For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటర్ ఏరోబిక్స్ గర్భం సమయంలో చేయవచ్చా?

By Lakshmi Perumalla
|

ఏరోబిక్స్ వ్యాయామాలలో ఒక రకమైన వాటర్ ఏరోబిక్స్ ను లోతు తక్కువ నీటి మధ్యలో చేస్తారు. దీనిని సాధారణంగా ఒక స్విమ్మింగ్ పూల్ లో నిర్వహిస్తారు.

సాధారణంగా వాటర్ ఏరోబిక్స్ ను పూల్ లోతు తక్కువ ప్రాంతాల్లో నిలబడి చేస్తారు. అసలు స్విమ్మింగ్ తో ఎటువంటి ప్రమేయం ఉండదు. గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో వాటర్ ఏరోబిక్స్ సురక్షితమైనదా అనే సాధారణ సందేహం కలుగుతుంది.

గర్భధారణ సమయంలో వ్యాయామం అనేది మీకు,అలాగే మీ శిశువు ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తుంది.మీ మానసిక స్థితి మెరుగుపరచడానికి,శరీర నొప్పుల నుంచి ఉపశమనం, మలబద్ధకం నిరోధించడానికి మరియు మీ విశ్రాంతికి సహాయం చేస్తుంది.కానీ ఆక్వా ఏరోబిక్స్ గర్భవతులకు సురక్షితంగా ఉంటాయా? దీనికి జవాబు అవును అని చెప్పవచ్చు.

Is Aqua Aerobics Safe During Pregnancy

వాటర్ ఏరోబిక్స్ మీ శరీర వ్యాయామం కోసం పూర్తిగా ఒక సురక్షితమైన పద్ధతి. గర్భధారణ సమయంలో ఆక్వా జుంబ,వాటర్ యోగ మరియు ఆక్వా జోగ్ వంటి వాటర్ ఏరోబిక్స్ సురక్షితంగా ఉంటాయి.

వాటర్ ఏరోబిక్స్ తో పాటు తేలికపాటి వ్యాయామాలు కూడా గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉంటాయి. గర్భం సమయంలో వాటర్ ఏరోబిక్స్ యొక్క ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే,మీరు ఏ వైద్య సమస్యలు లేవని నిర్ధారించుకోవటానికి మీ డాక్టర్ ని సంప్రదించడం ముఖ్యం.

ఇక్కడ మీరు వాటర్ ఏరోబిక్స్ కొనసాగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

స్విమ్మింగ్ తెలుసుకోవలసిన అవసరం లేదు

ఆక్వా ఏరోబిక్స్ లో ఈత కొట్టటం అనేది మంచిది కాదు. నిజానికి ఆక్వా ఏరోబిక్స్ గర్భధారణ సమయంలో సురక్షితముగా ఉంటుంది. అయితే ఈత ఎలా కొట్టాలో తెలిసిన మహిళలు చేయవచ్చు.

పడిపోయే ప్రమాదం

గర్భిణీ స్త్రీలు వ్యాయామ కార్యక్రమాల నుండి దూరంగా ఉండటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి. మంచి వార్తలు చెప్పి వాటర్ ఏరోబిక్స్ అంటే పడిపోయే ప్రమాదం ఉండదని భయం లేకుండా చేయవచ్చని చెప్పవచ్చు.

ఒత్తిడిని తగ్గిస్తుంది

వాటర్ ఏరోబిక్స్ తరగతులలో ఏరోబిక్ ఓర్పు,నిరోధక శిక్షణ మరియు ఆనందకరమైన సంగీతం ఉంటాయి. కాబట్టి మీ మనస్సు మరియు శరీరంను ప్రశాంతంగా ఉంచడానికి ఖచ్చితమైన వాతావరణంను సృష్టించవచ్చు.

మంచి రక్త ప్రసరణ

వాటర్ ఏరోబిక్స్ మీ రక్త ప్రసరణ మరియు హృదయ ఫంక్షన్ పెంచేందుకు అద్భుతమైన పధ్ధతి. కాబట్టి మీరు ఆక్వా ఏరోబిక్స్ గర్భధారణ సమయంలో సురక్షితమా అనే ఆందోళన ఉంటే,మీరు ఒక మంచి సమాధానం పొందారు.

బరువును నియంత్రణలో ఉంచుతుంది

బరువును నియంత్రణలో ఉంచటం అనేది గర్భధారణ సమయంలో అతి క్లిష్టమైన విషయంగా ఉంటుంది. వాటర్ ఏరోబిక్స్ గర్భం కోసం ఒక సాధారణ శరీర ద్రవ్యరాశి సూచికలో మీ బరువును ఉంచడానికి గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉంటుంది.

సులభమైన డెలివరీ

వాటర్ ఏరోబిక్స్ గర్భధారణ సమయంలో సురక్షితం మరియు మీ కండరాలను అది విశ్రాంతిగా ఉంచటానికి,హార్మోన్లను సమతుల్యంగా ఉంచటానికి ఉత్తమ పద్ధతులలో ఒకటి. అంతేకాక ఒక సులభమైన డెలివరీ కొరకు సహాయం చేస్తుంది.

కాళ్లు వాపు నిరోధించడానికి

వాటర్ ఏరోబిక్స్ మీ కాళ్ళపై వాపు నివారించడానికి లేదా ద్రవం నిలుపుదలకు అతి ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా ఉంది. ఆక్వా ఏరోబిక్స్ పెర్ఫార్మింగ్ గర్భధారణ సమయంలో సురక్షితంగా మరియు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

మితముగా ఆక్వా ఏరోబిక్స్ సాధన గర్భధారణ సమయంలో మంచి ఆలోచన.కానీ,మీరు మీ శరీరంనకు తీవ్ర ఒత్తిడికి కలిగించే కదలికలను చేయకుండా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అనుభవం ఉన్న ఆక్వా ఏరోబిక్స్ శిక్షకుని సూచనలను అనుసరించి చేయాలి. మీరు ఆక్వా ఏరోబిక్స్ చేయడం కొరకు వైద్యపరంగా సరిపోతుందని నిర్ధారించుకోండి.ఇప్పుడు మీరు గర్భధారణ సమయంలో వాటర్ ఏరోబిక్స్ యొక్క ప్రయోజనాలు తెలిసికున్నారు. ఇప్పుడు అవి మీకోసం వేచి ఉన్నాయి? వాటర్ ఏరోబిక్స్ తరగతులలో చేరి విశ్రాంతి, ఒత్తిడి లేని గర్భధారణను ఆస్వాదించండి.

English summary

Is Aqua Aerobics Safe During Pregnancy?

Water aerobics is a type of aerobic exercise that is done in shallow water. Generally this is carried out in a swimming pool.
Story first published: Friday, January 24, 2014, 19:03 [IST]
Desktop Bottom Promotion