For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరిచే చిట్కాలు

|

సంతానోత్పత్తి కార్యక్రమంలో పునరుత్పత్తి ఆరోగ్యం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైద్య కారణాలు, పర్యావరణ కారకాలు, జన్యు శాస్త్రం లేదా జవీనశైలి మొదలగునవి అనేకం ఉన్నాయి.

మహిళలు సంతానం పొందడానికి ఒక మంచి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. మీలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాల గురించి బాగా తెలిసి ఉండాలి మరియు అదే సమయంలో ఆ ప్రభావితం చేసే అంశాలను నివారించడానికి మీరు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇలా తెలుసుకొన్నప్పడు సంతానోత్పత్తిని తప్పకుండా సాధించవచ్చు. మీ జీవితం లో కొన్ని సులభమైన నియమాలు మరియు నిత్యకృత్యాలను అనుసరించడం ద్వారా మీ సంతానోత్పత్తి మెరుగుపరుచుకోవచ్చు. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచిచే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించండి....

డైట్:

డైట్:

మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యంపై ఆహారం చాలా ప్రభావం చూపుతాయి. మహిళలు జంక్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మహిళల్లో హార్మోనుల ప్రభావం వల్ల పునరుత్పత్తి మీద ప్రభావం చూపుతాయని నిరూపించబడ్డాయి. మహిళల్లో పునరుత్పత్తి మెరుగుపరచడం కోసం వారి రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.

బరువు తక్కువగా ఉండడం కూడా సమస్యేనా?:

బరువు తక్కువగా ఉండడం కూడా సమస్యేనా?:

బరువు తక్కువగా ఉండడం కూడా అండాశయ సంబంధిత సమ స్యలకు, తద్వారా సంతానలేమికి కారణమవుతుంది. ఉండాల్సిన బరువులో 10-15 శాతం తక్కువగా ఉండడం కూడా సమస్యలకు కారణం కావచ్చు. తక్కువ బరువు ఉండే మహిళలు బరువు పెంచు కున్న తరువాత సంతాన సాఫల్యత అవకాశాలు పెరిగిన దాఖలాలున్నాయి. అందుకు రెగ్యులర్ గా బాడీ మాస్ ఇండెక్స్ ను అనుసరించాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోనుల అసమతౌల్యనం మెరుగు పరుచుకోవడానికి బరువు నియంత్రించుకోవడం చాలా అవసరం.

వృత్తి స్పందన:

వృత్తి స్పందన:

వృత్తి పరంగా రేడియేషన్ మరియు రసాయనాలు నిరంతరం బహిర్గతం మీ సంతానోత్పత్తి స్థితి మీద ప్రభావితం చేస్తుంది. మరికొన్ని రసాయనాలు మిమిక్ హార్మోనులు అంటే ఈస్ట్రోజెన్ వంటివి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీ వర్క్ ప్లేస్ ను సురక్షితంగా ఉంచడంలో మహిళల్లో సంతానోత్పత్తి మెరుగుపరిచే సమర్థవంతమైన చిట్కాలలో ఇది ఒకటి.

ఫ్లోలిక్ యాసిడ్:

ఫ్లోలిక్ యాసిడ్:

గర్భవతి అవగానే ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తల్లికి పుట్టబోయే బిడ్డకు మొదటి త్రైమాసికంలో అత్యవసరం. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం. దీనినే విటమిన్ బి 9 అని కూడా అంటారు. శరీరంలో కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. పాత కణాలను పునరుజ్జీవిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీలో దాని పాత్ర ప్రధానమైంది. ప్రెగ్నెన్సీలో పునరుజ్జీవ కణాలు పది రెట్లుగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాలను పుట్టిస్తుంది. అంతే కాక నరాలకవసరమైన సెరోటోనిన్ కూడా ఇస్తుంది. డాక్టర్లు గర్భవతులు ఒక సంవత్సరం ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సలహా ఇస్తారు. తర్వాతి దశలలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం పెరగాలే గాని తగ్గరాదు.

వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బీఎంఐ 18.5 నుంచి 25 కి.గ్రా / ఎం2 వరకు ఉండి, ఎలాం టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే స్ర్తీ, పురుషులి ద్దరూ వ్యాయామం చేయడం మంచిది. ఆహారంలో తీసుకునే కేరీలను తగ్గించడం (సమతుల్య ఆహారం తీసుకో వాలి), కేరీల వ్యయాన్ని అధికం చేయడం రెండూ చేస్తే శరీర బరువు తగ్గించుకోవచ్చు.గర్భం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లైతే, వ్యాయామం మీ దిన చర్యలో చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు గర్భం పొందడానికి శరీరం ఫిట్ గా సౌకర్యవంతంగా ఉంటుంది. బ్యాలెస్డ్ లైఫ్ స్టైల్ వల్ల మీరు యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. పాశ్చాత్య జీవన విధానం వల్ల బరువు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అధిక బరువు వల్ల సంతానలేమి ఎదుర్కోవల్సి వస్తుంది.

జీవనశైలి:

జీవనశైలి:

ఆరోగ్యకరమైన జీవన శైలి వల్ల మీలో పునరుత్పత్తి వ్యవస్థ చాలా వేగంగా మెరుగుపడుతుంది. అందుకు మద్యం, ధూమపానం, మరియు రిక్రియేషనల్ డ్రగ్స్ వంటి వాటి జోలికి పోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక బ్యాలెన్స్ డైట్ ను మరియు వ్యాయమం మరియు భావోద్వేగపు జీవనశైలి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పునరుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది.

వైద్య పరీక్షలు:

వైద్య పరీక్షలు:

కొన్నిరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే మందులు గర్భధారణ శక్తిపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నించే మహిళలు ఇలాంటి మందులను గనుక వాడుతుంటే ప్రత్యామ్నాయ మందుల కోసం డాక్టరును సంప్రదించాలి. మహిళల్లో ముఖ్యంగా సరైన డాక్టర్ సలహాలను పాటించాలి. మీలో రుతుక్రమ సమస్యలు లేదా ఇతర పునరుత్పత్తి సమస్యలకు సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

భావోద్వేగపు ఆరోగ్యం:

భావోద్వేగపు ఆరోగ్యం:

ఒత్తిడి అనేది మహిళలలో సంతానోత్పత్తి మీద పెద్ద ప్రభావం కలిగి ఉంటుంది. పురుషులలో స్పెర్మ్ ప్రొడక్షన్ మరియు కోరిక తగ్గుతుంది. మానసిక ఒత్తిడి ఉండేటప్పుడు స్త్రీ శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం సంతానలేమికి దారితీస్తుంది. గర్భనిరోధక మాత్రలు కూడా అండం విడుదలకు అవరోధంగా మారుతాయని చెపుతున్నారు. కాబట్టి, గర్భం పొందగోరు వారు ఎల్లప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.

ఫ్యామిలీ హిస్టరీ:

ఫ్యామిలీ హిస్టరీ:

మీ ఫ్యామిలీ మెడికల్ హిస్టరీని ఒక సారి తిరగేయండి, అక్కడ ఏదైనా వైద్య సలహాలు అవసరం అవుతాయోమో ఒక సారి చర్చించండి. చాలా త్వరగా సంతానలేమికి కారణాలను తెలుసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం . తద్వారా మహిళల్లో అతి త్వరగా పునరుత్పత్తిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.

English summary

Tips to improve fertility in women

Reproductive health has an important role in your fertility. There are many factors that can affect your fertility. It can be medical reasons, environmental factors, genetics or lifestyle.
Story first published: Wednesday, October 16, 2013, 16:57 [IST]
Desktop Bottom Promotion