For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఉపవాసమా?ఐతే ఇవిగో హెల్తీ టిప్స్

|

నవరాత్రికి ఉపవాసం ఉండటం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంది. అయితే, గర్భధారణ సమయంలో ఉపవాసం ఉండాలంటే కొంచెం ఆలోచించవల్సిన విషయం. గర్భిణీ స్త్రీలు, నార్మల్ మరియు హెల్తీ ప్రెగ్నెన్సీలో ఉన్నట్లైతే అది గర్భిణీ స్త్రీ మీద లేదా కడుపులో పెరిగే శిశువు మీద ఎటువంటి ప్రభావంను చూపదు. కానీ, గర్భిణీ స్త్రీలో ఇదివరకే ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలున్నట్లైతే, ఇటువంటి సమయంలో ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం.

గర్భం ధరించిన మహిళ మొదటి త్రైమాసికంలో, కడుపులో పెరిగే శిశువు చాలా సున్నితత్వం కలిగి ఉంటారు. కాబట్టి, మొదటి త్రైమాసికంలో ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. అదే విధంగా, అదే విధంగా మూడవ త్రైమాసికంలో కూడా గర్భధారణ సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, మీరు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ ఉన్నట్లైతే, ఉపవాసం ఉండవచ్చు. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అది అలా ఉంచితే నవరాత్రి ఉపవాసా నియమాలు మరీ అంత కఠినతరం కాదు కాబట్టి, హెల్తీ అల్పాహారాలను టైం టు టైం తీసుకుంటూనే ఆరోగ్యంగా ఉపవాసం కొనసాగించవచ్చు. ముఖ్యంగా గర్భిణీ పొట్టలో పెరిగే శిశువు తల్లి తీసుకొనే న్యూట్రీషియన్స్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి, పూర్తిగా ఆహారాలు తీసుకోకుండా ఉపవాసలుండటం సరికాదు.

గర్భధారణ సమయంలో నవరాత్రి ఫాస్టింగ్ టిప్స్ కొన్ని మీకోసం ఇక్కడ అందిస్తున్నాము. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండటానికి ముందు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి...

నీళ్ళు తప్పనిసరి

నీళ్ళు తప్పనిసరి

గర్భిణీ స్త్రీల విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం, నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉపవాసం ఉన్నము కదా అనీ నీరు త్రాగకుండా ఉండకూడదు. కడుపులో పెరిగే శిశువు పూర్తిగా తల్లి తీసుకొనే పోషకాలు మరియు హైడ్రేషన్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి, నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

డాక్టర్ ను సంప్రదించాలి

డాక్టర్ ను సంప్రదించాలి

నవరాత్రి రోజుల్లో ఉపవాసం ఉండటానికి మీరంతట మీరు ఉపవాసం ఉండటానికి నిర్ణయాలు తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదని నిర్ధారించిన తర్వాత, ఉపవాసం ఉండవచ్చు.

ఆరోగ్యంగా తినాలి

ఆరోగ్యంగా తినాలి

ఎట్టి పరిస్థితిలోనూ ఆహారం పూర్తిగా తినకుండా ఉండకూడదు. గర్భంతో ఉన్నప్పుడు, తల్లికి మరియు కడుపులో పెరిగే శిశువుకు ఎనర్జీ తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి, ఉపవాసం ఉన్నా, తాజా పండ్లు మరియు ఉపవాసంలో తినదగిన హెల్తీ ఫుడ్స్ ను తీసుకోండం ఉత్తమం.

ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం మంచిది కాదు

ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం మంచిది కాదు

కొంత మంది ఉపవాసం రోజు మొత్తం ఏం తీసుకోకుండా ఉంటారు. కానీ, అలా గర్భణీ స్త్రీలు ఉండటానికి వీలు లేదు. ఎక్కువ సయయం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. బలహీనపడటం, రక్తహీనత, అలసట, ఎసిడిటి మరియు తలనొప్పి వంటి సమస్యలు గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటుంది కాబట్టి, ఎక్కువ సమయం ఉపవాసం ఉండకూడదు.

ఉప్పు

ఉప్పు

ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది ఉప్పుతో తయారుచేసే ఆహారాలకు దూరంగా ఉంటారు. కానీ, ఇది మరింత బలహీనపడేలా చేస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు, ఉపవాసంతో ఉన్నప్పుడు ఉప్పు తీసుకోవడం నివారించకండి. దాని వల్ల బేబికి వివిధ రకాల సమస్యలను వస్తాయి.

విశ్రాంతి తప్పనిసరి

విశ్రాంతి తప్పనిసరి

ఉపవాసంలో ఉన్నప్పుడు బలహీనంగా మరియు నిద్రవస్తున్నట్లు అనిపిస్తే వెంటనే కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడం ఏ మాత్రం విస్మరించకూడదు. గర్భంతో ఉన్నప్పుడు, ఉపవాస సమయంలో తగినంత నిద్ర, విశ్రాంతి చాలా అవసరం.

ద్రవాలు చాలా అవసరం

ద్రవాలు చాలా అవసరం

ఉపవాసంతో ఉన్నప్పుడు, నీటితో పాటు, ఇతర ద్రవాలు, పాలు, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ వంటివి తీసుకోవడం మర్చిపోకూడదు. తల్లి శరీరంతో పాటు, శిశువును కూడా హైడ్రేషన్ లో ఉంచడం చాలా అవసరం.

English summary

Navratri Fasting Tips For Pregnant Women

Fasting is the most important custom of Navratri. But fasting during pregnancy is a debatable topic. If you are going through a normal and healthy pregnancy, fasting will not have much effect on you or the child. But if you already have complications in your pregnancy the it is better to avoid fasting at this point of time.
Story first published: Tuesday, September 30, 2014, 16:00 [IST]
Desktop Bottom Promotion