For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి వల్ల గర్భస్రావం(అబార్షన్)జరుగుతుందా?

|

గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అనేది అత్యంత క్లిష్టమైన పరిస్థితి. గర్భిణీలో గర్భస్రావానికి అనేక కారణాలున్నాయి. కొన్ని అద్యయనాల వల్ల గర్భిణీ స్త్రీలలో రెగ్యులర్ గా రెండు మూడు సార్లు గర్భస్రావం జరిగితే అది సంతానలేమికి దారితీస్తుందిని నిర్ధారించారు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారు అధికంగా ఒత్తిడికి గురైనా గర్భస్రావానికి దారితీస్తుందని అనేక వైద్యనిపుణులు కూడా భావిస్తుంటారు.

ఇది చాలా అరుదుగా సంభవిస్తుంటుంది. వివరించడానికి వీలు లేని విధంగా, తెలియని కొన్ని కారణాల వల్ల కూడా గర్భస్రావానికి దూరం చేస్తుంది. కాబోయే తల్లి, తల్లి అయిన తర్వాత ఎలాంటి బాధ్యతలు చేపట్టాలి, పిల్లల గురించి ఎటువంటి బాధ్యతలు, జాగ్రత్తలు తీసుకోవాలని మనస్సులో టెన్షన్ పడుతూ ఒత్తిడికి గురి అవుతుంటారు. అలా గర్భస్రావానికి ఒకటి రెండు సార్లు గురైన వారు, తిరిగి అటువంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనుకుంటే, గర్భధారణ సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు కొన్ని మార్గాలు మీకోసం ...

1. మీ పార్ట్నర్ తో మాట్లాడాలి

1. మీ పార్ట్నర్ తో మాట్లాడాలి

మీ భాగస్వామితో ఎప్పుడూ సంతోషంగా మాట్లాడుతూ, కోపం, ఒత్తిడి తగ్గించుకొని, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. నిరంతరం మీ భావాలు, మీ శరీరంలో కలిగే మార్పులను మీ భాగస్వామితో పంచుకోవాలి. ఏదైనా సమస్యగా ఉంటే తప్పని సరిగా వెంటనే భాగస్వామితో తెలిపి, డాక్టర్ ను సంప్రధించాలి. మీఅంతట మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మీరు సంతోషకరమైన గర్భవధికాలన్నీ పూర్తి చేసుకుంటారు.

2. బ్రేక్ తీసుకోండి

2. బ్రేక్ తీసుకోండి

మీలో ఆందోళనలు మరియు ఒత్తిడికి గురిఅవుతుంటే, వాటని కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం మార్పు చేసుకోవాలి. మీరు పనిచేసే చోటనుండి కొంత బ్రేక్ తీసుకొని, సినిమాకు వెళ్ళడం, లేదా మీకు నచ్చిన పుస్తకాలను చదవడం. స్నేహితులు, లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళడం వంటివి చేయాలి.

3. సంతోషకరమైన వాతావరణం

3. సంతోషకరమైన వాతావరణం

రిలేషన్ లో సమస్యలు లేదా కుటుంబంలో సమస్యలు అధిక ఒత్తిడికి గురి చేస్తాయి. మరింత అలసటకు గురిచేస్తాయి. కాబట్టి, ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్ షిప్ కలిగి ఉండటం మంచిది. దాంతో మీ గర్భధారణ సమయంలో హోర్మోనులను కంట్రోల్ చేసి, సంతోషంగా గడపవచ్చు.

4. తగినంత నిద్ర

4. తగినంత నిద్ర

అధికంగా అలసట చెందడం వల్ల మీరు ఎక్కువ ఒత్తిడికి గురి కావచ్చు. కాబట్టి, ఒత్తిడి వల్ల ఏర్పడే గర్భస్రావనం నివారించాలంటే, విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం తీసుకోండి. ఇది మీ శరీరంలో హార్మోనులు సమతుల్యం చేయడానికి సహాయపడుతాయి దాంతో మీ భావోద్వేగపు ఆరోగ్యం స్థిమితంగా ఉండేందుకు సహాయపడుతుంది.

5. డాక్టర్ ను సంప్రదిస్తుండాలి

5. డాక్టర్ ను సంప్రదిస్తుండాలి

మీరు అధికంగా ఒత్తిడికి గురి అవుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రధించడానికి ప్రయత్నించండి. మీరు సాధరణంగా కంటే ఎక్కవ ఒత్తిడికి గురి అవుతుంటే తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించడం మంచి ఫలితం ఉంటుంది. వారు మీకు తగినంత సలహాలను అంధిస్తారు. జాగ్రత్తలను సూచిస్తారు. దాంతో గర్భ స్రావాన్ని నివారించుకోవచ్చు.

English summary

Can Stress Cause A Miscarriage?

Miscarriage is one of the most difficult situations that can ever happen to a pregnant woman. There are many factors that contribute for miscarriages. Studies have been extensively conducted on this topic as regular miscarriages are also considered as one of the most crucial contributing factors for infertility in women.
Story first published: Monday, February 10, 2014, 17:44 [IST]
Desktop Bottom Promotion