For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు మొదటి త్రైమాసికంలో తీసుకొనే హెల్తీ ఫుడ్ ఐడియాస్

|

గర్భం పొందిన మహిళలు, అందులోనూ మొదటి సారి గర్భం పొందిన మహిళలు మొదటి త్రైమాసికం (మొదటి మూడు నెలలు )చాలా కష్టమైన సమయం. గర్భం పొందారని తెలియగానే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, హానికరమైన ఆహారాలకు దూరంగా ఉండాలని సలహాలిస్తుంటారు. గర్భం పొందిన మహిళల శరీరంలో హార్మోనులు చాలా క్రేజీగా ఉంటాయి. ఎందుకంటే నిరంతరం హార్మోనుల్లో మార్పుల వల్ల ప్రతి ఒక్క స్త్రీలో కొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి. అందువల్ల; గర్భదారణ సమయంలో మొదటి మూడు నెలల్లో తీసుకొనే ఆహారం పట్ట చాలా ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి.

అందుకు మా ఎక్స్ పర్ట్ డాక్టర్ రేవతి ప్రసాద్, గైనకాలజిస్ట్, సాఖి హాస్పిలట్ , బెంగళూరు, అభిప్రాయం ప్రకారం ‘మొదట మూడు నెలల సమయంలో ఎక్కువ లిక్విడ్స్, పండ్లు, మరియు వెజిటేబుల్స్ ' తీసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. పాలు, పెరుగు మరియు తాజా డైరీప్రొడక్ట్స్ ఆహారాలు ఖచ్చితంగా మూడు నెలల గర్భదారణ సమయంలో చాలా అవసరం అయ్యే ఆహారాలు అని చెబుతున్నారు.

కొన్ని ఇష్టం లేని ఆహారాలైనా కూడా గర్భధారణ సమయంలో ఖచ్ఛితంగా తీసుకోవల్సి ఉంటుంది. అందుకు మీకు ఖచ్ఛింతంగా ప్రెగ్నెన్సీ మీల్ ఐడియాస్ అవసరం అవుతాయి. ఈ ప్రెగ్నెన్సీ మీల్ ఐడియాస్ తెలుసుకోవడం ద్వారా శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అందివ్వడంతో పాటు రుచికరమైన కొత్తరుచులను ఆశ్వాధించవచ్చు.

మొదట, బయట ఆహారాలను సాధ్యమైనంత వరకూ నివారించాలి. మొదటి మూడు నెలల్లో హెల్తీ హోం మేడ్ ఫుడ్ తీసుకోవడం, గర్భిణీ మహిళలకు చాలా అవసరం మరియు ముఖ్యం. అందువల్ల గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలల్లో తీసుకొనే హెల్తీ మీల్స్ కోసం ఈక్రింద కొన్ని గ్రేట్ మీల్ ఐడియాస్ ఉన్నాయి . ఇవి మీ హార్మోనులను హైలెవల్స్ కు తీసుకుపోవడానికి గొప్పగా సహాయపడుతాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం....

 క్లియర్ సూప్

క్లియర్ సూప్

ఎక్కువ క్రీమ్ సూప్ లను మొదటి త్రైమాసికంలో తీసుకోకూడదు. వీటికి బదులు చాలా పలుచగా ఉండే ఇంట్లో తయారుచేసే సూప్స్ ను తీసుకోవాలి. అందుకు చికెన్ క్లియర్ సూప్, స్ప్రింగ్ ఆనియన్ క్లియర్ సూప్ తాజా బ్రెడ్ స్టిక్స్ తో తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

బనానా స్మూతి

బనానా స్మూతి

అరటిపండ్లు పొట్ట నిండేలా చేస్తుంది మరియు పొట్టను ప్రశాంతంగా మార్చుతుంది . ఈ స్మూతికి అదనంగా తేనెను కూడా జోడించడం వల్ల కొన్ని టన్స్ లో మీకు అవసరం అయ్యే క్యాల్షియం మరియు ఐరన్ లభిస్తుంది.అందుకే ఇది గ్రేట్ మీల్ ఐడియా.

