For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల్లో ఫైల్స్ నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు...

|

Tips to Prevent Piles(Hemorrhoids) During Pregnancy
ఫైల్స్ (హీమరామడ్స్‌)లను సాధారణంగా అర్షమొలలు అంటారు. పైల్స్‌(మొలలు) సమస్య స్త్రీలల్లో గర్భం దాల్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భం దాల్చాక ముందు లేని సమస్యలు గర్భం దాల్చిన తర్వత రావటానికి గల కారణం హార్మోనుల ప్రభావం పెరుగుట, గర్భాశయం పరిమాణం పెరగడమే. గర్భిణీ స్త్రీల్లో సాధారణంగా ప్రొజెస్టోజెన్‌ హార్మోన్‌ ఎక్కు వగా ఉండి శరీరంలోని రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచం చెంది ఉంటాయి. అలాగే మల ద్వారం వద్ద ఉన్న రక్త నాళాల పరిమాణం పెరిగి అవి ఉబ్బినట్లు అయి పైల్‌(మొలలు)కు దారి తీస్తుంది. గర్భిణిల్లో గర్భాశయం పరిమాణం పెరుగుటవలన అంతర్గత ఒత్తిడి కలగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. దాంతో మల విసర్జనకు బలవంతగా ప్రయత్నం చేయట వలన కూడ పైల్స్‌ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇంతగా బాధించే పైల్స్‌ సమస్యను బయటకు చెప్పకోలేక చాలా మంది లోలోన మదన పడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

లక్షణాలు ఎలా ఉంటాయి: మల విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతుంది. మలవిసర్జన తర్వాత కూడా కొందరిలో నొప్పి మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జ సమయంలో మొలలు(పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. ప్రతి రోజూ పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకొంటుండాలి.
2. నీరు ఎక్కువగా (కనీసం రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసులు)తాగాలి. ఫ్రూట్ జ్యూసులు తీసె
3. రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లు చూసుకోవాలి. రెస్ట్ రూమ్ కు వెళ్ళాలి అనిపించినప్పడు వెంటనే వెళ్ళాలి.
4. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుల్లు, మాంసాహరాలు, చిరుతిళ్ళు తినటం మానుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి.
5. నిద్రపోయే సమయంలో ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల కొంత ఉపమశమం పొందవచ్చు.

గర్భిణీ స్త్రీల్లో ఫైల్స్ నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు:

ఆహారపరంగా: నూనెలో వేయించిన మాంసము, పిండివంటలు, బిర్యాని, బంగాళదుంప, చామగడ్డ, వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది. ఉప్పు, పులుపు, నిల్వ పచ్చళ్లు, కారము,ఆవాలు అధికంగా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది.

పొడిగా ఉండే ఆహారమే తీసుకుని పీచు పదార్దాలు తినని వారికి కూడా ఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. నీరు తక్కువ, ఎండు ఆకుకూరలులను ఎక్కువగా తీసుకోవడం, పదే పదే కాఫీ, టీ అధికంగా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.

గర్భిణీ స్త్రీలల్లో గర్భస్రావము జరిగునపుడు, విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది. అధిక వేడి ప్రదేశంలో పనిచేసేవారు, దృఢమైన ఆసనంపై కూర్చునే వారు, ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకోని వారు ఈ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ.

ఆహార నియమాలు: మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం అన్నిటికంటే ప్రధానం. రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బీరకాయ, ఆనప, పొట్ల, కంద, బచ్చలి, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి.

కొబ్బరి నీళ్లు, పాలు, వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల శరీరానికి చలవచేస్తుంది. మెత్తటి పరుపుమీద కూర్చోవడం, వేడినీళ్ళతో స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం ఎక్కువగా చేయడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి.

English summary

Tips to Prevent Piles(Hemorrhoids) During Pregnancy | గర్భిణీ స్త్రీల బాధించే పైల్స్‌.. నివారణోపాయాలు

Hemorrhoids are varicose veins of the rectum. Women often experience hemorrhoids during pregnancy because of hormonal changes that slow down digestion, causing constipation and the additional pressure put on the veins of the lower body by the growing uterus and increase in body weight. You can help prevent hemorrhoids during pregnancy by adjusting your diet and routine to reduce constipation and pressure on the rectal veins.
Story first published:Wednesday, January 30, 2013, 15:14 [IST]
Desktop Bottom Promotion