For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల కొరకు కొన్ని దీపావళి జాగ్రత్తలు..చిట్కాలు

|

దీపావళి దగ్గరలో రాభోతోంది. ఈ పండుగ మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన అతి పెద్దగ పండుగ, జాతి, మతం, కలం, పెద్దా, చిన్న అన్న బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకొనేది ఈ పండుగ. ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ రోజున లక్ష్మీ మరియు గణేషున్ని పూజిస్తారు. కుటుంబ సభ్యులు మొత్తం సంతోషంగా గడపడానికి ఇది ఒక ఉత్తమమైన రోజు. అయితే, గర్భిణీ స్త్రీలు మాత్రం, ఈ పండుగ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు రిస్కీ కూడా...

గర్భిణీ స్త్రీలకు ఒక ఎకో సేఫ్ దివాళీ ఒక ఉత్తమ చిట్కా. మరీ ముఖ్యంగా, ఈ పండుగ రోజున గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, ఈ దీపావళి సందర్భంగా గర్భిణీ స్త్రీల కోసం కొన్ని ఉత్తమ చిట్కాలను బోల్డ్ స్కై టీమ్ మీకు అంధిస్తోంది.

Tips For Pregnant Women On Diwali

1. సౌకర్యవంతంగా ఉండాలి : ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సింథటిక్ లేదా ఫ్యాబ్రిక్ వంటి దుస్తులకు దూరంగా ఉండాలి. కాటన్ వస్త్రాలను ధరించాలి . దాంతో వారు సురక్షితంగా ఉండవచ్చు. అంత త్వరగా నిప్పు అంటుకోవడానికి అవకాశం ఉండదు. హెవీ గా దుస్తులను ధరించడం వల్ల అసౌకర్యంగా ఉండటంతో పాటు రిస్కీ కూడా..

2. క్రాకర్స్ ను అవాయిడ్ చేయాలి: ప్రతి సంవత్సరంలాగే, ఈ సవంత్సరం కూడా మీకు క్రాకర్స్ కాల్చాలిని ఇష్టం ఉంటుంది. కానీ, మీరు గర్భిణీగా ఉన్నప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చాలా ప్రమాదకరమైనవి, ముఖ్యంగా వీటితో వచ్చే పొగ మరియు కాలుష్యంలె కార్బన్ డైయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి చాలా కాబోయే తల్లులకు మరియు కడుపులోని బిడ్డకు కూడా చాలా హానికరం. పొగ వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి.

3. ఆహారం: పండుగ వేళల్లో పనులతో బిజీగా ఉండిపోయే, సరైన టైమ్ కు తినకుండా, ఆహారనియమాలు పాటించరు. మీపనులు చక్కబెట్టుకుంటూనే మద్య మద్యలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మర్చిపోకండి. మీ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకండి . సరైన ఆహారంను తీసుకుంటా అధికంగా స్పైసీ మరియు ఆయిల్ ఫుడ్స్ ను నివారించండి . దీపావళి అంటేనే స్వీట్స్. స్వీట్స్ ఎక్కువగా తయారుచేస్తుంటారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు స్వీట్స్ కు దూరంగా ఉండండి. దీపావళి సమయంలో ఈ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యమైన చిట్కా. అలా కాకుండా స్వీట్స్ అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రేషనల్ డయాబెటిస్ కు గురికావల్సి వస్తుంది.

4. మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు: ఇంటిపనుల్లో నిమగ్నం అయినప్పుడు గర్భిణీ స్త్రీలకు మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తులు ఎక్కడం, రసాయనాలతో బాత్ రూమ్ లు, సామాన్లను కడగడం వంటివి చేయకూడదు. పనులు చేసేటప్పుడు చాలా వరకూ చిన్ని చిన్న ప్రమాదాలు ఎదుర్కొంటుంటారు మహిళలు. ముఖ్యంగా ముందుకు వెనుకకు వంగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary

Tips For Pregnant Women On Diwali

One of the most important and big Hindu festivals Diwali is around the corner. Every one is getting prepared for welcoming Goddess Lakshmi and Lord Ganesha at home. Diwali is the time to rejoice and have fun with family members. However, pregnant women needs to be very careful as the festival is not only loud, but risky too.
Story first published: Monday, October 28, 2013, 15:46 [IST]
Desktop Bottom Promotion