For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ టైంలో(3వ నెలలో) మంచి నిద్రకు 8 మార్గాలు

|

గర్భధారణ సమయంలో స్త్రీ యొక్క శరీరం పెరుగుతున్న పిండంనకు తగ్గట్టుగా చాలా మార్పులకు లోనవుతుంది. వారు అసౌకర్యం మరియు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆమె వేవిళ్ళు,జీర్ణక్రియ సమస్యలు,మూత్ర ఆపుకొనలేని సమస్య మరియు హార్మోన్ మార్పులకు సంబంధించిన అనేక ఇతర సమస్యలను పరిష్కరించవలసి ఉంటుంది. కానీ,మహిళలు తొమ్మిది నెలల చివరలో ఆరోగ్యకరముగా మరియు సంతోషంగా శిశువు జననం కోసం తిరిగి అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి.

అదే సమయంలో వారు అధిగమించడానికి నిద్ర అనేది ఒక సమస్యాత్మక విషయంగా ఉంటుంది. సాదారణంగా గర్భిణీ స్త్రీలు నిద్ర మరియు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతి త్రైమాసికం గడిచే కొద్ది నిద్ర దూరం అవుతూ ఉంటుంది. వారు క్లిష్టమైన వారి కుంభాకార పొట్టతో పడుకోవటానికి ఒక సౌకర్యవంతమైన స్థితిని కనుగొనాలి.

ఒక గర్భవతిని వెంటాడే సాధారణ సందేహాలలో ఒకటిగా గాడంగా నిద్రపోవడానికి ఉత్తమ స్థితి గురించి ఉంటుంది. మీ గర్భం మూడవ త్రైమాసికంలో మీ ఎడమ వైపు నిద్ర ఎప్పుడూ మంచిదని చెప్పుతారు. అదే స్థితిలో మొత్తం రాత్రి గడిపే సమయంలో మీరు ఎదుర్కోనే అసౌకర్యాలను నివారించేందుకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళలు గర్భం మూడవ త్రైమాసికంలో ఎలా నిద్ర పోవాలో తెలుసుకోవాలి. ఇక్కడ మేము గర్భధారణ సమయంలో మూడవ త్రైమాసికంలో నిద్ర కొరకు ఉత్తమ స్థితి ఎలా కనుగోనాలో చర్చిస్తున్నాము.

ప్రశాంతత

ప్రశాంతత

మొదట మీ బిడ్డ ప్రశాంతంగా ఉండటానికి ముందుగా ఉత్తమ స్థితిలో నిద్రకు ప్రయత్నించాలి. గర్భం యొక్క మూడవ త్రైమాసిక సమయంలో మీ బిడ్డ ప్రశాంతంగా ఉండాలని గుర్తుంచుకోండి. మీ మనసు రిలాక్స్ మరియు ఒక ప్రశాంత వాతావరణంలో ఉండాలని అర్థం. తద్వారా బిడ్డ కూడా క్రిందికి సెటిల్ అవుతుంది.

ఎక్కువ సార్లు బాత్ రూం కి వెళ్ళుట

ఎక్కువ సార్లు బాత్ రూం కి వెళ్ళుట

మీరు ఎక్కువ సార్లు బాత్ రూం కి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మీకు నిద్ర భంగం అవుతుంది. దీన్ని నివారించడానికి మీరు నిద్రవేళ ముందు బాత్రూంకి వెళ్లి మూత్రాశయంను పూర్తిగా ఖాళీ అయినదని నిర్ధారించుకోండి.

ఒక రొటీన్ నిద్రవేళ

ఒక రొటీన్ నిద్రవేళ

మీకు ఒక రొటీన్ నిద్రవేళ ఉంటే మూడవ త్రైమాసికంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ విధంగా మీ శరీరం కళ్ళు మూసుకొని పడుకోవటానికి తయారవుతోంది. సులభంగా మీరు లోతైన నిద్ర లోకి సెటిల్ అవుతారు.

రిజర్వ్ బెడ్ రూమ్

రిజర్వ్ బెడ్ రూమ్

మీరు గర్భం మూడవ త్రైమాసికంలో ఉత్తమ స్థితిలో నిద్ర కోసం ప్రత్యేకించి ఒక బెడ్ రూమ్ ఉండాలి. నిజానికి నిద్ర మరియు ఒంటరిగా ఉండటానికి ఒక బెడ్ రూమ్ రిజర్వ్ ఉండాలి. అలాగే మీ బెడ్ రూమ్ బయట లాప్ టాప్ మరియు స్మార్ట్ ఫోన్ లను ఉంచండి.

ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం

ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం

గర్భం మూడవ త్రైమాసికంలో ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం మంచిది. ఎందుకంటే మీ కుంభాకార పొట్టకు వెనకవీపు లేదా కాలి కండరాల వలన ఎటువంటి బరువు ఉండదు. అంతేకాక మీకు హాయిగా కూడా ఉంటుంది.

సపోర్ట్ గా దిండు వేసుకోవాలి

సపోర్ట్ గా దిండు వేసుకోవాలి

మీరు గర్భం మూడవ త్రైమాసికంలో ఉన్నప్పుడు దిండు మద్దతు గురించి మర్చిపోకండి. మీరు ఎడమవైపుకు తిరిగి పడుకున్నప్పుడు మద్దతుగా ఒక మంచి దిండును కాళ్ళ మధ్య ఉంచండి. ప్రత్యేక గర్భం దిండ్లు అత్యుత్తమమైనవి.

కెఫిన్ లేదా మద్యం తీసుకోవటం మానేయాలి

కెఫిన్ లేదా మద్యం తీసుకోవటం మానేయాలి

గర్భం యొక్క మూడవ త్రైమాసికంలో కెఫిన్ లేదా మద్యం తీసుకుంటే కనుక మీకు నిద్రకు భంగం అవుతుంది. ఈ రెండు కారకాలు మంచి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.

తేలికపాటి భోజనం తీసుకోవాలి

తేలికపాటి భోజనం తీసుకోవాలి

మూడవ త్రైమాసికంలో పెరుగుతున్న బిడ్డ యొక్క ఆకలిని దృష్టిలో పెట్టుకొని తేలికపాటి భోజనం తీసుకోవాలి. రోజులో క్రమ అంతరాలలో తేలికపాటి భోజనం తీసుకోవాలి. పడుకోవటానికి ముందు అధిక ఆహారం తీసుకోకూడదు.

Story first published: Monday, May 12, 2014, 15:26 [IST]
Desktop Bottom Promotion