For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు అత్యవసరమయ్యే టాప్ 23 విటమిన్ ఫుడ్స్

|

మహిళలలు గర్భం ధరించిన తర్వాత కడుపులో పెరిగే బిడ్డతో సహా, తల్లికి కూడా అనేక రకాల విటమిన్స్ అవసరం అవుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు విటమిన్ ఎ, డి, సి లు చాలా అవసరం. సాధారణంగా కంటే గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలకు విటమిన్ ఫుడ్స్ ఎందుకు అవసరం అంటే? ఎందుకంటే కడుపులో పెరిగి శిశువు పెరుగుదలకు, మరియు ఆరోగ్యానికి చాలా అవసర అవుతాయి.

గర్భిణీలకు అవసరం అయ్యే ఈ విటమిన్స్ కొన్ని నేచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను డాక్టర్ సలహా మేరకు రెగ్యులర్ గా ప్రతి రోజూ లేదా వీక్లీ తీసుకోవల్సి ఉంటుంది. గర్భణీస్త్రీలు తీసుకోవల్సిన 5 ఖచ్చితమైన విటమిన్స్ ఫుడ్స్ ను బోల్డ్ స్కై పట్టిక తయారు చేసి, మీకు అందిస్తోంది. గర్భిణీ స్త్రీలు, ఇటువంటి ఆహారాలు తీసుకోవడాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి . అలాగే ఇలాంటి విటిమన్ ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకొనే ముందు మీ గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. విటమిన్ మోతాదు ఎక్కవైన శిశువు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

గర్భిణీ స్త్రీలు ‘విటమిన్ ఎ'ఎందుకు తీసుకోవాలి? విటమిన్ ఏ శిశువులో ఎముకలు ఏర్పడటానికి, మరియు దంతాల ఏర్పాటు, అభివృద్ధి ఇవి బాగా సహాయపడుతాయి. గర్బిణీ స్త్రీలకు ‘విటమిన్ సి' ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంపొంధించడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ‘విటమిన్ డి' చాలా అవసరం. గర్భాధారణ సమయంలో, గర్భణీ స్త్రీ తీసుకొనే ఆహారం ద్వారా శరీరంలో క్యాల్షియం మరియు ఫాస్పరస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ‘విటమిన్ ఇ'గర్భంలో శిశువు శరీరరూపం, మరియు రెడ్ బ్లడ్ సెల్స్ మరియు కండారల ఏర్పాటు సహాయపడుతుంది. అదే విధంగా అతి తక్కువ మోతాదాలులో ‘విటమిన్ కె'బరువు తక్కువగా పుట్టే పిల్లల, ప్రీమెచ్యుర్ డెలివరీ వంటి వాటిని అడ్డుకోవడానికి సహాయపడుతుంది.

అందువలన, గర్భధారణ సమయంలో మీరు ఏఏ విటమిన్ ఆహారాలు తీసుకోవాలో పరిశీలించండి...

1.విటమిన్ ఎ:

1.విటమిన్ ఎ:

పాలు: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవడం, గర్భిణీకి చాలా ఆరోగ్యకరం. బాగా కాచీ, మీగడ తీసేసిన పాలను తీసుకోవాలి.
2. విటమిన్ ఎ:

2. విటమిన్ ఎ:

గుమ్మడి: చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన గుమ్మడి రుచికరమైన కర్రీగా తయారువుతుంది. పుష్కలమైన ఈ విటమిన్ ఎ ఆహారం గర్భిణీ స్త్రీలో ఆరోగ్యకరమైనది.

3. విటమిన్ ఎ:

3. విటమిన్ ఎ:

గుడ్లు: గర్భంలో పిండం ఏర్పాటు విటమిన్ ఎ చాలా అవసరం. కాబట్టి, వారంలో ఒకసారి లేదా రెండు సార్లు గుడ్డును తినడం చాలా అవసరం.

4. విటమిన్ ఎ:

4. విటమిన్ ఎ:

క్యారెట్: గర్భిణీ స్త్రీలు ఆకలి అనిపించినప్పుడు, ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలను తీసుకోవాలి. వీటి నుండి విటిమన్ ఎ పుష్కలంగా శరీరానికి అందుతుంది.

5.విటమిన్ ఎ:

5.విటమిన్ ఎ:

లివర్: గర్భిణీగా ఉన్నప్పుడు ఉడికించిన లివర్ తినడం ఆరోగ్యకరం. ఇందులో నుండి విటమిన్ ఎ పుష్కలంగా పొందవచ్చు.

6. విటమిన్ సి:

6. విటమిన్ సి:

స్ట్రాబెర్రీ: విటమిన్ సి పుష్కలంగా ఉండే రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ ను పచ్చివి అలాగే తినవచ్చు లేదా ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని తాగవచ్చు.

7.విటమిన్ సి:

7.విటమిన్ సి:

గ్రేఫ్ ఫ్రూట్: గర్భంలో శిశువు పెరుగుదలకు, ఈ పుల్లని గ్రేప్ ఫ్రూట్ చాలా బాగా సహాయడపడుతుంది. అలాగే తల్లిని కూడా ఆరోగ్యంగా మరియు యాక్టివ్ గా ఉంచతుంది.

