For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాఖాహార గర్భిణి స్త్రీలకు అత్యవసరం అయ్యే ఆహారాలు

|

సాధారణ మనుషులు తీసుకొనే ఆహారంతో పోల్చితే గర్భిణీ స్త్రీలు మరింత బలమైన, పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. తల్లితో పాటు, కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యానికి, పెరుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం. అందులోనూ మీరు వెజిటేరియన్ అయితే, మీ తొమ్మిదినెలల గర్భధారణ కాలం సురక్షితంగా గడవాలంటే కొన్ని ఆహారాలను మీ డైట్ లిస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎటువంటి ఆహారాలను తమ డైట్ లిస్ట్ లో చేర్చుకొని తప్పనిసరిగా తీసుకోవాలో తెలుసుకోవాలి. అటువంటి వారికోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడానికి బోల్డ్ స్కై కొన్నింటిని లిస్ట్ అవుట్ చేయబడింది. వాటిని పరిశీలించి, హల్తీ వెజిటేరియన్ డైట్ ద్వారా ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ శరీరంలోని శోషించడం వల్ల బేబీ గ్రోత్ చాలా సురక్షితంగా ఉంటుంది.

వెజిటేరియన్స్ తప్పనిసరిగా మంచి పోషకాహారంను మరియు ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో తల్లి తీసుకొనే ఆహారం ద్వారా శిశువు కూడా పోషకాంశాలను గ్రహించబడుతుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్రీ తీసుకొనే వెజిటేరియన్ డైట్ రోజు..రోజుకి, వారం వారంకు శిశువు బలాన్ని మరియు శిశువు పెరుగుదలకు ఉపయోగపడేవిగా ఉండాలి.

వెజిటేరియన్ గర్భిణి స్త్రీలను తినడానికి మార్కెట్లో వివిధ రకాల వెజిటేబుల్స్ మరియు వెజిటేరియన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వాటిని ప్రధానమైనవి ఎంపిక చేసుకొని తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి గర్భిణీ స్త్రీలకు కోసం లిస్ట్ అవుట్ చేసిన కొన్ని బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్స్ ను క్రింది స్లైడ్ లో ఇవ్వబడ్డాయి. ఈ ఆహారాల్లో పుష్కలమైన విటమిన్స్, మినిరల్స్ తీసుకోవడం వల్ల గర్భిణీస్త్రీల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. మరి గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ తీసుకోవల్సి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్( ఆకుకూరలు):

ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది

బీన్స్:

బీన్స్:

గర్భిణి స్త్రీ బీన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. బీన్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. డైరీప్రొడక్ట్స్ లో ఉన్నంత క్యాల్షీయం ఈ బీన్స్ లో కూడా పుష్కలంగా ఉంటుంది కిడ్నీ బీన్స్ లో పీచు వుండటమే కాదు, ఐరన్ కూడా వుంటుంది. బేబీలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఇది చాలా ప్రధానం.

బాదం:

బాదం:

బాదాంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

టోఫు:

టోఫు:

టోఫులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ స్త్రీలకు చాలా అవసరం. టోఫులో పుష్కలంగా ఉండే క్యాల్షియం బేబీ బోన్ డెవలప్ మెంట్ కు బాగా సహాయపడుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్:

ఒక గుప్పెడు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒక గుప్పెడు ప్రొద్దుతిరుగుడు గింజల్లో అధిక శాతంలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం చేత గర్భిణీలకు అవసరం అయ్యే శక్తిని అంధిస్తుంది.

నట్స్:

నట్స్:

ఒక గుప్పెడు నట్స్ (బాదాం మరియు పిస్తా)వంటి వాటిని తప్పని సరిగా తినాలి. ఈ నట్స్ బేబీకి ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వెజిటేరియన్ ఉమెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి.అందులో వివిధ రకాల నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శిశువు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు బాగా సహాయపడుతాయి. అంతే కాదు, గర్భధారణ సమయంలో గర్భిణిస్త్రీలో ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

వెజిటేరియన్స్ వారి, రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలతో తయారు చేసి ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ ను పుష్కలంగా పొందవచ్చు . ముఖ్యంగా ఫీటస్ (పిండం)ఎదుగుదలకు ఐరన్ చాలా అత్యవసరం. కాబట్టి, కాబోయే తల్లులు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

బెస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి. ప్రతి వెజిటేరియన్ గర్భిణీ స్త్రీ తన డైలీడైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన ఆహారాల్లో డ్రైఫ్రూట్ కూడా ఒకటి. వీటి నుండి ఒక సమతుల్యమైన ఐరన్ కంటెంటును పొందవచ్చు. అంతే కాదు, ఈ ఐరన్ కంటెంట్ ను కడుపులో పెరిగే గర్భిణీ స్త్రీకి చాలా అవసరం.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్:

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

గర్భిణీ స్త్రీలు క్యాలరీలను తగినంత పొందాలి. అందువల్ల బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. శాఖాహార గర్భిణీ స్త్రీలకు ఇవి తప్పనిసరి. కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు, మితంగా తీసుకోవడం గర్భిణీ ఆరోగ్యానికి చాలా ఉత్తమం.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్లు ఆరోగ్యకరమైన ఆహారం. నేటి రోజులలో ఓట్ గింజలను చాలా మంది అధికంగా తింటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు వుంటాయి. కడుపు నింపుతాయి. కరిగే పీచులు మీ శరీరంలోని మలినాలను విసర్జిస్తాయి. టోఫు, సోయాబీన్స్, వాల్ నట్స్ వంటివి కూడా ఆహారంగా ఇస్తే, వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి. గర్భిణీ స్త్రీ తన బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ను చేర్చుకోవచ్చు. ఈ ఆహారం గర్భిణికి అవసరం అయ్యే విటమిన్ కెను పుష్కలంగా అంధిస్తుంది.

English summary

Vegetarian Pregnant Women: Diet Tips

Vegetarians should follow a good and healthy diet during pregnancy so that the baby receives all the minerals absorbed from the expectant mother. A vegetarian diet during pregnancy should contain a good amount of ingredients which will substitute to giving the baby strength and forming of the foetal's development from week to week.
Desktop Bottom Promotion