For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు గుడ్డు తినడం వల్ల పొందే ఆరోగ్యప్రయోజనాలు

|

గుడ్డులో అనేక పోషకాశాంలతో నిండి ఉన్నది. అందుకే దీన్ని ఒక సూపర్ ఫుడ్ లిస్ట్ లో టాప్ లో ఉన్నది . గుడ్డులో మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీనులు, ఫ్యాట్స్, మినిరల్స్, పుష్కలంగా ఉండి, మన ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన హెల్తీ పుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఉండే అనేక న్యూట్రిషినల్ బెనిఫిట్స్ వల్ల వీటిని క్రమం తప్పకుండా రెగ్యులర్ గా తీసుకోవల్సి ఉంటుంది. అటువంటి ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. పూర్తి పోషకాంశాలు కలిగినటువంటిది గుడ్డు. గర్భధారణ సమయంలో గర్భిణీలు, రెగ్యులర్ డైట్ లో గుడ్డును చేర్చుకోవడానికి గల అనేక ప్రయోజనాల గురించి బోల్డ్ స్కై వివరిస్తోంది.

గుడ్డులో పుష్కలమైనటువంటి సెలీనియం, జింక్, విటమిన్స్ ఎ, డి మరియు బి కాంప్లెక్స్ ఇవి గర్భధారణ సమయంలో గర్భిణీలకు చాలా అవసరం అవుతాయి. కాబట్టి, మహిళలు గర్భధారణ సమయంలో గుడ్డును తీసుకోవడం చాలా అవసరం. అయితే, గుడ్లను ఎంపిక చేసుకొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన, సురక్షితమైన గుడ్లను ఎంపిక చేసుకోవాలి. గుడ్లను కొనే ముందు, వాటిని స్టోర్ చేసిన కార్టన్ బాక్ మీద సెల్, బై డేట్ ను తప్పనిసరిగా గమనించాలి. తర్వాత గుడ్లను ఎల్లప్పుడు, ఫ్రిజ్ లో నిల్వచేసుకోవాలి . ఎగ్ సెల్ఫ్ లో పెట్టడం కంటే, కార్టన్ బాక్స్ లో పెట్టడం వల్ల టెంపరేచర్ ఫ్లక్టేషన్ నుండి నివారించవచ్చు.

ఎప్పుడైతే మీరు గుడ్డును పగులగొడుతారో అప్పుడు, అది ఎటువంటి ఫోయల్ స్మెల్ రాకుండా చూసుకోవాలి. ఒక వేళా అలా ఏదే చెడు వాసన లేదా దుర్వాస వస్తుంటే, వాటిని ఉపయోగించకండి. అలాగే గుడ్డులోని తెల్లని సొన జెల్ టైప్ లో చిక్కగా ఉండాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు . అలాగే గుడ్డులోని పచ్చసొన కూడా గట్టిగా చిక్కగా ఉండాలి. నీళ్ళలా జారిపోకూడదు. ఉడికించిన లేదా వండిన గుడ్లను రెండు గంటలలోపు తినాల్సి ఉంటుంది. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ పొట్టుతియ్యకుండా ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. పచ్చిగుడ్లను లేదా హాఫ్ బాయిల్ చేసిన గుడ్లను గర్భినీలు తినకూడదు. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కు గురిచేయవచ్చు. అది బిడ్డకు కూడా సోకవచ్చు.

ఈ సురక్షితమైన పద్దతులతో పాటు, గర్భధారణ సమయంలో రెండు గుడ్లను మాత్రమే తినడానికి పరిమితం చేయాలి. ముఖ్యంగా, గుడ్డులోని పచ్చసొనను తినకపోవడమే మంచిది. అందులో అధిక కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల, కొన్ని రీసెర్చ్ ల ప్రకారం, గుడ్డులో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది, మరియు చాలా తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఏదేమైనా రెగ్యులర్ డైట్ లో గుడ్డును చేర్చుకోవడానికి ముందు ఒక సారి డాక్టర్ ను సంప్రధించాలి.

గర్భధారణ సమయంలో గుడ్డు తినడం వల్ల పొందే కొన్ని ఆరోగ్యప్రయోజనాలు ఈ క్రింది విధంగా...

ప్రోటీన్స్:

ప్రోటీన్స్:

గుడ్డులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణీలకు చాలా అవసరం అవుతాయి. పొట్టలో పెరిగే బిడ్డ పెరుగుదలకు అవసరం అయ్యే ప్రతి కణంకు ప్రోటీనులు అవసరం అవుతాయి.కాబట్టి, గర్భధారణ సమయంలో గుడ్డు తినడం వల్ల కడుపు పెరిగే బిడ్డకు చాలా ఆరోగ్యకరం.

బ్రెయిన్ డెవలప్ మెంట్:

బ్రెయిన్ డెవలప్ మెంట్:

గుడ్డులో 12రకాల విటమిన్స్ కలిగి ఉండటంతో పాటు వివిధ రకాల మినిరల్స్ మరియు కోలిన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ స్ కలిగి ఉండి, కడుపులో శిశివు పెరుగుదలకు మరియు బ్రెయిన్ హెల్త్ కు బాగా సహాయపడుతాయి. అలాగే ఫీటస్ లోని నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను కూడా ఇది నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ :

కొలెస్ట్రాల్ :

నార్మల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కలిగినటువంటి మహిళలు ఒకటి లేదా రెండు గుడ్లను ప్రతి రోజూ తినవచ్చు . లోశాచురేటెడ్ ఫ్యాట్స్ డైట్ బ్యాలెన్స్ చేస్తుంది . కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటే గుడ్డు పచ్చసొనను తినకుండా నివారించుకోవాలి.

కాలరీలు:

కాలరీలు:

గర్భిణీ మహిళలు ప్రతి రోజూ 200 నుండి 300వరకూ అదనపు క్యాలరీలు కలిగి ఆహారం రెగ్యులర్ గా ప్రతి రోజూ తీసుకోవాలి . దాంతో తల్లితోపాటు, కడుపులో పెరిగే బిడ్డఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డులో 70క్యాలరీలు ఉంటుంది.

ఎలా తినాలి:

ఎలా తినాలి:

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ డైట్ లో పచ్చిగుడ్డు లేదా హాఫ్ బాయిల్ చేసిన గుడ్డును తినకూడదు. అలా తినడం వల్ల సాల్మనెల్లా ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రీమెచ్యుర్ లాబర్ ను పెంచుతుంది, యూరిన్ కాంట్రాక్షన్, డీహైడ్రేషన్, డయేరియా, మరియు వాంతులు కలిగిస్తుంది. కాబట్టి, బాగా ఉడికించిన గుడ్లను తినడం మంచిది.

జాగ్రత్తలు:

జాగ్రత్తలు:

మీరు డయేరియా, వాంతులు లేదా ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. కొంత మంది గర్భిణీ స్త్రీలలో జీర్ణక్రియ చాలా వీక్ గా మారుతుంది. కాబట్టి,మితంగా తీసుకోవాలి.

English summary

6 Benefits Of Eating Eggs During Pregnancy

Eggs are a pack of nutrients which make them count as a superfood. Eggs have essential nutrients in the form of protein, fats, minerals which make it healthy. During pregnancy, there are certain healthy foods that you must include in your diet.
Story first published: Thursday, April 24, 2014, 17:25 [IST]
Desktop Bottom Promotion