8. విటమిన్ సి:

8. విటమిన్ సి:

జామకాయ: బాగా పండిన జామ పండులో ‘విటమిన్ సి' పుష్కలంగా ఉంటుంది. రోజులో ఒక సారి జామకాయను తీసుకోవండి ఒక మంచి అలవాటు.

9. విటమిన్ సి:

9. విటమిన్ సి:

టమోటో: టమోటోలను ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు, మరియు మిరియాల పొడి చిలకరించి తింటే చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది. ప్రెగ్నెసీ సమయంలో టమోటోలతో తయారుచేసి ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

10. విటమిన్ సి:

10. విటమిన్ సి:

రెడ్ పెప్పర్స్: మీకు రెడ్ పెప్పర్స్ తినడం చాలా ఇష్టం అయితే మీరు తీసుకొనే సలాడ్స్ లో రెడ్ పెప్పర్ చేర్చి తింటూ ఎంజాయ్ చేయండి!

11. విటమిన్ డి:

11. విటమిన్ డి:

గుడ్డులోని పచ్చసొన: ఉడికించిన లేదా గిలకొట్టిన గుడ్డును తీసుకోవడం ఒక మంచి పద్దతి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి పుష్కలం. ఇది తల్లి, బిడ్డకు ఇద్దరికీ ఆరోగ్యకరం.

12. రెడ్ మీట్:

12. రెడ్ మీట్:

గర్భాధారణ సమయంలో గర్భిణీ అధికంగా రెడ్ మీట్ ను తీసుకోవడం మంచిది కాదు, వారానికొకసారి లేదా 15రోజులకొకసారి తీసుకోవచ్చు. రెడ్ మీట్ లో కూడా విటిమిన్ డి ఉంటుంది.

13.విటమిన్ డి:

13.విటమిన్ డి:

చేపలు(సార్డిన్స్): ఈ టేస్టీ చేపల్లో విటమిన్ డి పుష్కలం. ఉప్పగా ఉండే ఈ చేపలు(సార్డిన్స్ ) నిల్వచేసినవైతే చాలా తక్కువగా తీసుకోవాలి.

14. విటమిన్ డి :

14. విటమిన్ డి :

మక్కెరల్: ఫ్రై చేసిన మక్కెరల్ ఫిష్, పప్పు అన్నంకి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారంలో ఒకసారైనా తినాల్సిందే.

15. విటిమిన్ డి అండ్ సి:

15. విటిమిన్ డి అండ్ సి:

ఆరెంజ్ జ్యూస్ : ఒక స్పూన్ పంచదార కలిపిన ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల, ఆరోగ్యానికి మంచిది

 విటమిన్ ఇ

విటమిన్ ఇ

నట్స్: ఒక గుప్పెడు నట్స్ (బాదాం మరియు పిస్తా)వంటి వాటిని తప్పని సరిగా తినాలి. ఈ నట్స్ బేబీకి ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

 విటమిన్ ఇ

విటమిన్ ఇ

ఆలివ్ ఆయిల్: సాధరణ నూనెలు ఉపయోగించడం కంటే ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ఉత్తమం. మీరు తినే వంటల్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను చేర్చండి. ఆరోగ్యపరంగా వ్యత్యాసాన్ని గమనించండి.

 విటమిన్ ఇ

విటమిన్ ఇ

వెజిటేబుల్ ఆయిల్: గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ ఆయిల్ కూడా చాలా ఆరోగ్యకరం. నూనెలను చాలా తక్కువగా ఉపయోగించాలి.

విటమిన్ కె

విటమిన్ కె

ఆకుకూరలు: నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది.

విటమిన్ కె

విటమిన్ కె

బీన్స్: గర్భాధారణ సమయంలో విటమిన్ కె పొందడానికి, ఎండిన బీన్స్ కూడా ఒక మంచి ఆహారపదార్థం. కానీ ఎక్కువగా తినకూడదు.

విటమిన్ కె

విటమిన్ కె

ఓట్స్: గర్భిణీ స్త్రీ తన బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ను చేర్చుకోవచ్చు. ఈ ఆహారం గర్భిణికి అవసరం అయ్యే విటమిన్ కెను పుష్కలంగా అంధిస్తుంది.

విటమిన్ కె

విటమిన్ కె

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, ద్రాక్ష, ప్లమ్స్ వంటివి గర్భినీ స్త్రీకి చాలా మంచిది. కాబట్టి గర్భిణాగా ఉన్నప్పుడు ఈ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

విటమిన్ కె

విటమిన్ కె

బీఫ్: గర్భాధారణ సమయంలో బీఫ్ తినాలనే కోరిక ఉన్నప్పుడు, తినేముందు బాగా ఉడికించి తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

English summary

Vitamin Foods To Be Consumed During Pregnancy

During pregnancy, there are a number of Vitamins one must consume for the baby's health as well as for the mother. Vitamins like A, D, C is a must for a pregnant mother to consume during her pregnancy.
Desktop Bottom Promotion