For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రలేమి: సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుందా?

|

సంతానం కలగకపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో ఒక సాధారణ సమస్యగా మారుతోంది. అందుకు ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి. సంతానోత్పత్తి సమస్యల వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపేవారు కూడా ఉన్నారు. కానీ, నిద్రలేమి కూడా సంతానోత్పత్తి సమస్యల్లో ఒకటిగా ఉందని మీకు తెలుసా?ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిద్ర అనేది మనిషి జీవితానికి చాలా అవసరం. శరీరంలో అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా, చురుకుగా పనిచేయాలంటే అవయావాలన్నింటికి కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ విశ్రాంతి అనేది ఒక్క నిద్రవల్లే అవయావాలకు అందుతుంది. కాబట్టి, నిద్రలేమి వల్ల ఇతర అవయవాల్లాగే, సంతానోత్పత్తి అవయావాల మీద ప్రభావ చూపుతుంది. దాంతో సంతాన లోపం(పిల్లలు కలగకపోవడం) అనేది సమస్యగా మారుతుంది. కాబట్టి, మీరు సంతానోత్పత్తిని పెంచుకోవాలనుకుంటుంటే, నేచురల్ పద్దతులను కూడా తక్కువ అంచాన వేయకుండా అనుసరించడమే. ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ కన్నా నేచురల్ గా పొందే నిద్రతో చాలా ప్రయోజనాలున్నాయి.

నిద్ర వల్ల తగినంత విశ్రాంతి పొందడం వల్ల శరీరంలో హార్మోలను క్రమంగా పనిచేస్తాయి. శరీరంలో అన్ని అవయవాల్లాగే, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా చురుగా పనిచేస్తుంది. ఒత్తిడి వల్ల హార్మోనుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మొత్తం మీ ఫెర్టిలిటి సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. మహిళల్లో ఒత్తిడి, నిద్రలేమి వల్ల అండోత్సర్గంలో సమస్యలు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి సంతానోత్పత్తి మీద ప్రభావం ఏవిధంగా చూపుతుందని మీకు ఆశ్చర్యం కలిగినట్లైతే? మీ సందేహాలకు కొన్ని సమాధానలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

Does Sleep Loss Affect Fertility

1. ఇర్రెగ్యులర్ మెనుష్ట్రేషన్ : ఇర్రెగ్యులర్ మెనుష్ట్రేషనల్ సైకిల్ ఉన్నవారు. చాలా వరకూ ఈ సమస్యను నిద్రలేమి వల్ల ఎదుర్కొంటారు. నిద్రలేమి ఫెర్టిలిటీ మీద ఎలా ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలనుకొన్నప్పుడు, నిద్రలేమితో బాధపడేటప్పుడు మీ రుతుక్రమం సరిగా సరైన సమయంలో వస్తున్నదో లేదో గమనిస్తే చాలు మీకు అర్ధం అవుతుంది. కాబట్టి, మంచి నిద్రను పొందు ఎటువంటి మెడికేషన్ లేకుండానే, మంచి ఫలితాలను ఎలా పొందగలరో చూపగలుగుతారు.

2. లెప్టిప్ ప్రొడక్షన్ లో అంతరాయ్యం: చాలా మంది మహిళలకు నిద్రలేమి అండోత్సర్గం మీద ఎలా ప్రభావం చూపుతుందని?దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం, మహిళల అండోత్సర్గానికి అసరం అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఒక ప్రధానమైనటువంటి పాత్రపోషిస్తుంది. నిద్రలేమి వల్ల ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తి మీద ప్రభావం చూపి, విడుదల కాకుండా చేస్తుంది. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మరియు ఇన్ ఫెర్టిలిటి.

3. బరువు పెరగడం: స్త్రీ పురుషుల ఇద్దరిలిలోను బరువు పెరగడం వల్ల సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. నిద్రలేమి శరీరంలోని అవయవాల మీద డైరెక్ట్ గా ప్రబావం చూపి, మెటబాలిజంను నిధానం చేసి, శరీరంలో కొవ్వు పెరిగేలా చేసి ఊబకాయస్తులుగా మారుతారు. దాంతో ఇన్ ఫెర్టిలిటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అదే విధంగా పిసిఒయస్ సమస్యలు కూడా ప్రారంభం అవుతాయి.

4. క్రోనిక్ స్ట్రెస్: నిద్రలేమి వల్ల క్రోనిక్ స్ట్రెస్ మాత్రమే కాదు వేరే రకంగా కూడా ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి, మీ శరీరం మరియు మనస్సును బ్యాలెన్స్ చేస్తూ ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. తగినంత నిద్రపొంది హార్మోనులు ఫర్ ఫెక్ట్ గా ఎఫెక్టివ్ గా పనిచేసేలా చూసుకోండి.

5. స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది: పురుషుల్లో సర్కాడియన్ రిథమ్స్ మీద ప్రభావం శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. సంతాన లేమితో భావిస్తుంటే, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల సంతానోత్పత్తి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి, తగినంత నిద్రవల్ల స్త్రీ పురుషులిద్దరిలోని సంతానోత్పత్తిని నేచురల్ గా పెంచుకోవచ్చు..

English summary

Does Sleep Loss Affect Fertility

Infertility is a disturbing problem that may leave your with sleepless nights. But, does sleep deprivation affect fertility? Of course Yes! You are making your condition even worse without a sound sleep. Getting enough sleep has great role in your health and beauty.
Desktop Bottom Promotion