For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొనేవారు నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు

|

సాధారణంగా కొంత మంది మహిళలకు తాము గర్భం ధరించామన్న విషయం డాక్టర్ వద్దకు వెళ్ళే వరకూ గుర్తించలేరు. కొంత మంది మహిళల్లో వారు నెలతప్పారని లేదా అకస్మాత్తుగా నీరసం, అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే ఈ లక్షణాన్నిగుర్తిస్తారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు, కొంత మంది మహిళల్లో గర్భం ధరించే సమయంలో పొట్ట క్రింద(ఉదరబాగం)లో నొప్పి వస్తుంది. అయితే ఆ ఆబ్డోమినల్ పెయిన్(పొట్ట ఉదరంలో )వచ్చే నొప్పిని సాధారణంగా గ్యాస్ లేదా ఎసిడిటి వల్ల వచ్చే నొప్పి అని నిర్లక్ష్యం చేస్తుంటారు.

మీకు అందుబాటులో ఉండే కొన్ని ప్రెగ్నెన్సీ బుక్స్ ను చదివిన లేదా ఇతరులు ఎంత సమాచారం ఇచ్చినా సరే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు తరచూ మనస్సు మారుతుండటం, తలనొప్పి, వికారం, లోయర్ ఆబ్డోమినల్ పెయిన్, జ్వరం, ఎక్కువగా లేదా తక్కువ వైజినల్ బ్లీడింగ్ చాలా మంది మహిళ ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే పీరియడ్స్ మిస్ అవ్వడం ఒక్కటే ప్రెగ్నెన్సీ లక్షణం అనుకోకూడదు.

గర్భం పొందితే ప్రారంభంలో లక్షణాలు ఇలా ఉంటాయి!:క్లిక్ చేయండి

ఎందుకంటే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఒక మహిళ నుండి మరో మహిళలకు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ప్రతి మహిళ ఎదుర్కొనే చాలా సాధరణ లక్షణాలు. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు ఈ లక్షణాలలో ఏ ఒక్కటి మీరు గుర్తించానా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.మీరు గర్భం ధరించడానికి అనువైన కాలం (కరెక్ట్ డేట్)తెలుసుకోవాలంటే ఓవొలేషన్ కాలిక్యులేటర్:క్లిక్ చేయండి


మీరు నిర్ల్యం చేయకూడని ప్రెగ్నెన్సీ లక్షణాలు

అకస్మాత్తుగా బరువు పెరగడం

అకస్మాత్తుగా బరువు పెరగడం

మహిళలు వారి డైట్ విషయంలో సరైన జాగ్రత్తలు మరియు అవగాహన లేకపోవడం వల్లనే అని చాలా మంది మహిళలు అనుకుంటారు. అయితే సడన్ గా బరువు పెరిగితే, అది ప్రెగ్నెన్సీలో ఒక లక్షణంగా గుర్తించాలి.

వాంతులు

వాంతులు

కొన్ని సందర్భల్లో ఎక్కువ ఆహారం తీసుకొన్న తర్వాత వాంతి వచ్చే అనుభూతి చెందుతారు. అంతే రోజులో ప్రతి భోజనం తర్వాత ఇటువంటి అనుభూతి ఎదురైతే, అప్పుడు అది గర్భధారణ ప్రారంభ సంకేతంగా గుర్తించాలి.

ఎక్కువగా తలనొప్పిగా ఉండటం

ఎక్కువగా తలనొప్పిగా ఉండటం

గర్భధారణకు తలనొప్పి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సాధారణ మహిళల్లో కంటే, గర్భదారణ పొందే స్త్రీలలో తలనొప్పి ఒక సాధారణ చిహ్నంగా ఉంటుంది.

లోయర్ ఆబ్డోమిన్ పెయిన్(పొత్తికడుపు నొప్పి)

లోయర్ ఆబ్డోమిన్ పెయిన్(పొత్తికడుపు నొప్పి)

లోయర్ అబ్డోమిన్ పొత్తికడుపులో నొప్పి మరియు వెన్ను నొప్పి మీరు కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం లేదా ఇతర శరీరక మార్పులు ఇంకా కొన్ని తిమ్మరెలు కూడా ప్రెగ్నెన్సీలో ఒక లక్షణంగా గుర్తించాలి. అయితే, తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

జ్వరం

జ్వరం

కొన్నిసార్లు, శరీరం యొక్క ఉష్ణోగ్రత సడెన్ తగ్గడం లేదా సడెన్ గా పెరగడం అనేది హార్మోను మార్పుల వల్ల జరుగుతుంది. అందుకు వైద్యపరమైన అవసరం ఉంటుంది. మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న మరియు అకస్మికంగా జ్వరంతో బాధపడుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది గర్భం పొందే ప్రారంభ లక్షణాల్లో ఇది ఒకటి.

అలసట(మైకం)

అలసట(మైకం)

గర్భధారణ ప్రారంభ లక్షణాల్లో ఇది ఒక సాధారణ ప్రెగ్నెన్సీ లక్షణం. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు పెరగడం లేదా తగ్గడం వల్ల అలా జరగవచ్చు మరియు వెయిట్ లాస్ డైట్ కూడా అలసటకు కారణం కావచ్చు. అయితే, అసురక్షితమైన లైంగిక ప్రక్రియ కలిగి ఉన్నా మైకంతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు, డాక్టర్ ను సంప్రదించండి.

పీరియడ్స్ మిస్ అయినప్పుడు

పీరియడ్స్ మిస్ అయినప్పుడు

కొంత మంది మహిళలు పీరియడ్స్ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు, ఈ సమయంలో పీరియడ్స్ మరింత ఆలస్యం అవుతుంది. మీరు గర్భం పొందాలని నిర్ధారించుకొన్నప్పుడు, ఈ లక్షణాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు.

English summary

Pregnancy Symptoms You Should Never Ignore

Often a woman does not realise that she is pregnant. They only get a sign when they miss their periods or start feeling sick suddenly. However, there are certain pregnancy symptoms that one must never ignore. For example, some women start getting abdominal pain in the very early stages of pregnancy. They tend to ignore this pregnancy symptom by thinking that it must be gas or acidity.
Desktop Bottom Promotion