For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పురుషుల్లో ఫెర్టిలిటి సమస్యలు: జాగ్రత్తలు

|

భూమి మీద ప్రతి మనిషి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే చాలా మంది వారిజీవితంలో పిల్లలు కలిగి ఉండాలని కూడా భావిస్తారు. కానీ, ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అనుకోకుండా వంధ్యత్వ సమస్యలు స్త్రీలతో సమానంగా పురుషుల్లో కూడా పెరుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జన్యులోపాలు, స్థూలకాయం, మరియు మద్యపానం వంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాగే జీవనశైలిలో అకస్మాత్తుగా చోటుచేసుకొనే మార్పులు కూడా వంధ్యత్వ సమస్యలకు దారితీస్తుంది.

తాజా అధ్యయనాల ప్రకారం, వంధ్యత్వానికి మధుమేహం కూడా ఒక ప్రధాన పాత్రపోషిస్తుందని వెలుగులోకి వచ్చింది. డయాబెటిస్ మన శరీరంలో అవసరం అయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి పెంచకుండా విఫలమైతే లేదా సెల్యులార్ స్థాయిలో ఇన్సులిన్ గ్రహించండం విఫలమైతే మేల్ ఫెర్టిలిటి సమస్యకు దారితీస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత యంగర్ జనరేషన్ లో చాలా చిన్న వయస్సులోనే యువకుల్లో మధుమేహం ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. మధుమేహం ఒక ప్రాణాంతకమైన సమస్య కాదు. అయితే, దీని వల్ల శరీరంలో అనేక రుగ్మతల దారితీసి అది కాస్తా ఇన్ ఫెర్టిలిట్ (పురుషుల్లో వంధ్యత్వానికి) కారణమవుతుంది.

మగవారిలో సంతానోత్పత్తిని పెంచే 15 సూపర్ పవర్ ఫుడ్స్: క్లిక్ చేయండి

పురుషుల్లో ఫెర్టిలిటి మరియు డయాబెటిక్ మద్య లక్షణాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంటే, వాటిని గుర్తించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. మీరు పిల్లల కోసం ప్రయత్నిస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డయాబెటిక్ పురుషులు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుకొని, పిల్లలకోసం ప్రయత్నించవచ్చు.

డయాబెటిక్ మేల్ ఫెర్టిలిటి లక్షణాలను నివారించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు మీకోసం...

సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని,వీర్యకణాలను పెంచే రిసిపి: క్లిక్ చేయండి

1.హెల్తీ డైట్

1.హెల్తీ డైట్

రీసెంట్ గా డయాబెటిక్ లక్షణాలేవైనా మీకు కనబడినట్లైతే, అది మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది. దాంతో పురుషుల్లో ఇన్ఫెర్టిలిటికి దారితీస్తుంది. అందుకు హెల్తీ డైట్ అనుసరించడం ద్వారా, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు.

2.అధిక ఉష్ణోగ్రతను నివారించండి

2.అధిక ఉష్ణోగ్రతను నివారించండి

పురుషుల్లో ఫెర్టిలిటి మీద ప్రభావం చూపె డయాబెటిక్ స్పెర్మ్ నాణ్యత మరియు సెమెన్ వాల్యూమ్ ను తగ్గిస్తుంది. అందువల్ల అధిక టెంపరేచర్ కు గురికాకుండా ఉండాలని సలహా.

3.భావోద్వేగపు మద్దతు

3.భావోద్వేగపు మద్దతు

డయాబెటిక్ పేషంట్స్ లో సెక్స్ మీద కోరికలు తగ్గిస్తుంది. దాంతో ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది. అటువంటి పురుషులు వారి పాట్నర్ తో లేదా కౌన్సిలర్స్ తో మాట్లాడి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. భావోద్వేగపు లక్షణాలు తగ్గించుకోవాలి.

4.అలసటను నివారించాలి

4.అలసటను నివారించాలి

చాలా మంది పురుషులు మధుమేహం ఉన్నట్లైతే అలసటకు గురి అవుతుంటారు. అటువంటి వారిలో మేల్ ఫెర్టిలిటి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొన్నా చాలు మంచి ఫలితం ఉంటుంది.

5.హార్మోనుల అసమతుల్యత

5.హార్మోనుల అసమతుల్యత

ఇన్సులిన్ సమతుల్యంగా లేనట్లైతే, ప్యాక్రియస్ మరియు డయాబెటిస్ కు దారితీస్తుంది. దాంతో పురుషుల్లో పునరుత్పత్తి హార్మోనుల మీద ప్రభావం చూపుతుంది. వైద్య సలహాలు లేదా చికిత్సతో హార్మోనులు నార్మల్ గా పెట్టుకోవడం చాలా అవసరం.

6.వ్యాయమం

6.వ్యాయమం

డయాబెటిక్ పురుషుల్లో బరువులో హెచ్చుతగ్గుల్లో మార్పుల వల్ల తండ్రి అయ్యే సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా వ్యాయమం చేయడం ద్వారా ఫెర్టిలిటి ఛాన్స్ పెరుగుతుంది.

7.మెడికల్ సపోర్ట్

7.మెడికల్ సపోర్ట్

డయాబెటిక్ వల్ల పురుషుల్లో నరాల బలహీనత వల్ల రెట్రో గ్రేడ్ ఎజక్షన్(సెమెన్స్ బ్లాడర్ లోకి వెళుతుంది) పెరుగుతుంది. ఇది డయాబెటిక్ మేల్ ఫెర్టిలిటికి ప్రభావం చూపే లక్షణాల్లో ఇది ఒకటి. కాబట్టి, ఒక మెడికల్ సలహా తీసుకోవడం ద్వారా సమస్యను చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

8.యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు

8.యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు

మేల్ ఫెర్టిలిటి మరియు డయాబెటిస్ రెండూ ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. ఫలితంటా శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా జెనెటిక్ డ్యామేజ్ మరియు ఇన్ఫెర్టిలిటికి దారితీస్తుంది . కాబట్టి, ఈ సమస్యలను నివారించుకోవడానికి, రెగ్యులర్ డైట్ లో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.

9.భాగస్వామిని అర్థం చేసుకోవడం

9.భాగస్వామిని అర్థం చేసుకోవడం

డయాబెటిక్ పురుషుల్లో వారి సెక్స్ మీద కోరికలు చాలా తక్కువగా ఉండటం వల్ల సమస్యను మెయింటైన్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. కాబట్టి, పార్ట్నర్ ను అర్ధం చేసుకొని సమస్యను తగ్గించుకోవడానికి తగు జాగ్రత్తులు తీసుకుంటూ, పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి.

English summary

Male Fertility: Precautions For Diabetic Men

Legacy is something every man wishes to leave behind on this earth. As such, most people consider having a child as the epitome of their life. But, it is an unfortunate fact that late infertility problems are on the rise in both men and women.
Desktop Bottom Promotion