For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ కాలంలో గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన 8 బెస్ట్ ఫుడ్స్

|

మహిళలలు గర్భం ధరించిన తర్వాత కడుపులో పెరిగే బిడ్డతో సహా, తల్లికి కూడా అనేక రకాల విటమిన్స్ అవసరం అవుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు విటమిన్ ఎ, డి, సి లు చాలా అవసరం. సాధారణంగా కంటే గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలకు విటమిన్ ఫుడ్స్ ఎందుకు అవసరం అంటే? ఎందుకంటే కడుపులో పెరిగి శిశువు పెరుగుదలకు, మరియు ఆరోగ్యానికి చాలా అవసర అవుతాయి.

గర్భిణీలకు అవసరం అయ్యే ఈ విటమిన్స్ కొన్ని నేచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను డాక్టర్ సలహా మేరకు రెగ్యులర్ గా ప్రతి రోజూ లేదా వీక్లీ తీసుకోవల్సి ఉంటుంది. గర్భణీస్త్రీలు తీసుకోవల్సిన 8 ఖచ్చితమైన విటమిన్స్ ఫుడ్స్ ను బోల్డ్ స్కై పట్టిక తయారు చేసి, మీకు అందిస్తోంది. గర్భిణీ స్త్రీలు, ఇటువంటి ఆహారాలు తీసుకోవడాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి . అలాగే ఇలాంటి విటిమన్ ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకొనే ముందు మీ గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. విటమిన్ మోతాదు ఎక్కవైన శిశువు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

 గుడ్లు

గుడ్లు

గుడ్ల నుండి అధిక మొత్తంలో ప్రోటీన్'లను మరియు వీటి వలన శరీరానికి కావలసియన అమైనో అసిడ్'లని పొందవచ్చు. గుడ్డు నుండి విటమిన్, మినరల్ మాత్రమె కాకుండా, గర్భంలో ఉండే శిశువు మెదడు అభివృద్ధికి కావలసిన 'కోలిన్' కూడా వీటి నుండే పొందవచ్చు. అంతేకాకుండా, పచ్చి గుడ్లను మరియు సరిగా ఉడకని గుడ్లను కూడా తినకూడదు.

హోల్ గ్రైన్స్

హోల్ గ్రైన్స్

గర్భంతో ఉన్న ఆడవారు తినే ఆహరంలో ఉండే కార్బోహైడ్రేట్'లను తోలగించకూడదు, ముఖ్యంగా సంక్లిష్ట ఆహర పదార్థాలు ఐరన్, విటమిన్ 'B' కాంపెక్స్ ఇతరేతర అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్'లను పొందుటకు, ఓట్మీల్, హోల్ గ్రైన్స్, పాస్తా మరియు వీట్ బ్రెడ్'లను తినండి. గర్భంతో ఉన్న ఆడవారికి ఎక్కువ మొత్తంలో ఐరన్, ఫైబర్, ఫోలిక్ ఆసిడ్'లు చాలా అవసరం. హోల్ గ్రైన్స్ బ్రెడ్, తృణధాన్యాలు పుష్కలమైన ఫోలిక్ ఆసిడ్, ఐరన్ మరియు ఫైబర్'ను పొందుటకు బ్రెడ్ మరియు రైస్'లను తినండి.

బీన్స్

బీన్స్

బీన్స్'లలో బ్లాక్ బీన్స్, వైట్ బీన్స్, పింటో బీన్స్, లేన్టిస్, బ్లాక్ ఐడ్ పీస్ మరియు కిడ్నీ, గార్బెంజో లేదా సోయా వంటివి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్'లను, ఫైబర్ మరియు పోషకాలను కలిగి ఉంటాయి. ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి చాలా రకాల పోషకాలను కలిగి ఉంటాయి. గర్భినులకు కావలసిన 5.2 ఫైబర్'లో 27 మిల్లి గ్రాముల ఫైబర్ బీన్స్ నుండి పొందవచ్చు అని 'మాయోక్లినిక్' వారు తెలిపారు.

కాల్షియం ఫుడ్

కాల్షియం ఫుడ్

శిశువు యొక్క ఎముకలు, దంతాలు మరియు కండరాల ఆరోగ్యం కోసం తప్పని సరిగా తగిన మొత్తంలో కాల్షియం తీసుకోవాలి. ఒకవేళ గర్భిణులు సరైన మొత్తంలో కాల్షియం తీసుకోకపోవటం వలన శిశువు తల్లి శరీరంలో ఉండే కాల్షియం వినియోగించుకొని, భవిష్యత్తులో 'ఒస్టియోపోరోసిస్' అనే వ్యాధి కలిగే అవకాశం ఉంది. చీస్, తక్కువ కొవ్వు ఉన్న యొగ్ హార్ట్, పాలు మరియు కూరగాయలు, బ్రోకలీలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది.

పండ్లు మరియు కూరగాయలు

పండ్లు మరియు కూరగాయలు

గర్భిణులు తప్పకుండా తాజా కూరగాయలు అయినట్టి స్పీనాచ్, క్యారెట్, అరటి పండు, ఆపిల్ వంటివి శరీరానికి అవసరం అయ్యే ముఖ్య పోషకాలను, మినరల్'లను మరియు విటమిన్'లను కలిగి ఉంటాయి. గర్భ సమయంలో స్త్రీలకూ కావలసిన విటమిన్ 'A' 'B' 'C' మరియు 'E' లతో పాటూ 'రిబోఫ్లావిన్', 'ఫోలిక్ ఆసిడ్', 'మెగ్నీషియం' మరియు 'పొటాషియం' వంటి విటమిన్'లు పండ్లు మరియు కూరగాయలలో పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ 'C' పుష్కలంగా ఉన్న ఆహరం

విటమిన్ 'C' పుష్కలంగా ఉన్న ఆహరం

విటమిన్ 'C' తల్లి మరియు శిశువులలో ప్రమాదానికి గురైన కణాలను మరమ్మత్తు చేయటమే చేయుటలో, తల్లి శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచటమే కాకుండా శరీరంలో ఐరన్ గ్రహించటాన్ని అధికం చేస్తుంది. విటమిన్ 'C' సిట్రస్ పండ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన నారింజ పండు, స్ట్రాబెర్రీ మరియు కూరగాయలు, టమాట వంటి వాటిలో పొందవచ్చు

ఫాటీ ఫిష్

ఫాటీ ఫిష్

ట్యూనా వంటి ఫాటీ ఫిష్'లను తప్పక తినండి, ఇందులో శరీరానికి కావలసిన ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెర్క్యురి ఉన్న చేపలను తినకండి వీటిని తినటం వలన శిశువు మరియు మీ మెదడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కావున ఈ మూలకం తక్కువగా ఉన్న చేపల రకాలను ఎంచుకోండి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

అవకాడో

అవకాడో

అవకాడో అధిక మొత్తంలో ఫైబర్'లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గర్భిణి స్త్రీలకు కావాల్సిన విటమిన్ 'K', ఫోలేట్, విటమిన్ 'C', పొటాషియం, విటమిన్ 'B6' కలిగి ఉంటుంది, వీటితో పాటూ ఆరోగ్యకరమైన మోనో-సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉంటాయి. అవకాడోలో ఉండే మోనో-సాచురేటేడ్ ఫాట్'లు గుండె సంబంధిత వ్యాధులకు వ్యాతిరేఖంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటాయి.

Story first published: Saturday, December 20, 2014, 16:20 [IST]
Desktop Bottom Promotion