For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీకి అత్యవసరం అయ్యే ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్

|

గర్భధారణ సమయంలో మహిళలకు ఆహారం మీద ఎక్కువగా కోరికలు ఉంటాయి. వివిధ వెరైటీ ఆహారాల మీద గర్భిణీ స్త్రీలకు మనస్సు పడుతుంది. గర్భణీ స్త్రీలు కోరికలను తగ్గించుకోవడానికి ఇంట్లో వివిధ రకాల తాజా పండ్లు, వెజిటేబుల్్స్ మరియు ఇతర రుచికరమైన ఆహారాలను తీసుకుంటారు. అయితే గర్భం పొందిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ఆహారాలు తినడం వల్ల అధికబరువు పెరుగడంతో పాటు పొట్టసంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతాయి. అందుకు ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ చాలా అవసరం. కరెక్ట్ డైట్ ప్లాన్ అనుసరించినట్లైతే మీ శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ అందుతాయి.

గర్భం పొందిన తర్వాత తల్లితో పాటు, కడుపు పెరిగే పిండానికి కూడా విటమిన్స్, మినిరల్స్ మరియు ప్రోటీనలు చాలా అవసరం అవుతాయి. గర్భిణీ స్త్రీ తీసుకొనే ఆహారం ద్వారానే, కడుపు పెరిగే పిండానికి కూడా అవసరం అవుతుంది. మరియు గ్రహిస్తుంది. తల్లి తీసుకొనే ఆరోగ్యకరమైన ఆహారం మీదన కడుపులో పిండం కూడా ఆరోగ్యకరంగా అభివ్రుద్ది చెందుతుంది. గర్భధారణ సమయంలో కొంత మంది స్త్రీలు, కొన్ని ప్రత్యేకమైన రుచికరమైన ఆహారాల మీద, వారి కోరికలను కంట్రోల్ చేసుకోలేరు. అటువంటప్పుడు, వారి ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడంతో ఎటువంటి సమస్యలూ ఉండవు.

మరి గర్భం పొందిన మహిళలకోసం కొన్ని ఉత్తమమైన ఆహారాలను వారి ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో చేర్చుకోవల్సినవి ఈ క్రింది విధంగా అంధిస్తున్నాం. వీటితో తల్లితో పాటు, బిడ్డయొక్క ఆరోగ్యసంరక్షణకు కూడా కాపాడుకొన్నవారవుతారు. మరి గర్భిణీకి అత్యవసరం అయ్యే పది ప్రెగ్రెన్సీ డైట్ ప్లాన్...

క్యాల్షియం :

క్యాల్షియం :

క్యాల్షియం ఎముకలు మరియు దంతాలు బలంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. మరియు ఇది కండరాలను బలోపేతం చేయడానికి మరియు నాడీకణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది. అందుకు గర్భిణీ స్త్రీలు మిల్క్ చీజ్, పెరుగు, ఆకుకూరలు, సార్డిన్, సాల్మన్, మరియు ఇతర కొన్ని క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ చేర్చుకొని, మొదటి మూడు నెలలూ తప్పనిసరిగా తినాలి .

ఫోలిక్ యాసిడ్:

ఫోలిక్ యాసిడ్:

ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా ఎందుకు అవసరం అవుతుందంటే, బిడ్డ ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుట్టడానికి ఇవి చాలా అవసరం అవుతాయి. పచ్చిబటానీ, మరియు నట్స్ వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, వీటిని ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో చేర్చుకోవడం తప్పనిసరి.

ఐరన్:

ఐరన్:

గర్భిణీ మహిళలు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతాయి. అయితే పరిమితికి మించి తీసుకోకూడదు. ఐరన్ ఎక్కువగా తీసుకుంటే, అది మలబద్దకానికి దారితీస్తుంది. ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బి12 అండ్ డి:

విటమిన్ బి12 అండ్ డి:

ఈ రెండు విటమిన్లు గర్భిణీ మహిళలకు చాలా అవసరం . ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి. మరియు విటమిన్ బి12 మొదడ చురుకుగా పనిచేయడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి, మీ ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో సోయా మిల్క్ మరియు గుడ్లను చేర్చుకోవాలి.

నీళ్ళు:

నీళ్ళు:

గర్భిణీ స్త్రీలు సరిపడా నీళ్ళు త్రాగాలి. దాంతో శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. అలాగే ఇది శరీరంలో ప్రోటీనులను సరఫరా చేస్తుంది.

పండ్లు:

పండ్లు:

పండ్లలో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది గర్భిణీలకు చాలా అవసరం అవుతుంది . ఇది విటమిన్ ఎ గా మార్పు చెందుతంది కాబట్టి, ఇది, చర్మం, కళ్ళు మరియు ఎముకలకు చాలా అవసరం అవుతుంది . పండ్లు పుచ్చకాయ, మరియు పీచెస్ లో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీనులు:

ప్రోటీనులు:

గర్భిణీ మహిళలు వారి డైట్ ప్లాన్ లో చేర్చుకోవల్సినది ప్రోటీన్ ఫుడ్స్. ఈ ప్రోటీనులు, తల్లి, బిడ్డ ఇద్దరికి కణాలు మరియు కండరాల డెవలప్మెంట్ కు చాలా అవసరం అవుతుంది. గుడ్లు మరియు చికెన్ ఒక ఉత్తమ ప్రోటీన్ ఆహారం.

ఫైబర్:

ఫైబర్:

ప్రతి గర్భిణీ స్త్రీలోనూ మలబద్దక సమస్య ఉంటుంది . అందువల్ల ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఫైబర్ ను చేర్చుకోవడం వల్ల రెగ్యులర్ మోషన్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్రౌన్ రైస్ మరియు ధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

కార్బోహైడ్రేట్స్:

కార్బోహైడ్రేట్స్:

మీకు మరియు మీ శరీరానికి ధాన్యాలు చాలా అవసరం అవుతాయి. అందువల్ల ప్రగ్నెన్నీ డైట్ ప్లాన్ లో వీటిని చేర్చుకోవడం వల్ల అవి శక్తిని విడుదల చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అందుకు బ్రౌన్ బ్రెడ్, రైస్, బంగాళదుంపలు వంటివి ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఉంచుకోవాలి.

ఫ్యాట్స్:

ఫ్యాట్స్:

గర్భధారణ సమయంలో గర్భిణీకు ఫ్యాట్స్ అవసరం అవుతాయి. కాబట్టి, ప్రెగ్నెన్సీ డైట్ ప్లాన్ లో ఫ్యాట్స్ చేర్చుకోవచ్చు. అయితే ట్రాన్స్ ఫ్యాట్స్ ను నివారించి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ను చేర్చుకోవాలి. ఇవి చేపలు, పీనట్ బటర్ మరియు ఆలివ్ ఆయిల్స్ లో పుష్కలంగా లభ్యం అవుతాయి.

English summary

10 Essentials For Your Pregnancy Diet Plan

The best thing about being pregnant is the variety of food you can consume. You get pampered by your family into eating healthy fruits, veggies and all sorts of other delicacies to fulfill your craving. However, with these amazing foods on your plate, it is essential you follow a pregnancy diet plan so that you receive the right nutrients and minerals.
Story first published: Tuesday, March 11, 2014, 17:16 [IST]
Desktop Bottom Promotion