For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ నిర్ధారణ స్ట్రిప్ ను ఉపయోగించడం ఎలా

|

నూతన కాలంలో గర్భ నిర్దారణ కోసం, hCG అనే స్ట్రిప్'ను అధికంగా వాడుతున్నారు. సాధారణంగా మూత్ర నమూనాను ఈ స్ట్రిప్ పైన పోయటం వలన అందులో ఉండే hCG (హ్యూమన్ క్రానిక్ గోనాడోట్రాపిన్) స్థాయిల ద్వారా గర్భ నిర్దారణ చేస్తారు. ''హ్యూమన్ క్రానిక్ గోనాడోట్రాపిన్'' అనేది ఒక 'గ్లైకోప్రోటీన్', స్త్రీ శరీరంలో ఫలదీకరణ తరువాత ఏర్పడే ఒక హార్మోన్. విడుదలైన ఈ హార్మోన్ మూత్రం ద్వారా బయట పడిన తరువాత, స్ట్రిప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా ఈ స్ట్రిప్'లో రెండు గీతాలు ఉంటాయి, అవి మొదటిది పరీక్ష గీత (Test line) మరియు నియంత్రణ గీత (Control line). మూత్ర నమూనాలో ముంచిన తర్వాత రంగు తీవ్రతలు మారుతాయి, ఈ గీతలలో చేరే స్థాయిలను బట్టి గర్భ నిర్దారణ జరుపుతారు. ఈ స్ట్రిప్ ద్వారా గర్భ నిర్దారణ జరుపుటకు పాటించాల్సిన విధి విధానాల గురించి ఇక్కడ తెలుపబడింది. ఖచ్చితమైన ఫలితాలను పొందుటకు 3 దశలు ఉన్నాయి వాటి గురించి కింద తెలుపబడింది.

How to use pregnancy strip

మొదటి దశ
ఈ స్ట్రిప్ ద్వారా గర్భ నిర్దారణ జరిపే సమయంలో మొదటగా, స్ట్రిప్ ఉన్న ప్యాకెట్ పైన తెలిపిన విధంగా చింపి స్ట్రిప్'ను భయటకి తీయండి. కానీ ఉదయాన స్రవించే మూత్రంలో అధిక మొత్తంలో hCG ఉంటుంది కావున వివిధ కాలంలో అనుగుణంగా మూత్ర నమూనాలను సేకరించటం చాలా మంచిది. ఈ మాత్ర నమూనాలను, పొడిగా ఉన్న పాత్రలో సేకరించండి.

రెండవ దశ
స్ట్రిప్'ను నిటారుగా పట్టుకొని, పొడిగా ఉన్న పాత్రలో సేకరించిన మూత్ర నమూనాలో నిటారుగా ముంచండి. స్ట్రిప్'పై తెలిపిన గీత వరకు మాత్రమే ముంచండి. ఆ గీత వరకు కాకుండా ఎక్కువగా ముంచకూడదు, ఒకవేళ ముంచితే మాత్రం తప్పుడు ఫలితాలు రావచ్చు. ఇలా 10 సెకన్ల పాటూ మూత్ర నమూనాలో ఉంచి, తీసి పొడిగా ఉన్న మరియు ఎలాంటి దుమ్ము వంటి ఉండని ప్రాంతంలో ఉంచండి.

మూడవ దశ
ఆ తరువాత రంగు మూత్ర నమూనాలో ముంచిన ప్రాంతం రంగు మారే వరకు వేచి ఉండండి. మీ మూత్ర నమూనాలో ఉన్న hCG స్థాయిలను బట్టి స్ట్రిప్ యొక్క రంగు తీవ్రతలు మారిపోతాయి. గర్భం పొందినట్లయితే ఫలితం తేలటానికి 40 సెకన్లలో సమయం మాత్రమె పడుతుంది. కానీ ఒకవేళ గర్భం ధరించని ఎడలా, ఫలితం తెలుసుకొనుటకు కనీసం 5 నిమిషాల సమయమైన పడుతుంది. ఈ విధంగా జరిగే గర్భ నిర్దారణను చాలా జాగ్రత్తగా జరపాలి.

గర్భ నిర్దారణ
ప్రతికూల ఫలితం
మూత్ర నమూనాలో ముంచిన స్ట్రిప్ భాగం ఎలాంటి రంగు తీవ్రతలలో మార్పులు లేనట్లయితే ప్రతికూల ఫలితం లేదా గర్భం పొందలేదు అని అర్థం. కానీ దీని కోసం గానూ 5 నిమిషాల పాటూ వేచి చూడాలి. 5 నిమిషాల తరువాత మాత్రమే గర్భ నిర్దారణ పట్ల ఒక నిర్ణయానికి రావాలి.

అనుకూల ఫలితం
ఒకవేళ గర్భాన్ని పొందినట్లయితే, మూత్ర నమూనాలో ముంచిన స్ట్రిప్ యొక్క రంగు తీవ్రతలు మారిపోతాయి. స్ట్రిప్ పైన ఉన్న పరీక్ష గీత మరియు నియంత్రణ గీతలు మీరు గర్భవతి లేదా అన్నవి తెలుపుతాయి. స్ట్రిప్ పైన ఉన్న రంగు యొక్క తీవ్రతలు, మూత్ర నమూనాలో ఉన్న hCG గాడతల పైన ఆధారపడి ఉంటుంది. గర్భం పొందినట్లయితే, నియంత్రణ గీత కింద మరొక గీత కనపడుతుంది. ఒకవేళ పరీక్షలో లోపాలు ఉన్నట్లయితే స్ట్రిప్'లో రంగు మారవచ్చు.

తేలని ఫలితం
మీరు అనుసరించే విధానంలో తప్పిదాలు ఉన్నట్లయితే, ఎలాంటి ఫలితాలు కనపడవు. అలాంటి సమయంలో నూతన స్ట్రిప్'ను తీసుకొని పైన తెలిపిన పద్దతిని పాటించటం వలన సరైన ఫలితాలను పొందుతారు.

English summary

How to use pregnancy strip

In earlier days, blood test only used to prove if you are pregnant or not. Now, many kits are available in medical stores that you can try at home. Pregnancy test kit is a method to check if you are pregnant or not. It is simple and takes just a minute to detect pregnancy. Many women have started using this to know if they are pregnant. However, there is a method to know if you have conceived.
Story first published: Wednesday, December 17, 2014, 16:36 [IST]
Desktop Bottom Promotion