For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో నివారించవలసిన 7 విషయాలు

By Super
|

మీరు మీ గర్భధారణ సమయంలో తినే ఆహారం గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు మీరు సరైన మార్గంలో ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పులు చేయవచ్చు. ఒక ఆరోగ్యకరమైన గర్భం కొరకు ఆహారం ప్రణాళికను అనుసరించాలి. కాబట్టి గర్భధారణ సమయంలో నిషిద్ధ ఆహారాలను తప్పనిసరిగా నివారించాలి.

కెఫిన్

కెఫిన్

మీకు రోజువారీ కెఫిన్ పరిష్కారం లేకపోతె,అప్పుడు మీరు కేవలం ఒక రోజులో రెండు కప్పులు మాత్రం తీసుకోవటానికి పరిమితం చేయాలి. సాధారణంగా మీ ఆహారంలో కాఫీ తీసుకోవడం పూర్తిగా అత్యుత్తమమైనది. అయితే ముఖ్యంగా గర్భధారణ మొదటి మూడు నెలల కాలంలో అధిక కెఫీన్ తీసుకోవడం వలన గర్భస్రావాలు లేదా శిశువుకు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కెఫిన్ పరిమితంగా తీసుకోవడం మరియు నియంత్రణ కొరకు వ్యాయామం ఉత్తమ మార్గం అని ముంబై క్రీడల పౌష్టికాహార నిపుణుడు అయిన దీప్శిఖా అగర్వాల్ చెప్పారు.

పచ్చి మాంసం మరియు చేపలు

పచ్చి మాంసం మరియు చేపలు

గర్భిణీ స్త్రీల యొక్క ఆహార పట్టికలో పచ్చి గుడ్లు,మాంసం మరియు చేపలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే పచ్చి లేదా వండని సముద్రపు ఆహారం ద్వారా తల్లికి కొన్ని అంటువ్యాధులు వస్తాయి. పచ్చి గుడ్లు లేదా మాంసం కారణంగా నిర్దిష్ట పరాన్నజీవుల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. తల్లికి ఈ ఆహారాలు ద్వారా ఒక అంటువ్యాధి వచ్చిన సందర్భంలో అది మాయను దాటి పిండంను చేరే అవకాశాలు ఉన్నాయని దీప్శిఖా చెప్పారు. ఇది బిడ్డలో ముందుగా పుట్టిన లేదా మెంటల్ రిటార్డేషన్ కు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో 10 ఆహార నియమాలు గురించి తెలుసుకోవాలి.

పాశ్చరైజేషన్ చేయని చీజ్ మరియు పాలు

పాశ్చరైజేషన్ చేయని చీజ్ మరియు పాలు

గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం చాలా మంచిది. ఇది మీ కాల్షియం అవసరాల భర్తీకి సహాయపడుతుంది. అయితే పాశ్చరైజేషన్ చేయని చీజ్ మరియు పాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఎందుకంటే పాశ్చరైజేషన్ చేయని చీజ్ మరియు పాలలో ఉండే బ్యాక్టీరియా మాయను దాటి పిండంను చేరుకొని గర్భస్రావం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చీజ్ మరియు పాలను కొనుగోలు చేసేటప్పుడు లేబుల్స్ తనిఖీ చేయాలి. గర్భధారణ సమయంలో సుక్ష్మక్రిమిరహిత చీజ్ మరియు పాలు తప్పనిసరి అని FDA చెప్పింది. మీరు ప్యాకేజీ మీద 'సుక్ష్మక్రిమిరహిత'ను చూడటాన్ని విఫలమైతే,దాని ఉత్తమ ఉత్పత్తి మిస్ అవుతారని దీప్శిఖా చెప్పారు.

వీధి ఆహారాలు

వీధి ఆహారాలు

వీధుల్లో అందుబాటులో ఉండే అన్ని రకాల పదార్థాలు గర్భిణీ స్త్రీ లకు చెడు చేస్తాయి. వాటిలో ఉపయోగించే నీరు మరియు పరిశుభ్రత కారణంగా జాగ్రత్తగా ఉండాలి. వీధి ఆహారాల వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. వీధి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే వ్యాధులకు వాడే కొన్ని మందులు శిశువుకు మంచిది కాదు. గర్భధారణ సమయంలో ఒక మహిళ యొక్క నిరోధకత సాధారణంగా కంటే తక్కువగా ఉంటుంది. అందువలన సులభంగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని దీప్శిఖా చెప్పారు.

మద్యం

మద్యం

అకేషనల్ గా చాలా తక్కువగా తీసుకోవచ్చు. కానీ లిమిట్స్ దాటితే మాత్రం దాని ప్రమాదాల గురించి తెలుసుకోవాలి. గర్భధారణ సమయంలో మద్యం ఎక్కువగా తీసుకోవడం వలన తక్కువ పెరుగుదల మరియు అసమాన మెదడు అభివృద్ధికి దారితీస్తుంది.అంతేకాక శిశువుకు అసాధారణ ముఖ లక్షణాలు మరియు మెంటల్ రిటార్డేషన్ కు దారి తీస్తుందని దీప్శిఖా తెలియచేసారు. గర్భధారణ మీద మద్యం ప్రభావం గురించి మరింత తెలుసుకోండి.

సిగరెట్లు

సిగరెట్లు

సిగరెట్లు అనేవి గర్భిణీ స్త్రీలు కోసం తప్పు అని చెప్పటానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అది నికోటిన్ కలిగి ఉంది. అలాగే పొగత్రాగటం వలన నికోటిన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ గర్భం లోపల మీ బిడ్డకు హాని చేస్తుంది. బేబీకి చేరుకునే ఆక్సిజన్ తగ్గటం వలన శారీరక లోపాలు,తక్కువ బరువు లేదా జన్మతా అంగిలి పగులు వంటివి సంభవిస్తాయని దీప్శిఖా హెచ్చరిక చేసారు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ మూలికా మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గర్భధారణ సమయంలో దానిని నిలిపివేయటం మంచిది. గ్రీన్ టీ అనేది గర్భిణీ స్త్రీల కోసం మంచిదని చూపించడానికి తగినంత డాక్యుమెంటేషన్ లేదు. మీకు గర్భధారణ సమయంలో గ్రీన్ టీ అవసరం లేదు. సాదారణంగా గ్రీన్ టీ జీవక్రియ రేటును పెంచుతుంది. కానీ గర్భధారణ సమయంలో మీ జీవక్రియ స్థాయిలు అధికంగా ఉంటాయి. మరింత వేగవంతం మంచిది కాదని దీప్శిఖా చెప్పారు. గ్రీన్ టీలో కూడా కొంత కెఫిన్ ఉంటుంది. కాబట్టి పరిమితి లేకుండా త్రాగితే చాలా నష్టం కలుగుతుంది. అంతేకాకుండా గ్రీన్ టీ అధిక వినియోగం వలన ఫోలిక్ ఆమ్లం తక్కువ శోషణకు దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో మీ శిశువుకు ఫోలిక్ యాసిడ్ లోపం వ్యాధులు వస్తాయి.

English summary

7 things you should avoid during pregnancy


 You should be watchful about what you eat during your pregnancy. Sometimes you are on the right track and sometimes you make mistakes. Though a little cheating even while following a healthy pregnancy diet plan is permissible but it makes sense if you can steer clear of the following pregnancy taboo foods:
Desktop Bottom Promotion