For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో నివారించవలసిన 6 సౌందర్య చికిత్సలు

|

గర్భధారణ సమయంలో మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు హార్మోన్ల యొక్క కాసేరోల్ గా మారటంవలన ఈ సమయంలో మీరు చాలా అలసిపోతుంటారు మరియు మీరు పార్లర్ లేదా స్పా వెళ్ళినా కూడా మీకు మంచి అనుభూతి ఉండదు. మీకు మీరే మరింత దృష్టి పెట్టి సేద తీరటానికి ప్రయత్నిచాలి.

మీరు ఈ సమయంలో తీసుకునే చికిత్సపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌందర్యచికిత్సలు చాలావరకు గర్భవతులకు సురక్షితంగానే ఉంటాయి, కానీ కొన్ని ఉండవు. మీరు గర్భం ధరించిన మొదటి త్రైమాసికంలో సమయంలో స్పాకు వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది.

గర్భధారణ సమయంలో నివారించేందుకు వివిధ సౌందర్యపద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, సౌందర్య చికిత్సలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలల కాలంలో తీసుకునే సౌందర్య చికిత్సలు కడుపులో పెరిగే బిడ్డకు హానికరం కావచ్చు.

స్పాలో పనిచేసేవారికి మీరు గర్భవతి అని బాహాటంగా చెప్పడం మంచిది మరియు వారితో ఓపెన్ కమ్యూనికేషన్ పెంచుకోవటం మంచిది.. ఈ విధంగా ఉండటం వలన వారు మీకు గర్భిణీ సమయంలో నివారించే సౌందర్య చికిత్సలను నిర్ణయించడంలో సహాయం చెయ్యగలరు. క్రింద గర్భధారణ సమయంలో నివారించవలసిన కొన్ని సౌందర్య చికిత్సలను ఇస్తున్నాము.

గర్భం ధరించినపుడు నివారించవలసిన సౌందర్య చికిత్సలు

6 Beauty Treatments To Avoid During Pregnancy

సౌందర్య ఉత్పత్తులు
గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే సౌందర్య చికిత్సల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ చర్మం గర్భధారణ సమయంలో చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ మసాజ్ మరియు శరీరాన్ని శుభ్రంచేసే సమయంలో తేలికపాటి ఉత్పత్తులు ఉపయోగించమని స్పా వారిని అడగండి. కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల వలన దురద మరియు యెర్రని దద్దుర్లు వొస్తాయి మరియు మీరు వాటిని నయం, మందులు తీసుకోవలసిన అవసరం ఏర్పడవొచ్చు. ఆ మందులు కడుపులో బిడ్డకు సురక్షితం కాకపోవచ్చు.


విద్యుద్విశ్లేషణ
విద్యుద్విశ్లేషణ; గర్భవతిగా ఉన్నప్పుడు నివారించవలసిన సౌందర్య చికిత్సల్లో ఒకటి లేదా ఉపయోగించే విద్యుత్ రకాన్ని నిర్ణయించటంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గాల్వానిక్ విద్యుతు శరీరం ద్వారా పంపబడుతుంది మరియు ఈ ప్రక్రియను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. శరీరతాప ఉపశమనం (తర్మోలిసిస్) వలన ఎటువంటి అపాయం లేదు మరియు గర్భధారణ సమయంలో మేలైనది. వాక్సింగ్ వలన కూడా చర్మం కంది చికాకు కలుగుతుంది మరియు మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటే వాక్సింగ్ నివారించండి.

అధిక శరీర ఉష్ణోగ్రత నివారించండి
శరీర ఉష్ణోగ్రతను పెంచే ఎటువంటి సౌందర్య చికిత్సనైనా గర్భవతిగా ఉన్నప్పుడు నివారించండి. ఆవిరి స్నానాలు, స్టీమ్ గది, హీట్ రాప్స్, వ్హర్ల్పూల్ మరియు హాట్ టబ్స్ వంటి సౌందర్య చికిత్సలను గర్భధారణ సమయంలో నివారించవలసినవి. కడుపులోని శిశువు చల్లబడటానికి వేరే దారి ఏమి ఉండదు, ఉష్ణోగ్రత దీర్ఘకాలిక పెరుగుదల వలన శిశువు అభివృద్ధి ప్రారంభ దశలోనే చాలా సమస్యలు తలెత్తుతాయి.

అసమాన మసాజ్
ఈ రకమైన సౌందర్య చికిత్స శరీర వెనుకభాగం, కాళ్ళు మరియు భుజాలకు చాలా మంచిది. గర్భధారణ చివరి దశలో ఈ రకమైన సౌందర్య చికిత్స చాలా సేద తీరుస్తుంది. కానీ, దీనిని తప్పు టెక్నిక్ తో మర్దన చేస్తే, వ్యతిరేక ప్రభావం కలుగుతుంది. మసాజ్ ఏ దిశలో చేస్తున్నారో ఆ దిశలో జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి మరియు మసాజ్ కు ఉపయోగించే నూనెల పట్ల కూడా జాగ్రత్త వహించటం మంచిది. మీకు ఈ నూనెల వలన ఎటువంటి అలెర్జీ లేదని నిర్ధారించుకుని చేయించుకోండి.

పాదాలకు చేసే చికిత్స
గర్భవతిగా ఉన్నప్పుడు నివారించే సౌందర్య చికిత్సల్లో ఇది ఒకటి. సంకోచాలకు కారణమయ్యే కొన్ని రిఫ్లెక్సాలజీ పాయింట్లు చీలమండ చుట్టూ ఉంటాయి మరియు కొన్ని సందర్భాలలో ఈ చికిత్స వలన సమయం కాకుండానే నొప్పులకు దారితీస్తాయి. రక్షణ ఉపయోగపడే పోలిష్ సౌందర్య చికిస్త్స ఈ సమయంలో తీసుకోవొచ్చు. మీరు ఎల్లప్పుడూ ఉపయోగించే బ్రాండ్ నే ఉపయోగించండి. పాదాలకు చేసే చికిత్స మరియు చేతుల అందాన్ని తీర్చిదిద్దే సౌందర్య చికిత్సలను గర్భధారణ సమయంలో నివారించండి.

Desktop Bottom Promotion