For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణుల్లో వెన్నునొప్పికి కారణాలు: నివారణ మార్గాలు

|

గర్భంతో ఉన్న మహిళల్లో నెలలు నిండుతున్న కొద్ది శరీరంలో వచ్చే మార్పుల వలన వెన్ను నొప్పి సమస్య వారిని పట్టి పీడిస్తుంది. కొందరిలోనైతే భరించరాని వేదన ఉంటుంది. ఈ పరిణామక్రమం మూడో నెల నుంచి ఆరంభమవుతుంది. గర్భంలో మార్పులు వచ్చే కొద్ది, తల్లి శరీరానికి ఇటువంటి తిప్పలు తప్పవు. వీటిలో ప్రధానమైనది వెన్నునొప్పి.

వెన్నునొప్పికి కారణాలు పరిశీలిస్తే....
గర్భిణుల్లో వెన్ను నొప్పికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రధానమైనవి కొన్ని మాత్రమే. కవటివలయం నుంచి గర్భాశయం వైపుకు పెరుగుతున్న కొద్ది పొట్ట-కవటివలయం ఎముకలు పెల్వస్‌ బయటకు వచ్చేస్తుంటుంది. ఫలితంగా సైక్రోఐలియాక్ జాయింట్స్‌పై భారంపడుతుంది. ఒక్కొమారు ఇవి బిగుసుకుపోతాయి. ఫలితంగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి సాధారణంగా 4 నుంచి 8 నెలల వరకూ ఉంటుంది. దీనివలన ఒకపక్కకు ఒరిగి పడుకుని మరోవైపుకు తిరగాలంటే కష్టమైపోతుంది. ఇండియన్ టాయిలెట్స్‌పై కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చుని లేచే పనులు చాలా కష్టమవుతాయి. నడక, మెట్లు ఎక్కడం, ఎక్కువ సేపు నిలబడడం సాధ్యంకాదు. మరి ఈసమస్యను నివారించుకోవాలంటే కొన్ని సులభ మార్గాలను అనుసరించాలి. ప్రెగ్నెంట్ మహిళకు బ్యాక్ పెయిన్ రాకుండా లేదా వస్తే ఏం చేయాలనేది పరిశీలిద్దాం....!

విశ్రాంతి తీసుకోవాలి:

విశ్రాంతి తీసుకోవాలి:

గర్భ సమయంలో వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుటకు సరైన భంగిమలో పడుకోవటం చాలా ముఖ్యం. కనీసం పడుకునే సమయంలో ఒక మోకాలిని వంచి పడుకోండి. మీ మోకాళ్ళ మధ్య దిండును ఉంచండి మరియు రెండవ దిండును మీ నడుము కింద లేదా పడుకోటానికి సౌకర్యవంతంగా ఉండటానికి ప్రేగ్నంసి దిండును వాడుకోండి. పడుకునేటపుడు రెండు కాళ్ళను సూటిగా చాపి పడుకోకండి, ముఖ్యంగా మూడవ త్రైమాసిక దశలో ఇలా పడుకోకండి, దీని వలన కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురి అవుతాయి.

సరైన దుస్తులను ధరించాలి:

సరైన దుస్తులను ధరించాలి:

గర్భంతో ఉన్న ఆడవారు బలహీనమైన కీళ్ళను కలిగి ఉండటం వలన త్వరగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కావున కండరాలకు బాహ్య మద్దతు తప్పనిసరి. మీ ఉదర భాగానికి మద్దతుగా ఉండే దుస్తువులను లేదా ఎక్కువ ఎలాస్టిక్ గుణాలను కలిగి ఉండే ప్రసవ సమయంలో ధరించే ప్యాంట్'లను ధరించండి. ఇవి గర్భం పైన ఎలాంటి ఒత్తిడిని కలిపించకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా మీ వెన్నెముక పైన ఒత్తిడిని పడకుండా సహాయపడతాయి.

బరువులను ఎత్తకూడదు

బరువులను ఎత్తకూడదు

రెండు పౌండ్ల కన్నా ఎక్కువ బరువు ఉండే ఏ వస్తువులను అయిన ఎత్తకండి. బరువు ఉండే వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఒకవేళ మీరే ఇలాంటి బరువు వస్తువులను ఎత్తవలసి వస్తే మీ కాళ్ళ ఆధారంగా ఎత్తండి కానీ మీ గర్భం పైన దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడకండి. మీ నడుము వంచటానికి బదులుగా మోకాళ్లను వంచి బరువు ఎత్తండి.

