For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం గర్భస్థ శిశువు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

|

ధూమపానం ఆరోగ్యానికి హానికరము! ఇది పొగ త్రాగే ఒక్కరికి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా. ధూమపానం, పొగ త్రాగని వ్యక్తి మీద కూడా హానికరమైన ప్రభావాలను చూపుతుంది. ఎందువలనంటే పొగాకులో ఉన్న విష పదార్థాల ప్రభావం అంతటా వ్యాపిస్తుంటుంది.

గర్భిణీ స్త్రీలకు కూడా దీనికి మినహాయింపు ఏమి లేదు. గర్భిణీ స్త్రీలు నిరంతరం మరియు దీర్ఘకాలం బయట వ్యాపించి ఉన్న ఈ పొగను పీల్చటం వలన పొట్టలో ఉన్న పిండానికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. గర్భవతులు ఈ ధూమపానం వలన కలిగే వివిధ హానికరమైన ప్రభావాల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ మీ శిశువుకు హాని కలుగుతుందని అనటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. దీనిని వివిధ అధ్యయనాలు ప్రతిపాదించాయి; ఇటీవల కాలంలో మెడికల్ జర్నల్, పీడియాట్రిక్స్ లో ప్రచురితమైంది.

How Passive Smoking Affects Your Unborn Baby?

పుట్టబోయే పిల్లలలో అత్యంత ప్రమాదకరమైన జన్యు పరివర్తనలు, ఈ నిరంతర ధూమపానం యొక్క ప్రభావాల వలన కలుగుతున్నాయి. దీనివలన పుట్టుక లోపాలు కలిగిన శిశువులు జన్మించే అవకాశాలు పెరుగుతున్నాయి.

ఇక్కడ పుట్టబోయే పిల్లల మీద నిరంతర ధూమపాన అత్యంత ముఖ్యమైన హానికరమైన ప్రభావాలను కొన్నిటిని ఇస్తున్నాము.

శారీరక వైకల్యం: పుట్టబోయే పిల్లలలో ఈ ధూమపానం చూపించే అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటి శారీరక లోపాలను కలిగి ఉండటం. పొగలో ఉన్న హానికరమైన ఉత్పత్తుల నిరంతర ఎక్స్పోజర్ వలన జన్యు పరివర్తనలు ప్రారంభామవుతాయి మరియు కాళ్ళు, వృషణాలు మరియు మెదడు వైకల్యాలకు కారణమౌతున్నది.

పుట్టుక లోపాలు: మీరు గర్భవతిగా ఉన్న సమయమంతా ఈ ధూమపానం వలన కలిగే ప్రభావానికి లోనవుతుంటే మీరు పెద్దది లేదా చిన్న శారీరక లోపాలు కలిగిన బిడ్డకు జన్మనిస్తారు. ధూమపానం ద్వారా గర్భవతి యొక్క శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన విష ప్రభావాల కారణంగా పుట్టుక లోపాలు సంభవిస్తాయి.

నిర్జీవ జననం : ఈ నిరంతర ధూమపానం మరియు నిర్జీవ జననానికి మధ్య గల సంబంధం గురించి నిర్వహించిన చేసిన అనేక అధ్యయనాలు ఉన్నాయి. ఈ ధూమపానం వలన బహిర్గతమయ్యే విష ప్రభావం వలన గర్భవతిస్త్రీలలో సుమారు 23 శాతం ఈ నిర్జీవ జననం సమస్య కలుగుతుందని నిరూపించారు.

తక్కువ బరువుతో పుట్టటం : చాలామంది మహిళలు సాధారణంగా తమ బిడ్డ తక్కువ బరువుతో పుట్టటానికి కారణం ఈ ధూమపాన నిరంతర ఎక్స్పోజర్ అని తెలుసుకోరు. మీ బిడ్డ ప్రినేటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ సమయంలో తక్కువ బరువు కలిగి ఉన్నది అని తెలుసుకుంటే దానికి కారణం పిండానికి తగ్గుతున్న రక్త సరఫరాను అందించే గర్భస్థ శిశు హైపోక్సియా మరియు వాసోకాన్స్ట్రిక్షన్కా.

లోపభూయిష్ట అంతర్గత అవయవాలు: ధూమపానం వలన బహిర్గతమయ్యే విష ప్రభావం వలన గర్భవతి స్త్రీలో పిండానికి తగినంత రక్తసరఫరా అందదు. దీనివలన శిశువులో లోపభూయిష్ట గర్భస్థ శిశు హృదయనాళ వ్యవస్థ, జీర్ణశయాంతర వ్యవస్థ మరియు కేంద్ర నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. అధ్యయనాలు గర్భవతిగా ఉన్న స్త్రీ ధూమపానం వలన వొచ్చే విషగాలిని పీల్చడం వలన తమ శిశువులలో అసాధారణ న్యూరోబిహేవరల్ వృద్ధి చెందుతుంది.

శ్వాసకోశ సమస్యలు: సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వలన మీ శిశువులో అసాధారణ శ్వాసకోశ సమస్యలు కలుగుతాయి. ఈ ధూమపానం వలన పుట్టిన శిశువుల్లో శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది మరియు ఇది భవిష్యత్తులో ఆస్తమా పెరుగుదలకు అవకాశం అధికంగా ఉండవచ్చు. ఈ పరివర్తనలు తీవ్రమైన మరియు పుట్టుక లోపాల రూపంలో జీవితకాలప్రభావం చూపుతాయి.

అపరిణత పుట్టుక: ధూమపానం వలన బహిర్గతమయ్యే విషప్రభావం వలన తల్లి ఎదుర్కొనే మరో సమస్య పిండం యొక్క అకాలజననం. ఇది శిశువులలో సాధారణ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది, అలాగే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశముంది .

English summary

How Passive Smoking Affects Your Unborn Baby?

Smoking is injurious to health! Not only for the person who smoke, but also for others around them. Smoking has all the harmful effects on any individual who doesn't smoke, but is exposed to the poisonous materials of tobacco.
Story first published: Thursday, August 28, 2014, 14:48 [IST]
Desktop Bottom Promotion