For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో బాగా నిద్రపోవడానికి చిట్కాలు

|

గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు . వాటిల్లో నిద్ర పట్టకపోవడం అన్నది ఒకటి , దీనికి రకరకాల కారణాలు ఉంటాయి . శరీరంలో వస్తున్న మార్పులు , పుట్టబోయే బిడ్డ గురించిన ఆలోచనలు , ప్రసవం గురించిన భయం, నెలలు గడిచే కొద్దీ, కడుపులో పిండం పెరుగుతుంది, దాంతో పొట్ట పెరుగుతుండటం, దాంతో గర్భిణీ అసౌకర్యంగా ఫీలవ్వడం తదితర కారణాలు నిద్రలేమికి కారణం కావచ్చు . ఇన్ని కారణాలున్నా , గర్భవతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతమైన గాఢనిద్ర పోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు .

గర్భిణీ స్త్రీలలో నిద్ర పట్టకపోవడం, ఒక వేళ నిద్రపట్టినా గాఢంగా కాకుండా కలత నిద్ర పడుతుందని చాలా మంది చెబు తుంటారు. ఇందుకు శారీరకంగా కలిగే మార్పులు కారణమైనప్పటికీ, ప్రధానంగా పగటి పూట ఎక్కువ సమయం నిద్రపోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. గర్భిణీ స్త్రీలలో సరిగా నిద్రపట్టకపోవడానికి నిద్ర పట్టిన తొలిదశలోనే గాఢంగా నిద్రపట్టడం.. తర్వాత మెలకువ రావడం, నిద్రలో ఆద ేపనిగా కాళ్లు కదల్చడం, పీడకలలు రావడం, ఒక సారి మెలకువ వచ్చిన తర్వాత నిద్ర పట్టక పోవడం, వెన్ను నొప్పి లేదా పడుకోవడానికి అనుకూలంగా వుండక పోవడం, శ్వాసపరమైన గురక వంటి కారణాల వల్ల నిద్ర పట్టని స్థితి వుంటుంది.

అంతే కాదు మరికొన్ని సాధరణ భౌతిక లక్షణాలు కొన్ని గర్భిణీ స్త్రీ రాత్రి పూట మూత్ర విసర్జన కోసం తరచూ లేస్తుండం, గర్భధారణ సమయంలో భావోద్వేగ లక్షణాలు మారుతుండటం, పగటపూటి నిద్రవచ్చేట్లు చేస్తుంది, అలాగే కాళ్ళు చేతుల్లో తిమ్మిరి, పొట్టే పెరిగే కొద్ది అసౌకర్యం వంటి కారణాల వల్ల నిద్రపట్టక పోవడం జరుగుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే రాత్రుల్లో గర్భిణీ స్త్రీ గాఢంగా నిద్రించడం వల్ల తల్లి, బిడ్డకు ఇద్దరి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

గర్భిణీ శరీరంలో హార్మోనుల్లో మార్పులు మరియు భావోద్వేగాల వల్ల ఇప్పుటికీ రాత్రుల్లో సరిగా గాఢంగా నిద్రపోలేకపోతుంటే, అందుకు మేము మీకోసం కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. ఈ సింపుల్ చిట్కాలను పరిశీలిస్తే, ఇవి మీ గర్భధారణ సమయంలో మంచి నిద్రపొందడానికి సహాయపడుతుంది.

అదనపు పిల్లో(దిండు)వేసుకోండి:

అదనపు పిల్లో(దిండు)వేసుకోండి:

మీరు మెత్తగా ఉన్న దిండును మరొక్క దాన్ని బ్యాగ్ మరియు టమ్మీకి సపోర్ట్ గా వేసుకొని పడుకోవల్సి ఉంటుంది. ఒక పిల్లోను కాళ్ళ మద్య పుష్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ కు సపోర్ట్ గా ఉంటుంది. దాంతో ఒక పక్కగా మీరు గాఢంగా నిద్రించడానికి సహాయపడుతుంది.

డేటైమ్ నాప్స్ ను స్కిప్ చేయండి:

డేటైమ్ నాప్స్ ను స్కిప్ చేయండి:

పగటి పూట నిద్ర చాలా సాధారణం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో. పగటి పూట చిన్న కునుకు తీయ్యడం వల్ల రాత్రి సమయంలో సుఖంగా నిద్రించడానికి కష్టం అవుతుంది. కాబట్టి పగటిపూట నిద్ర (కునుకు)ను నివారించండి.

ఒత్తిడి జయించండి:

ఒత్తిడి జయించండి:

గర్భధారణ సమయంలో ఒత్తిడి మరియు యాంగ్జైటి స్థాయిలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. దాని ఫలితంగా నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి, ఒత్తిడిని ఎదుర్కోవటం ముఖ్యం, దాని వల్ల అది మీ నిద్రకు భంగం కలిగించదు. అందుకు మెడిటేషన్ చేయడం లేదా ఫ్రెండ్స్ లో మాట్లాడటం లేదా మీకు సౌకర్యవంతంగా ఉన్న పనులు చేయడం లేద బుక్స్ చదవడం వంటివి చేయాలి. ఐడియా ఏంటంటే మీరు నిద్రించడానికి ముందు ఒత్తిడి లేకుండా ఉండటం.

