For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ ఉన్న గర్భిణీ స్త్రీలు తీసుకోవల్సిన జాగ్రత్తలు

By Lakshmi Perumalla
|

మీ గర్భధారణ సమయంలో డయాబెటిస్ ఉంటే కనుక అనేక సవాళ్ళు మరియు పరిస్థితి కొంచెం క్లిష్టముగా ఉంటుంది. మీరు ఒక గర్భవతి మధుమేహం రోగి అయితే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ అనేది ముఖ్యమైన గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటి అని చెప్పవచ్చు. గర్భధారణ మధుమేహం అనేది మీ ఆరోగ్యానికి హాని కలగదు. కానీ మీ పుట్టే బిడ్డ పెరుగుదల మరియు పనితీరు మీద మాత్రమే ప్రభావితం చేస్తుంది. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ పరిధిలో ఉంచుకోవటం అనేది గర్భస్రావం ప్రమాదాన్ని తగ్గించేందుకు చాలా కీలకమైనది. ఒకవేళ గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే నిర్జీవ జననం,ముందుగా జననం,పుట్టుకతో వచ్చే లోపాలు,అదనపు పెరుగుదల మరియు తల్లి మరియు బిడ్డ కొరకు ఇతర సమస్యలు వస్తాయి.

మీ గర్భధారణ యొక్క ప్రారంభ దశలలో మధుమేహం తనిఖీ చేయటం అనేది గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటి. ప్రారంభ గర్భధారణ కాలం ఒక కీలకమైన సమయం అని చెప్పవచ్చు. ఆ సమయంలో పిండం యొక్క గుండె,మెదడు,మూత్రపిండాలు,ఊపిరితిత్తుల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే జనన లోపాలకు కారణం కావచ్చు.

గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మీరు ఇటువంటి సందర్భాలలో కొన్ని సులభమైన మరియు సమర్థవంతమైన చిట్కాలు సహాయపడవచ్చు. ఇక్కడ గర్భవతి మధుమేహ రోగులకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి మీకు ఒక ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన గర్భంనకు సహాయం చేస్తాయి.

1.మీ రక్తంలో చక్కెర నియంత్రణ

1.మీ రక్తంలో చక్కెర నియంత్రణ

మీరు గర్భవతి మధుమేహ మహిళ అయితే క్రమం తప్పకుండా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేయడం అనేది గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ముఖ్యమైనది. ఒక సాధారణ స్థాయిలో ఉంచడానికి మరియు ఒక ఆరోగ్యకరమైన గర్భంనకు కృషి చేయాలి.

2. వ్యాయామం

2. వ్యాయామం

మీరు గర్భవతి ఉన్నప్పుడు భారీ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ,మీరు ఒక గర్భవతి మధుమేహ మహిళ అయితే ప్రత్యేకించి తక్కువ నడక మరియు తేలికపాటి వ్యాయామాలు చేయటం అనేది గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటిగా చెప్పవచ్చు.

 3. వైద్య పరీక్షలను మిస్ చేయకూడదు

3. వైద్య పరీక్షలను మిస్ చేయకూడదు

మీరు ఖచ్చితంగా రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవాలి. మీరు తరచుగా మధుమేహంను చెక్ చేసుకోవటం ముఖ్యం. మీరు పరిస్థితిని పర్యవేక్షించడానికి రక్తం మరియు మూత్రంలో పరీక్షలు నిర్వహించాలి

4. ఆరోగ్యకరమైన జీవనశైలి

4. ఆరోగ్యకరమైన జీవనశైలి

ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి వలన మీ జీవితం మరియు జీవన శైలి బాగుంటుంది. మంచి సమతుల్య ఆహారం తప్పకుండా తీసుకోవాలి. మీరు గర్భవతి మరియు మీ జీవితం పట్ల సానుకూల వైఖరి కలిగి ఉన్నప్పుడు వ్యాయామాలు చేయండి. అప్పుడు మీ జీవితంలో అనుకూలమైన వ్యత్యాసాలను గమనించవచ్చు.

5. జంక్ ఆహారాలు మానాలి

5. జంక్ ఆహారాలు మానాలి

ఒక సమతుల్యమైన ఆహారం తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ముఖ్యం. అధిక మొత్తంలో చక్కర కలిగిన మరియు ప్రాసెస్ లేదా తయారు చేసిన ఆహారాలను మానాలి. ఒక గర్భవతి మధుమేహ రోగి జంక్ ఫుడ్ మానివేయటం అనేది ముఖ్యమైన గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటి.

 6. ఆరోగ్యకరమైన ఆహారం

6. ఆరోగ్యకరమైన ఆహారం

ఒక ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించాలి. మధుమేహం ఉన్నవారు నియంత్రణగా ఉండటం అనేది గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటి. మీరు ఒక గర్భవతి మధుమేహం స్త్రీ అయితే మీ రక్తంలో గ్లూకోజ్ పెంచే ఆహారాలను మానివేయాలి.

7. యోగ

7. యోగ

యోగ మరియు ధ్యానం మీ శరీరం మరియు మనస్సు లను సంతులనంగా ఉంచడానికి ఉత్తమమైన పద్ధతి అని చెప్పవచ్చు. మీ హార్మోన్ లను సంతులనంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మీరు ఒక గర్భవతి మధుమేహం స్త్రీ అయితే మీరు ప్రినేటల్ యోగ తరగతులకు హాజరు కావచ్చు.

8. రిలాక్స్

8. రిలాక్స్

గర్భధారణ మధుమేహంలో మీ మూడ్ బాగుండేలా చూసుకోండి. ఒక గర్భధారణ ఆరోగ్యానికి సవాలుగా ఉంటుంది. అంతేకాక నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి. మీరు ఒక గర్భవతి మధుమేహ మహిళ అయితే కనుక ఒత్తిడి మరియు స్ట్రైన్ లను నివారించాలి.

9. రికార్డులు ఉంచండి

9. రికార్డులు ఉంచండి

ఇది చాలా ఉపయోగకరమైన గర్భవతి ఆరోగ్య చిట్కాలలో ఒకటి.మీరు మీ రక్తంలో చక్కెర స్థాయి తనిఖీ చేసిన ప్రతిసారి రికార్డు చేయాలి. ఇది సరైన అంచనా మరియు చికిత్స మార్పు కోసం మీ వైద్యునికి సహాయం చేస్తుంది.

10. వైద్య సలహా పొందాలి

10. వైద్య సలహా పొందాలి

మీకు ఒక గర్భవతి మధుమేహ వ్యాధి ఉంటే ఒక అనుభవం గల వైద్యుడు యొక్క సూచనలను అనుసరించండి. మీరు స్వీయ మందులను ఎంచుకోకూడదు. ఎందుకంటే అవి మీకు మరియు మీకు పుట్టే బిడ్డకు సురక్షితం కాదు.

English summary

Tips For Diabetic Pregnant Women

If you have diabetes, your pregnancy will be more challenging and complicated. If you are a pregnant diabetes patient, blood glucose control is one of the most important pregnant health tips.
Story first published: Saturday, December 7, 2013, 14:48 [IST]
Desktop Bottom Promotion