ఉన్నప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చాలా అవసరం. ఈ స్కాన్ ద్వారాపిండం పెరగుదల గర్భం బయట లేదా ట్యూబ్ వద్ద ఉన్నద అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.

English summary

Steps To Confirm Your Pregnancy | ఖచ్చితంగా మీరు గర్భం ధరించారని నిర్ధారించడం ఇలా...!

he news of pregnancy is a big one. You don't want to make an announcement and then make it appear like a false alarm. So it is very important to confirm your pregnancy. Several kinds of pregnancy tests are available these days. But none of these pregnancy tests can be considered conclusive without the doctor's advise and some patent clauses.
 
Story first published: Wednesday, April 10, 2013, 10:20 [IST]
Desktop Bottom Promotion