For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండవ సారి గర్భం పొందుటకు ప్లానింగ్ మరియు చిట్కాలు

|

కొంత మంది స్త్రీలలో రెండవ సారి గర్భం పొందటం అంతు సులవేం కాదు. రెండవ సారి గర్భాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారా! గర్భాన్ని పొందటం లేదా రకాల మార్గాల ద్వారా ప్రయత్నించి ఉంటారు లేదా గర్భం పొందుటకు అందుబాటులో ఉన్న సకల మార్గాలకు అనుసరించి ఉంటారు కానీ, నిరాశే మిగిలిందా! రెండవ సారి గర్భం పొందుటకు చాలా మార్గాలు ఉన్నాయి కానీ వీటిని సరైన రీతిలో ప్రయత్నిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

రెండవసారి గర్భం పొందటానికి మీరు అనుసరించాల్సిన వాటి గురించి ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది...

Planning and preparing for a second pregnancy

1. అండం విడుదలయ్యే సమయం గుర్తుంచుకోవాలి:
రుతుక్రమం ముందు లేదా అండం విడుదలయ్యే రెండు లేదా మూడు రోజుల ముందు భాగస్వామితో లైంగికంగా కలవటం వలన గర్భం పొందవచ్చు. ఇది స్వతమాగా ఎంపిక చేసుకొనే మార్గం, అండం విడుదల అవటానికి ముందు కొన్ని రోజుల వరకూ కలయిక పరంగా మీ భర్తకు దూరంగా ఉండండి. కారణం ఎక్కువ సమయం పాటు దూరంగా ఉండటం వల్ల శుక్రకణాల విడుదల అధికంగా ఉండి, అండం విడుదల సమయంలో అండంతో కలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా గర్భం తప్పక పొందవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Planning and preparing for a second pregnancy

2. ఫలదీకరణ సమయంపై దృష్టి సారించాలి:
ఫలదీకరణ సమయంలో, అండం విడుదల అవటానికి మూడు నుండి ఐదు రోజుల సమయం ముందు, స్త్రీ యోని మృదువుగా, తడిగా ఉండి, తెరచి ఉంటుంది. కానీ మిగతా సమయంలో గరకుగా, పొడిగా మరియు మూసి ఉంటుంది.

Planning and preparing for a second pregnancy

3. బాసిల్ బాడీ ఇండెక్స్ తో శరీర ఉష్ణోగ్రతను లెక్కించండి :
ఫలదీకరణ సమయంలో స్త్రీ యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలను లెక్కించటం వలన చాలా మంది స్త్రీలలో రెండవ సారి గర్భం పొందుతున్నారు.

Planning and preparing for a second pregnancy

4. నిపుణుల సలహాలను సేకరించాలి:
గర్భం పొందటంలో మీరు ఎవైన తప్పిదాలను చేసినట్లయితే వెంటనే వైద్య నిపుణుల సహాయం తీసుకోండి. మంచి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని, మీ శరీర హార్మోన్'ల ఉత్పత్తిని మరియు వాటి స్థాయిలను గురించి తెలుసుకోండి. మీలో ఉన్న లోపాలను లేదా గర్భం పొండుటలో మీరు చేసే తప్పిదాల గురించి, వైద్యుడు తగిన సూచనలు ఇస్తాడు. రక్త పరీక్ష మరియు పాప్ స్మెర్ ఫలితాలు సాధారణంగా ఉండాలి, లేనట్లయితే గర్భం పొందుటకు వైద్యుడి సాయం తప్పక అవసరం.

Planning and preparing for a second pregnancy

5. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:
మీరు గర్భాన్ని పొందాలని అనుకుంటున్నారా! అయితే మీ జీవన శైలి మరియు ఆహర సేకరణలో మార్పులు తప్పని సరి. మీ ఆహరంలో ఫోలిక్ ఆసిడ్'ను అందించే ఆహారాలను అధికంగా కలపండి, స్త్రీల ఆరోగ్యానికి మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ మూలకం తప్పనిసరి అవసరం.

Planning and preparing for a second pregnancy

6. ఒత్తిడి తగ్గించుకోవాలి:
ఒత్తిడికి గురి అవుతున్నారా, అయితే ఒత్తిడిని నిర్వహించటం నేర్చుకోండి. గర్భాన్ని ధరించటంపై తప్పకుండా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఒత్తిడి వలన శరీరంలో హానికర విష పదార్థాలు విడుదల అయి, గర్భాన్ని పొందే క్రియను నిలిపి వేస్తాయి. కావున మీరు ఒత్తిడిని సరైన రీతిలో నిర్వహిస్తూ, మీ భాగస్వామితో అధిక సమయం కేటాయించండి.

Planning and preparing for a second pregnancy

ఇక్కడ తెలిపిన పద్దతులను పాటించటం వలన మీరు రెండవ సారి గర్భాన్ని పొందుతారు, ఇవి మీ లక్ష్యాన్ని చేరుటకు సహాయపడతాయి. మీరు ప్రయత్నించే వాటితో వీటిని కలిపి, సరైన రీతిలో గర్భం పొందటం పైన దృష్టి సారించి, ఎదురయ్యే సమస్యలను తగ్గించుకొని, తగిన విధంగా ఫలితాన్ని పొందండి.

English summary

Planning and preparing for a second pregnancy

If you ask any couple secretly, they tell you that their first born was unplanned but the second was planned well in advance. It is the rule of nature that your first baby is born out of inexperience but it always makes sense to plan your second pregnancy well. There are many reasons for saying that planning your pregnancy the second time around is mandatory and they are not just concerning your first born.
Desktop Bottom Promotion