భౌతిక కార్యకలాపాలు

భౌతిక కార్యకలాపాలు

గర్భంతో ఉన్న ఆడవారి శరీరంలో ఉండే కీళ్ళు చాలా బలహీనంగా మారి, తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండి, త్వరగా గాయాలకు గురవుతుంటాయి, ముఖ్యంగా వారి వెన్నెముక ప్రాంతం. రోజు చిన్న చిన్న వ్యాయామాలను చేయటం వలన మీ వెన్నెముక బలంగా మారి, గర్భంతో ఉన్న ఆడ వారిలో కలిగే వెన్ను నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. మీ వైద్యుడి నుండి అనుమతి లభించిన తరువాత చిన్న చిన్న వ్యాయామాలను, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని చేయండి. మీరు చేసే వ్యాయమాలకు ముందుగా వైద్యుడిని సంప్రదించటం చాలా అవసరం. - See more at:

హైహీల్స్ (ఎత్తుగా చెప్పుల)ను వాడకూడదు

హైహీల్స్ (ఎత్తుగా చెప్పుల)ను వాడకూడదు

గర్భంతో ఉన్న ఆడవారు ఎత్తుగా ఉండే చెప్పులను వాడకూడదు. మీకు ఎత్తుగా ఉండే చెప్పులను ధరించటం చాలా ఇష్టం ఉన్న, గర్భ సమయంలో మాత్రం వీటి వాడకం నిలిపివేయాలి. తక్కువ ఎత్తు ఉన్న షూ మరియు గర్భానికి మద్దతు ఇచ్చే వాటిని వాడటం మంచిది.

నిటారుగా నిలబడాలి

నిటారుగా నిలబడాలి

గర్భంతో ఉన్న ఆడవారిలో ముఖ్యంగా మూడవ త్రైమాసిక దశలో చాలా సాధారణం అని చెప్పవచ్చు, కారణం శరీరంలో పెరిగే శిశువు పెరుగుదల వలన గురుత్వాకర్షన మూలం మారుతుంది. నిటారుగా నిలబడటం వలన శరీర బరువు మీ కాళ్ళపైన పడి ఎలాంటి ఇబ్బందుల కలగవు. నిలబడినపుడు ఇతరుల సహాయం తీసుకోవటానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం నిలబడవలసి వస్తే విరామాలను తీసుకోండి.

కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి

కూర్చొనే భంగిమ సరిగా ఉండాలి

ఎక్కువ సమయం సరైన భంగిమలో కూర్చోక పోవటం వలన నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి కలిగే అవకాశం ఉంది. కుర్చీలో వీపు సహాయంతో మరియు వెన్నెముక, మెడకు సౌకర్యవంతంగా కూర్చోండి. కూర్చునేటపుడు దిండుని వెన్నెముక క్రింది భాగంలో ఉంచి, సరిగా కూర్చోవటం వలన గర్భం పైన ఒత్తిడి లాంటివి పడవు.

వేడి లేదా చల్లటి మసాజ్ ప్రయత్నించాలి

వేడి లేదా చల్లటి మసాజ్ ప్రయత్నించాలి

వెన్ను భాగంలో నొప్పిగా అనిపించే కండరాలకు వేడి లేదా చల్లటి వాటిని తాకించటం వలన త్వరిత ఉపశమనం పొందుతారు. వెన్నుభాగంలో రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వెన్ను నొప్పిగా అనిపించినపుడు కుటుంబ సభ్యులను రాయమనండి లేదా నిపుణులతో మసాజ్ చేపించుటకు ప్రణాలికను రూపొందించుకొండి. త్వరిత ఉపశమనం కోసం, హీట్ ప్యాడ్ లేదా మంచు ప్యాక్'లను ఉపయోగించి నొప్పి నుండి ఉపశమనం పొందండి. వేడి ప్యాడ్'కి బదులుగా వేడి టవల్ లేదా తువ్వాలను వాడటం చాలా మంచిది.

బెడ్'ను సరిచేసుకోవాలి

బెడ్'ను సరిచేసుకోవాలి

సాధారణంగా మనము వాడే బెడ్'లు చాలా మృధువుగా ఉండే అధిక బరువును మోయలేనివిగా ఉంటాయి, కావున మంచి బెడ్'ను వాడండి. గర్భినులకు సరి అయిన భంగిమలో విశ్రాంతి లేదా నిద్ర చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.

వైద్యుడిని సంప్రదించాలి.

వైద్యుడిని సంప్రదించాలి.

వెన్ను నొప్పి అనేది మూత్రాశయ ఇన్ఫెక్షన్ లేదా ప్రసవానికి గుర్తులుగా కూడా చెప్పవచ్చు. మీ శరీరంలో ఎవైన గాయాలు లేదా నొప్పులను అలిగి ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అంతేకాకుండా వైద్యుడిని సంప్రదించకుండా మీరు ఎలాంటి మందులను వాడకూడదు.

English summary

10 Ways to Relieve Back Pain During Pregnancy

As the body bears the baby weight, pregnant women face a lot of body pain, the prominent one being back pain. The variation in pregnancy hormones are also a cause for the pain. Since the hormones relax the ligament, muscles and shoulders, the body tends to stretch, particularly the baby bump, putting all the stress on the lower back.
Desktop Bottom Promotion