For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో బాధకు గురిచేసే 4 విషయాలు

|

గర్భధారణ సమయంలో, గర్భిణీ శరీరంలో వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. అందులో కొన్నిసూక్ష్మ మరియు కొన్నిదీర్ఘకాలికంగా ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలో గర్భధారణ నుండి బిడ్డ పుట్టే వరకూ శరీరంలో అనేక శరీర భాగాలు భిన్నంగా ప్రవర్తించేందుకు ప్రారంభిస్తాయి. ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని అందివ్వడానికి జన్మనివ్వడంలో ఉండే అద్భుతమైన సమయం గర్భధారణ సమయం. గర్భధారణ పూర్తి కాలంలో తల్లిలో అనేక మార్పులతో పాటు, సంతోషకరమైన సమయం. నిజం చెప్పాలంటే గర్భిణీ స్త్రీలకు ఇది ఒక మ్యాజికల్ టైమ్ అనే చెప్పవచ్చు. అయితే, అదే సమయంలో కొన్ని అడ్డంకులను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

గర్భిణీలు చాలా సాధారణంగా ఎదుర్కొనే 4 విషయాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది...

వెన్నునొప్పి

వెన్నునొప్పి

గర్భధారణ సమయంలో వెన్ను నొప్పి చాలా సాధారణమైన సమస్య. అందుకు ప్రధాన కారణంతో ఉదర పొట్ట బరువు పెరుగుట వల్ల, లోయర్ బ్యాక్ ముందుకు లాగడం వల్ల ఈ వెన్ను నొప్పికి దారితీస్తుంది. కొన్ని సమయాల్లో, జాయింట్స్ కూడా వదులవడం మరియు స్ట్రెయిన్ వల్ల కండరాలు బలహీనంగా మారడం వల్ల కూడా వెన్ను నొప్పిక కారణం అవుతుంది.

పాదాలు

పాదాలు

గర్భం పొందిన తర్వాత సహజంగా బరువు పెరుగుతారు. అందువల్ల ఆ బరువు పాదాల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తుంది, దాంతో పాదాల నొప్పులు వస్తాయి. ఇది ముఖ్యంగా కీళ్ళు మరియు ఎముకలు బలహీనపడటం వల్ల ఇలా జరుగుతుంది. గర్భణీ స్త్రీలో పొట్ట ఉదర భాగంలో బరువు క్రమంగా పెరగడం వల్ల కీళ్ళు మరియు ఎముకలు బలహీనపడుతాయి . ఈ కొత్తగా అదనపు బరువు మోయడానికి గర్భిణీ స్త్రీలో వెన్నుకు తగినంత సపోర్ట్ లేకపవోడం వల్ల అకస్మాత్తుగా పాదాల్లో నొప్పి బాధాకరంగా ఉంటుంది. అయితే ఈ సమస్య చాలా తక్కువ సమయం మాత్తమే ఉంటుంది.

ఛాతీ(బ్రెస్ట్)

ఛాతీ(బ్రెస్ట్)

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలలో వచ్చే సాధారణ సమస్యలో వెన్నెముకాకుండా, ఛాతీ(రొమ్ముభాగం)లో నొప్పితో కూడా బాధాకరంగా అనిపిస్తుంది. గర్భధారణ ప్రారంభ సమయంలో, రొమ్ములు సలపడం వంటి అనుభూతి ఉంటుంది. అయితే గర్భధారణ కాలంలో కొన్ని నెలల కాలంలో శరీరం నుండి కొలెస్ట్రమ్స్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇది బ్రెస్ట్ సైజ్ ను పెంచడం వల్ల రొమ్ములలో నొప్పికి దారితీస్తుంది.

యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు కడుపు నొప్పి

యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు కడుపు నొప్పి

గర్భిణీ స్త్రీ పొట్టలో శిశువు క్రమంగా పెరగడం వల్ల అంతర్గత అవయవాలు పైకి నెట్టబడుతాయి, దాంతో పొట్టలో యాసిడ్ రిప్లెక్షన్ కు గురిచేస్తుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ అన్ని సమయంలో లేదా రోజంతా అసౌకర్యానికి గురి చేస్తుంది. గొంతు మరియు ఛాతీ దగ్గర జిడ్డైన మరియు బర్నింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది గర్భిణీ స్త్రీలో గర్భధారణ కాలం చివరి నెలల్లో ఇలా ఉండటం సాధారణం మరియు బాధాకరమైన విషయం.

English summary

4 Things That Hurt During Pregnancy

During Pregnancy, the body undergoes numerous changes -- some subtle and some others largely evident. A lot of body parts start to behave differently in order to cope with varying demands of child birth. There is absolutely no doubt that the period of pregnancy is a magical time period where you get to enjoy the most exciting fact -- giving birth to a new life.
Story first published: Thursday, July 31, 2014, 13:21 [IST]
Desktop Bottom Promotion