For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు సహజంగా వచ్చే ఆరోగ్యసమస్యలు: నివారణ

By Super
|

మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధారణ ఆరోగ్యసమస్యలు.

గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు)ఏర్పడటానికి కారణం అవుతుంది. గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి.

అదేవిధంగా, వికారం, మార్నింగ్ సిక్ నెస్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మార్పుల వల్ల అసౌకర్యంగాను మరియు చిరాకుగాను అనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో వారు చాలా ఆందోళకరమైనవారుగా అనిపించవచ్చు. గర్బిణీ స్త్రీలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు మీరు తెలుసుకోవడం కోసం కొన్ని ఇక్కడ అంధిస్తున్నాం.

వాంతులు

వాంతులు

వికారం, వాంతులు ఈ సమస్య వున్నవారు ఉదయం అతి మెల్లగా పడకపైనుండి లేవాలి. లేచిన వెంటనే ద్రవపదార్ధాలు కాకుండా పొడిగా వుండే పదార్ధాలు లేదా బిస్కట్ వంటివి తీసుకోవాలి. ఎపుడు కావాలంటే అపుడు కావలసినంత వివ్రాంతి, నిద్ర తీసుకోవాలి. ఆహారం కొద్దిగాను, తరచుగాను తీసుకోవాలి. ద్రవాలు అధికంగానే తీసుకోండి. తినటం మానరాదు. ఇది పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుంది.

మార్నింగ్ సిక్ నెస్

మార్నింగ్ సిక్ నెస్

గర్భం ధరించిన మహిళల్లో ఉదయం పూట వికారం, వాంతి వచ్చేటట్లు ఉండటం, తరచూ మనస్సు మారడం, మనస్సులో గందరగోళం వంటివి మొదటి త్రైమాసికంలో తప్పనిసరిగా ఎదుర్యే సమస్యలు. కొంత మంది గర్భిణీ స్త్రీలలో ఈ లక్షణాలు రెండవ త్రైమాసంలో కూడా ఉంటాయి.

వాపులు

వాపులు

గర్భిణీలో మరో సాధారణ సమస్య శరీరంలో ముఖ్యంగా కాళ్ళు, పాదాలు, చేతుల్లో వాపులు సాధారణ సమస్య . ఎక్కువ సమయం నిల్చోవడం, లేదా కూర్చోవడం వంటివి అవాయిడ్ చేసి సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి.

బరువు పెరుగుట

బరువు పెరుగుట

గర్భధారణలో చాలా మంది బరువు పెరుగుతారు కాబట్టి, అందుకు బయపడాల్సిన పనిలేదు. అయితే తినడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మితంగా తినాలి.

నిద్రలేమి

నిద్రలేమి

కొన్నిమార్లు రాత్రులందు మంచి నిద్ర పట్టదు. అటువంటపుడు ఒక తలగడను మీ పొట్ట కింద వుంచి పక్కకు తిరిగి పడుకోండి. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే అనేక హార్మోనుల ప్రభావం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు నిద్రాభంగం కలిగిస్తుంది.

అలసట

అలసట

దీనికి పరిష్కారం విశ్రాంతి మాత్రమే. ఎక్కడ కూర్చున్నా కాళ్ళు పైనపెట్టి కూర్చోండి. నిద్ర ఎపుడు వచ్చినా పడుకోండి. కుటుంబంలో మీరు ఒక రాణిలా మర్యాదలు పొందండి.

వెన్ను నొప్పి

వెన్ను నొప్పి

గర్భం ధరించిన మహిళల శరీరంలో రోజురోజుకు పిండం పెరిగేకొద్ది, శరీరంలో ఇతర ఎలిమెంట్స్ తో పాటు, చర్మం కూడా చాలా సాప్ట్ గా మరియు స్ట్రెచ్చీగా మార్పు చెందుతాయి. మరియు ఇది మిమ్మల్ని ప్రసవానికి సిద్దం చేయడానికి నిధానంగా ఇలా మార్పు చెందుంతుంటాయి . పిండం పెరుగుదల, గర్భంలో స్థల ఏర్పడటానికి కండరాలు సడలించడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ మరియు పెల్విస్ జాయింట్స్ లో నొప్పి ఏర్పడటానికి కారణం అవుతంది.

పొత్తికడుపులోనొప్పి

పొత్తికడుపులోనొప్పి

గర్భిణీ స్త్రీలో ఒది ఒక సాధరణ ఆరోగ్య సమస్య. గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా కడుపులో నొప్పి, తిమ్మర్లుగా కండరాలు తిమ్మిరులుగా భావన కలుగుతుంది, కడుపులో లేదా పాదాల్లో కూడా ఇటువంటి మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రులు ఏర్పడేటటువంటి ఒక సాధారణ గర్భధారణ సమస్య.

మలబద్దకం

మలబద్దకం

గర్భిణీ స్త్రీలలో అతి సాధారణ సమస్య మలబద్దకం. కాబట్టి అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు తీసుకుంటూ, అధికంగా నీరు త్రాగాల్సి ఉంటుంది. గింజలు, పండ్లు, కూరగాయలు వంటి వాటి ద్వారా పీచు అధికంగా తీసుకోండి. తగినంత నీరు తాగితే ఈ సమస్య వుండదు.

కాళ్ళు తిమ్మురలు

కాళ్ళు తిమ్మురలు

మడమ, కాళ్ళు వంటివి ప్రతిరోజూ మెల్లగా వ్యాయామాలు చేస్తే రక్త సరఫరా మెనరుగుపడి తిమ్మిర్లవంటివి తగ్గుతాయి.

దీనికి పరిష్కారం విశ్రాంతి మాత్రమే. ఎక్కడ కూర్చున్నా కాళ్ళు పైనపెట్టి కూర్చోండి. నిద్ర ఎపుడు వచ్చినా పడుకోండి. కుటుంబంలో మీరు ఒక రాణిలా మర్యాదలు పొందండి.

శ్వాసలో ఇబ్బందులు

శ్వాసలో ఇబ్బందులు

గర్భిణీ స్త్రీలకు ఒత్తిడి పెరిగే కొద్ది,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలా అసౌకర్యంగా అనిపించినప్పుడు, కాస్త విశ్రాంతి తీసుకోండి.

English summary

Common Pregnancy Problems

A baby is something you carry inside you for nine months, in your arms for three years and in your heart till the day you die.
Desktop Bottom Promotion