For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు కోసం నువ్వుల నూనె మంచిదేనా?

By Lakshmi Perumalla
|

గర్భధారణ అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటి. ఆ సమయంలో ఆమె ఆలోచన తన కోసం మరియు పుట్టే బిడ్డ ఇద్దరి కోసం ఉంటుంది. ఆ సమయంలో బిడ్డ ఆహారంనకు మూలం తల్లి. అందువల్ల ఆ తల్లి అవసరమైన విటమిన్లు మరియు పోషకాలు జాగ్రత్తగా తీసుకుంటున్నానని నిర్ధారించుకోవాలి.

నువ్వుల నూనె గర్భం సంబంధించినంతవరకు వివాదాస్పద అంశంగా ఉంది. నువ్వులలో ఇనుము, పొటాషియం మరియు కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కానీ గర్భస్రావం మరియు ఇతర ప్రమాదాలకు కారణం అవుతుందని విశ్వసిస్తారు. అయితే నువ్వులు తీసుకోవటానికి నువ్వుల అలెర్జీలు లేదా ముందస్తు కాన్పుల చరిత్ర ఉన్నవారి కోసం సిఫార్సు లేదు. ఇది మలబద్ధకం మరియు పౌష్టికాహార అవసరాలు కలిగిన వారికి మంచిదని భావిస్తారు.

Is Sesame Oil Good For Pregnant Women?

గర్భిణీ స్త్రీలు నువ్వుల నూనె ప్రభావం వినియోగించే పరిమాణం మీద ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటుంది.కాబట్టి,మేము ఇక్కడ సమాధానంనకు ప్రయత్నిస్తున్న పెద్ద ప్రశ్నగా 'గర్భం కోసం నువ్వుల నూనె మంచిదేనా'అనేది ఉన్నది. గర్భిణీ స్త్రీల మీద నువ్వులు నూనె యొక్క వివిధ ప్రభావాలు గురించి తెలుసుకుందాము.

గర్భస్రావాలు
భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బెల్లం,నువ్వులు కలిపి గర్భస్రావం ప్రేరేపించడానికి వాడతారు. గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వులు నూనెను వాడవచ్చా అని మీ అమ్మమ్మను అడిగితే, ముఖ్యంగా 1 వ త్రైమాసిక సమయంలో'వద్దు' అని చెప్పుతారు.

అలెర్జీలు
నువ్వులు నూనెలో సల్ఫర్ మరియు బహుళ అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అలెర్జీలు కారణంగా,ముఖ్యంగా గర్భధారణ సమయంలో మీ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మీకు అలెర్జీలు ఉంటే గర్భధారణ సమయంలో నువ్వుల నూనె వాడటం మంచిది కాదు.

వేడి ఆహారం
ఆయుర్వేదం ప్రకారం నువ్వులు నూనె వేడి విడుదల చేసే ఆహారాల వర్గం క్రిందకి వస్తుంది. ఇది అంతర్గత శరీర వేడిని పెంచటం వలన పిండం పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది.గర్భిణీ స్త్రీలు కోసం నువ్వుల నూనె మంచిదేనా అనే ప్రశ్నకు మళ్లీ 'కాదు' అనే సమాధానం వచ్చింది.

హార్మోన్ ప్రేరేపించడం
నువ్వులు నూనె హార్మోన్ ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ముందస్తు కాన్పులకు లేదా గర్భస్రావంనకు దారితీసే గర్భాశయ సంకోచాలకు దారి తీయచ్చు. గర్భిణీ స్త్రీలు కోసం నువ్వులు నూనె వద్దని చెప్పటానికి ఇదే ప్రధాన కారణం.

గర్భాశయ సంకోచాలు
నువ్వులు నూనెలో హార్మోన్ ప్రేరేపించే లక్షణాలు ఉండుట వలన మహిళలు గర్భాశయ సంకోచాలను ఎదుర్కొంటారు.గర్భాదరణ సమయంలో నువ్వులు నూనె తీసుకోవటం హానికరం అని చెప్పవచ్చు.

అవసరమైన పోషకాలు
నువ్వులు నూనెలో ఇనుము,పొటాషియం మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక విటమిన్లు ఎ మరియు బి కూడా ఉన్నాయి. అవును, పౌష్టికాహార అవసరం ఉన్నవారి కోసం'గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వులు నూనె మంచిది' అని చెప్పవచ్చు.

అకాల రక్తస్రావం
నువ్వులు నూనె హార్మోన్ లక్షణాల సంతులనం ఉన్నది. అందుకే గర్భిణికి అకాల రక్తస్రావం నిలుపుదలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సరైన పరిమాణంలో ఉపయోగించినప్పుడు గర్భధారణ సమయంలో నువ్వులు నూనె తీసుకోవచ్చు.

మలబద్ధకం మీద పోరాటం
మలబద్దకం అనేది గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న ఒక సాధారణ సమస్య. నువ్వులు నూనెలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. అంతేకాక ఇక్కడ నువ్వులు నూనె గర్భం కోసం మంచిదా? అంటే ఖచ్చితంగా అవును అని చెప్పవచ్చు.

English summary

Is Sesame Oil Good For Pregnant Women?

Pregnancy is one of the most wonderful experiences in the life of a woman. It is the time when she has to think and act for two. At this time, the baby’s only source of food is the mother; so much care must be taken to ensure that the expectant mother gets all the necessary vitamins and nutrients
Story first published: Friday, February 7, 2014, 18:04 [IST]
Desktop Bottom Promotion