For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల కోసం క్లీనింగ్ చిట్కాలు

By Lakshmi Perumalla
|

ఆ సమయంలో మీ జీవితంలో ప్రతిదీ ఆనందంగా మారుతుంది. ఇతరులు మీ గృహ పనులు సంరక్షణలో ఉన్నప్పుడు,గర్భధారణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక విడి కుటుంబంలో ఉన్న మహిళలు వారే ఇంటిని చక్కగా మరియు శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ మీరు తొందరగా అలసిపోతారు. గర్భిణిగా ఉన్నప్పుడు శుభ్రం సమయంలో అలసిపోవటం కఠినముగా ఉంటుంది.

మీ కడుపు పెరుగుతున్నప్పుడు మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినప్పుడు పరిస్థితి మరింత కష్టం కావచ్చు. మీకు ఇతర భౌతిక అసౌఖ్యము మరియు వేవిళ్ళు ఉంటే మరింత వివరణ అవసరం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు శుభ్రం కొరకు కొంత ప్రణాళిక ఉంటే అప్పుడు పని దుర్భరముగా ఉండదు.

ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. మీరు ఇంటి పనులను చేయటం నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఏ రకం ఇంటి పనులు చేయాలో మీ డాక్టర్ సలహా తీసుకోండి. అదే సమయంలో,గర్భధారణ సమయంలో భౌతిక భద్రత మాత్రమే కాకుండా శుభ్రపరిచే సమయంలో రసాయన ఉత్పత్తులను ఉపయోగించే సమయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

How To Clean When Pregnant

కాబట్టి, మీరు నేలపై దుమ్ము పాన్ లేదా స్క్రబ్ బయటకు తీయటానికి ముందు మీరు సురక్షితంగా ఉన్నారని భావించాలి. ఇక్కడ మీరు గర్భవతిగా ఉన్నప్పుడు శుభ్రం చేయటానికి సహాయం కొరకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

లేబుల్ చదవండి

శుభ్రపరిచే ఉత్పత్తులను ఉపయోగించటానికి ముందు,మీ పుట్టే బిడ్డకు హాని కలిగించే రసాయనాలు ఉన్నాయో లేదో అని తెలుసుకోవటానికి లేబుల్స్ జాగ్రత్తగా చదవండి.టాక్సిక్,అపాయం,పాయిజన్ లేదా క్షయం వంటివి లేబుల్స్ లో ఉంటే ఎప్పుడు ఉపయోగించకూడదు.

సరైన వెంటిలేషన్

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు శుభ్రంను తప్పించుకోడానికి వీలులేని పని ఉంటే,శుభ్రం చేసేటప్పుడు అన్ని విండోస్ ఓపెన్ గా ఉంచాలని గుర్తుంచుకోవాలి.ఇది గదిలో వెంటిలేషన్ ఉంచడానికి సహాయం చేస్తుంది. అంతేకాక పొగలు మరియు క్లీనింగ్ ఎజెంట్ వాసనను తొలగిస్తుంది.

చేతి తొడుగులు ధరించాలి

మీరు శుభ్రం చేసినప్పుడు మీ చేతులకు క్లీనింగ్ ఎజెంట్ ఏవిధంగా హాని చేయకుండా చేతి తొడుగులు ధరించాలి. ఇది శుభ్రం ఉత్పత్తుల ప్రత్యక్ష సంబంధాలను నివారించేందుకు సహాయం చేస్తుంది.మీరు గర్భవతిగా ఉన్నప్పుడు శుభ్రం సురక్షితంగా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా. అయితే వీటిని ప్రయత్నించండి.

మొదట భద్రత

భద్రతకు మీరు మీ గర్భధారణ సమయంలో శుభ్రపరిచే పనిలో మరింత ప్రాముఖ్యతను ఇవ్వాలి. శుభ్రపరిచే సమయంలో వంగి తుడుస్తున్నప్పుడు కొన్ని పరిమితులను తెలుసుకోవాలి. మీరు సురక్షితంగా శుభ్రం ఉత్పత్తులను ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

ఎక్కువ పని చేయొద్దు

గర్భం సమయంలో తేలికపాటి గృహ విధులు ఖచ్చితంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ,ఎక్కువ పనులు వలన సమస్యలు కలుగుతాయి. ఒక నిచ్చెన లేదా కుర్చీ మీద అధిరోహణను నివారించండి. బాగా వంగడాన్ని నివారించండి. మీరు బాగా అలసిపోతే పనులను ఆపివేయాలి.

హోమ్మేడ్ క్లీనింగ్ ఎజెంట్

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు శుభ్రం గురించి గందరగోళం ఉంటే,ఇక్కడ మీకు ఒక అద్భుతమైన సలహా ఉంది. ఇంట్లో క్లీనర్లు తయారుచేయడానికి ప్రయత్నించండి. తెలుపు వినెగార్ మరియు నీరు సమాన బాగాలుగా కలిపి క్లీనింగ్ ఎజెంట్ ను తయారుచేయవచ్చు.

లిఫ్ట్ చేయవద్దు

మీరు మీ మురికి ఫర్నిచర్ చూసినప్పుడు శుభ్రం చేయటం ఆపడం ఉత్తమం.ఇది ప్రమాదకరముగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఏటువంటి భారీ వస్తువులను ఎత్తడం మానుకోవాలి. ఫర్నిచర్ లేదా ఒక పూర్తి బకెట్ నీటిని కూడా లిఫ్ట్ చేయవద్దు.

వాక్యూమ్ క్లీనింగ్ ప్రయత్నించండి

స్వీపింగ్ కి బదులుగా వాక్యూమ్ క్లీనింగ్ ప్రాధాన్యత ఇవ్వాలి. మీ పెరుగుతున్న కడుపుతో పని మరింత సౌకర్యవంతముగా ఉంటుంది.మీరు పనులు చేసినప్పుడు ఒక మాస్క్ ధరించండి. అలాగే తివాచీలు మరియు కుషన్లను శుభ్రం చేయడానికి వాక్యూమింగ్ సురక్షితం.

సహాయం

మీరు కనీసం వారానికి ఒకసారి మరొక వ్యక్తి సహాయం తీసుకొంటే మీ రోజువారీ శుభ్రపరచడంలో మీ పని కృషి తగ్గుతుంది. మీరు పెద్ద పెద్ద పనులు వదలి చిన్న పనులు చేయండి.

English summary

How To Clean When Pregnant: Do's & Dont's'

Everything in your life will change with those lines of happiness. Pregnancy is not a time for complete rest when others will take care of your household works, at least for women who are in a nuclear family.
Story first published: Sunday, February 2, 2014, 15:01 [IST]
Desktop Bottom Promotion