For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భణీలకు థైరాయిడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు

|

ఆరోగ్య సమస్యలకు గర్భధారణ సమయం కూడా ఒక కాలం. ఎందుకంటే గర్భధారణ సమయంలో మీకు తెలియకుండానే కాళ్ళు వాపులు, వికారం మరియు తలతిరుగుడు వంటి జబ్బులతో పోరాడాల్సి ఉంటుంది. ఈ సమస్యలు కొంత మంది ఎక్కువగా ఉంటే మరికొంత మందిలో తక్కువగా ఉంటాయి. కానీ ప్రతి గర్భణీ మహిళ ఎదుర్కొనే ఒక పరిమితమైన సమస్యలు ఇవి. అయితే, మీ ఆరోగ్య సమస్యలు మీ పుట్టబోయే బిడ్డమీద ప్రభావితం చేస్తాయి. గర్భణికి సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఒకటి థైరాయిడ్. తల్లిలో థైరాయిడ్ సమస్య ఉంటే, అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. గర్భధారణలో హై లేదా లో థైరాయిడ్ చాలా ప్రతికూల విధంగా బిడ్డ మీద ప్రభావితం చూపుతుంది.

మీకు ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే, అప్పుడు అది మీ గర్భధారణ సమయంలో మరింత తీవ్రంగా పెరగవచ్చు. కొందరు మహిళలు ఇంతకు మునుపు లేకున్నాగర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఎదుర్కొంటారు. థైరాయిడ్ ప్రధానంగా ఎండోక్రైన్ గ్లాండ్(వినాళ గ్రంథి మరియు ఇతర ఏ హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇది ప్రభావితం చేస్తుంది. హార్మోనుల లోపం మరియు ఉండాల్సిన వాటికింటే అదనంగా ఉన్న హార్మోన్ల వల్ల కూడా కడుపులో శిశువకు హాని చేయవచ్చు. మీకు గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య ఉన్నట్లైతే, అప్పుడు మీ శిశువుకు ఈ క్రింది విధంగా నష్టం జరగవచ్చు..

Effects Of Thyroid During Pregnancy

1. మిస్కరేజ్ అయ్యే ప్రమాధం ఉంది: గర్భధారణ మొదటి త్రై మాసికంలో మీ రక్తంలో అధికంగా థైరాయిడ్ హార్మోన్లు ఉన్నట్లైతే అప్పుడు మీ గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యను కొన్ని మందుల ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

2. న్యూరోలాజికల్ డెవలప్మెంట్ : సరిపడా థైరాయిడ్ హార్మోన్ లేకున్నా లేదా థైరాయిడ్ లోపం ఉన్నా, కొన్ని సందర్భాల్లో శిశువుల్లో మెంటల్ డెవలప్ మెంట్ సమస్యలుంటాయి. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్య లేకున్నట్లైతే మానసిక వైకల్యాలు లేదా తక్కువ ఐక్యూ లెవల్స్ కలిగిన బిడ్డ జన్మించవచ్చు.

3. ప్రి టర్మ్ బర్త్: కొన్ని సమయాల్లో, గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్లాండ్ హైపర్ యాక్టివిటీ వల్ల హై బ్లడ్ ప్రెజర్ కు గురి కావచ్చు. ఇది కడుపులో మావి సంబంధిత సమస్యల వల్ల పెరిగే పిండం మీద ప్రభావం చూపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రీ టర్మ్ బర్త్ కావచ్చు.

4. బేబీ థైరాయిడ్ గ్లాండ్స్ ను డ్యామేజ్ చేయవచ్చు: గర్భధారణ సమయంలో తీసుకొనే థైరాయిడ్ ట్రీట్మెంట్ బిడ్డ మీద కూడా ప్రభావం చూపవచ్చు. థైరాయిడ్ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే కొన్ని రకాల మెడికేషన్స్ లో రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల బిడ్డ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో శిశువులో థైరాయిడ్ గ్లాండ్స్ మీద ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ సమస్యకు డాక్టర్ మందులు రాసి ఇచ్చినప్పుడు, మీరు గర్భం ధరించి ఉన్నారని ముందుగానే తెలపండి .

English summary

Effects Of Thyroid During Pregnancy

Pregnancy is a period of time when your health complications get compounded. You have to battle swollen feet, nausea and giddiness. These problems are limited to you. However, when your health problems impact your unborn baby, it is a serious situation.
Story first published: Monday, August 4, 2014, 17:30 [IST]
Desktop Bottom Promotion