For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఆపిల్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు

|

మహిళలు గర్భం పొందిన తర్వాత, ఆమె తీసుకొనే ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారంను తీసుకొన్నప్పుడే కడుపులో ఫీటస్(పిండం)యొక్క అభివృధ్ది ఆరోగ్యకరంగా ఉంటుంది. సాధారణంగా, గర్భధారణ సమయంలో ఆపిల్ తినడం వల్ల పొందే ప్రయోజనాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో రెగ్యులర్ గా ఆపిల్ తినడం వల్ల ఇటు తల్లికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా గొప్పగా ప్రయోజనాలు అంధిస్తుంది. కాబట్టి, గర్భిణీలు, వారి రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు హై న్యూట్రీషినల్ ఫుడ్స్ అవసరం అవుతాయి. కొన్ని అద్యయనాలు కూడా గర్భిణీ స్త్రీల యొక్క డైట్ లో ఆపిల్ యొక్క ప్రత్యేకమైన ప్రయోజనాలను తెలియజేడం జరిగింది. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రయోజనాలను అందిస్తుందో కూడా తెలపడం జరిగింది. మరి గర్భధారణ కాలంలో గర్భిణీ ఆపిల్స్ తినడం వల్ల పొందే

ప్రయోజనాలేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

ఆస్త్మా కు నుండి రక్షణ కల్పిస్తుంది

ఆస్త్మా కు నుండి రక్షణ కల్పిస్తుంది

గర్భధారణ సమయంలో ఆపిల్స్ తినడం వల్ల ఇది పుట్టబోయే బిడ్డ ఆస్తమాకు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది. అయితే అందుకు ఖచ్చితమైన నిర్దారణ లేకపోయినా, ఆపిల్ గర్భిణీ స్త్రీలు తినడం వల్ల ఇందులోని పూర్తి పోషకాంశాలు తల్లికి చాలా ప్రయోజనం చేకూర్చుతాయి.

రక్తహీనత

రక్తహీనత

గర్భిణీ స్త్రీలలో రక్తహీనత వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇచ్చిన డేట్ కంటే ముందుగానే ప్రసవం అవ్వడం లేదా పుట్టే బిడ్డ బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఆపిల్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో ఉండే ఐరన్ కంటెంట్ అనిమీయాతో పోరాడేందుకు సహాయపడుతుంది. దాంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

శ్వాసలో ఇబ్బందిని నివారిస్తుంది

శ్వాసలో ఇబ్బందిని నివారిస్తుంది

శ్వాసలో ఇబ్బంది, ఇది ఆస్తమాకు ఒక ప్రధాణ లక్షణం. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ యొక్క రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ చేర్చుకోవడం వల్ల ఈ ప్రమాధంను అరికట్టవచ్చు.

డిటాక్సిఫికేషన్

డిటాక్సిఫికేషన్

మెర్యురి ఫీటస్ కు చాలా హానికలిగిస్తుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు మెర్యురి కలిగినటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆపిల్స్ గర్భిణీ శరీరంను క్లెన్సింగ్ మరియు డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఆపిల్స్ లో సోలుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, కాబట్టి, గర్భధారణ సమయంలో ఆపిల్ తీసుకోవడం వల్ల గర్భిలో వచ్చే సాధరణ సమస్య మలబద్దంను నివారిస్తుంది. మరియు జీవక్రియలను రేటును పెంచుతుంది. మరియు పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది

వ్యాధినిరోధకత పెంచుతుంది

వ్యాధినిరోధకత పెంచడంలో ఆపిల్స్ గొప్పగా సహాయపడుతాయి. ఆపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ తల్లి, బిడ్డలలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

పవర్ ఫుడ్

పవర్ ఫుడ్

ప్రకృతి పరంగా ప్రసాధించిన పండ్లలో ఆపిల్ ఒక పవర్ ఫుల్ ఫుడ్ . గర్భధారణ సమయంలో ఆపిల్స్ తినడం వల్ల, ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్ల శరీరం తక్షణ శక్తిని పొందుతుంది. మరియు చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం

గర్భణీ స్త్రీలు అధిక రక్తపోటు వల్ల నిరంతరం హార్ట్ బర్న్, ఎసిడిటి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అటువంటి వారు ఆపిల్స్ రెగ్యులర్ గీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, గుండె ఆరోగ్యానికి తగినంత బలాన్నిఅంధిస్తుంది. దాంతో హార్ట్ బర్న్ ప్రమాధం తగ్గుతుంది.

క్యాల్షియంకు గొప్ప మూలం

క్యాల్షియంకు గొప్ప మూలం

గర్భధారణ సమయంలో క్యాల్షియం చాలా అత్యవసరం అవుతుంది. కడుపులో పెరిగే శిశివులో ఎముకల అభివ్రుద్దికు సహాయపడుతుంది. అంతే కాదు తల్లికి కూడా ఎముకలు, దంతలు ఆరోగ్యంగా ఉండేందకు సహాయపడుతుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్ డైట్ లో ఆపిల్స్ ను ఖచ్చితంగా చేర్చుకోవాలి.

English summary

Benefits Of Eating Apples During Pregnancy

When a woman becomes pregnant, she has to take a lot of care to eat the correct foods to ensure proper growth of the foetus. Naturally, we wonder the benefits of apples during pregnancy. It is not surprising that regular consumption of apples during pregnancy is extremely beneficial to both the mother and the child. Knowing the benefits of eating apples will make you love to include this fruit in your daily diet.
Story first published: Wednesday, March 26, 2014, 16:17 [IST]
Desktop Bottom Promotion