రైతా

రైతా

భోజనం కాకుండా భోజనంతో పాటు మీరు ఇంకా ఏం తీసుకుంటారు? ఒక మంచి రుచికరమైన రైత చాలా మంచిది . పెరుగు మీ పొట్ట ప్రేగులను చల్లబరుస్తుంది. కడుపు మంటను తగ్గిస్తుంది , ప్రేగులను క్లియర్ చేస్తుంది. అయితే రైతాకు స్పైసీలను జోడించకూడదు . కీరదోస, పుదీనా, లెట్యుస్ వంటివి జోడించి తీసుకోవచ్చు.

ఫ్రూట్ కస్టర్డ్

ఫ్రూట్ కస్టర్డ్

ప్రతి గర్భిణీ స్త్రీ డిఫరెంట్ గా ఉంటారు . ప్రతి ఒక్క మహిళలో ఆకలి కోరికలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి . గర్భదారణ సమయంలో చాలా మంది మహిళలకు పాలు వాసన పట్టదు . అలాంటి వారు పాలు త్రాగని వారు కస్టర్డ్ ఫ్రూట్ (సీతాఫలం)మంచి ఆహారం .

సిట్రస్ జ్యూస్ లు

సిట్రస్ జ్యూస్ లు

జ్యూస్ లు ఆరోగ్యకరం అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జ్యూస్ లు తాజాగా తయారుచేసినవై ఉండేవాటిని ఎంపిక చేసుకోవాలి. వీటిలో బ్లాక్ సాల్ట్ , పుదీనా, నిమ్మరంస వంటివాటిని జోడించుకోవచ్చు.

చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్

చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్

గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో ఏమి తినాలనిపించదు కొందరిలో. అటువంటి వారు ఒక రుచికరమైన చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్ ను చికెన్ ముక్కలను లేదా వెజిటేబుల్స్ ఉడికించిన సూప్ ను తీసుకోవచ్చు . దీన్ని నేరుగా అలాగే త్రాగడం వల్ల బేబికి చాలా ఆరోగ్యకరం.

రసం

రసం

చాల మంది గర్భిణీ స్త్రీలు రుచికరమైన సువాసనలిచ్చే కర్రీలను ఇష్టంగా తింటారు. వాటి మీద కోరికలు కలిగి ఉంటారు . అయితే గర్భిణీ స్త్రీలు ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇండియన్ కర్రీస్ కు ఒక మంచి ప్రత్యామ్నాయం రసం . ఇది చాలా తేలికైన ఆహారం మరియు త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

ఐస్ క్రీమ్ టాప్ విత్ నట్స్

ఐస్ క్రీమ్ టాప్ విత్ నట్స్

గర్భిణీ స్త్రీలకు ఒక ఫేవరెట్ ఫుడ్ ఐస్ క్రీమ్ . ఇది మరీ ఆరోగ్యకరమైన ఆహారంగా నిర్ధారించడం లేదు, కానీ ఐస్ క్రీమ్ విత్ హెల్తీ నట్స్, ఆప్రికాట్స, మరియు ఫిగ్స్ గార్నిష్ చేయడం వల్ల ఆహారం విలువ పెరుగుతుంది.

English summary

8 Pregnancy Meal Ideas For The First Trimester

The first trimester of pregnancy is usually a tough time for would-be moms. Everyone keeps telling you to eat healthy and avoid food that makes you sick. Your hormones are crazy and you are still coming to terms with this new experience of pregnancy. That is why; pregnancy meal ideas for the first trimester should be very special. All pregnancy meals have to be healthy. However, you must also keep your pregnancy cravings in mind.
Story first published: Friday, July 4, 2014, 16:48 [IST]
Desktop Bottom Promotion