మీరు తీసుకొనే ఆహారం:

మీరు తీసుకొనే ఆహారం:

నిద్రించడానికి ముందు ఖచ్చితంగా ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగడం మంచిది . అలాగే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయి. అలాగే అధిక ప్రోటీనులున్న ఆహారాలను తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు శరీరంలో వేడిఆవిర్లను మరియు చెడు కలలను నివారించవచ్చు.

ద్రవాలు/పానీయాలను సాయంత్రవేళల్లో తక్కువగా తీసుకోవడం:

ద్రవాలు/పానీయాలను సాయంత్రవేళల్లో తక్కువగా తీసుకోవడం:

గర్భిణీకి మరియు కడుపులో పెరిగే బిడ్డకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉంటుంది. కాబట్టి, పగటి పూట ఎక్కువగా ద్రవాలు మరియు నీళ్ళు త్రాగాల్సి ఉంటుంది. సాయంత్ర వేళ్ళలో తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి దాంతో మీ బ్లాడర్ ఫుల్ కాకుండా నిద్రకు భంగం కలిగించకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రాత్రుల్లో తరచూ మూత్రవిసర్జనకు లేయాల్సిన పనిలేదు, దాంతో మరికాస్త బెటర్ గా నిద్రపోవచ్చు.

హాట్ బాటర్ బ్యాగ్స్:

హాట్ బాటర్ బ్యాగ్స్:

గర్భధారణ సమయంలో మీకు తిమ్మిరులుగా అనిపించినప్పుడు, హీటింగ్ ప్యాడ్స్ ను దగ్గర పెట్టుకోవడం లేదా హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవాలి. గర్భధారణ సమయంలో చిన్న చిన్న నొప్పులు సహజం. అటువంటి ప్రాంతంలో హాట్ బ్యాగ్ పెట్టుకోవడం మంచిది. అయితే హాట్ బ్యాగ్ ను అలాగే మీద పెట్టుకొని నిద్రించకూడదు.

గోరువెచ్చని నీటితో స్నానం :

గోరువెచ్చని నీటితో స్నానం :

బాతింగ్ టబ్ ను గోరువెచ్చని నీటితో నింపి, నిద్రించే ముందు గోరువెచ్చగా స్నానం చేయడం ఉత్తమం. నీళ్ళు మరీ వేడిగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల గర్భిణీ స్త్రీకి కావల్సినంత విశ్రాంతిని అంధిస్తుంది. కండాలు విశ్రాంతి పొంది క్రాంప్స్ లేకుండా చేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బెటర్ స్లీప్ పొందవచ్చు.

రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్:

రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్:

గర్భధారణ సమయంలో మీ శరీరం అన్నింటిని షెడ్యుల్ చేసుకొని ఉంటుంది. కాబట్టి, మీరు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రిపోయి, ఒక సమయానికి నిద్రలేచే విధంగా టైమ్ షెడ్యుల్ చేసుకోవాలి.

జంక్ ఫుడ్స్ నివారించాలి:

జంక్ ఫుడ్స్ నివారించాలి:

మీరు రాత్రుల్లో బాగా నిద్రపోవాలంటే, జంక్ ఫుడ్ తినడం నివారించండి . స్నాక్స్ తినడం పగటిపూట ఆరోగ్యకరం అయినా, సాయంత్రవేళ, రాత్రుల్లో నివారించండి. ముఖ్యంగా ఫ్రైచేసినవి, కారంగా ఉన్నవి లేదా యాసిడ్ కు కారణం అయ్యే వాటికి ఖచ్చింతా దూరంగా ఉండాలి . ముఖ్యంగా పగటి పూట స్నాక్స్ గా క్రాకర్స్ లేదా ఫ్రూట్స్ ను తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల రాత్రి పూట అలసటను నివారిస్తుంది.

ధూమపానం నివారించాలి:

ధూమపానం నివారించాలి:

మీరు త్రాగకపోయినా, మీ పక్కవారు త్రాగుతుంటే, లేదా మీ పార్ట్నర్ త్రాగుతున్నా నివారించమని చెప్పండి. లేదా వారికి దూరంగా ఉండండి. ఎదుటివారు త్రాగేటప్పుడు, ఆ పొగను గర్భిణీ స్త్రీలు పీల్చినా కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ సెకెండ్ హ్యాడ్ స్మోక్ వల్ల మీకు మీతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా హానికలిగిస్తుంది.

English summary

Tips For Better Sleep During Pregnancy

It is very hard for the expectant mother to get some good night's rest. With each trimester of pregnancy, the expectant mother is faced with a new sleeping challenge. The most common reason for less sleep during pregnancy is the increasing size of the fetus.
Desktop Bottom Promotion