For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

By Super
|

మీ గర్భధారణ సమయంలో మీకు మరియు మీ శిశువుకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లను పొందటానికి చేప ఒక అద్భుతమైన మూలాదారమైన ఆహారం. కానీ మీకు, మీ శిశువుకు ఏవిధమైన హాని లేదు అని నిర్ధారించుకుని ఆ తరువాత సముద్రపు ఆహారాన్ని వినియోగించాలి. ఎందుకంటే కొన్ని రకాల చేపలు, ముఖ్యంగా పెద్ద సముద్రపు నీటిలోని చేపలు పాదరసం యొక్క ఆనవాళ్ళను కలిగిఉంటాయి. వీటివలన మీ శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించిన కొన్ని తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు.

సాధారణంగా, పాదరసం పరిశ్రమల వ్యర్థపదార్థాలను సముద్రంలోకి వదలటం ద్వారా సముద్రపు నీటిలోకి ప్రవేశిస్తుంది మరియు మిథైల్ మెర్క్యూరీ గా మారుతుంది. ఈ ఘోరప్రమాదకరమైన సమ్మేళనం ద్వారా నీరు కలుషితమై, నీటిలో నివసించే చేపలలోకి ప్రవేశిస్తుంది. ఇది చేపను శుభ్రంగా వండిన తర్వాత కూడా అందులోనే నిల్వ ఉంటుంది. గర్భధారణ సమయంలో పాదరసం ఎక్కువ స్థాయిలో ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన శిశువు యొక్క మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం పడవచ్చు.

అందువలన ముందు జాగ్రత్త చర్యగా, చేపను ఆహారంగా వారంలో ఒకసారి తీసుకోండి. ఈ విధంగా చేపల వినియోగాన్ని పరిమితం చేసుకోండి. మీ ఆహారంలో చేపలను తొలగించడం సురక్షితమైన మార్గం. కానీ మీ శిశువు యొక్క మెదడు మరియు కంటి అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించే చేప వలన లభించే గొప్ప ప్రోటీన్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పరిమితం అవుతాయి.

గర్భధారణ సమయంలో చేప తినవలసి వొస్తే, ఈ నియమాలు అనుసరించండి:

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

మీరు తినే చేపలు బాగా ఉడికాయా మరియు పచ్చిగా ఉన్నాయా అని నిర్ధారించుకోండి. పచ్చిగా లేదా వండని చేపలు తినటం వలన ప్రతికూల పరిణామాలు ఏర్పడి పరాన్నజీవి లేదా బాక్టీరియా వ్యాధులు తల్లి కడుపులో ఉన్న పిండం చేరి, అనేక తీవ్రమైన పరిణామాలకు దారి తీయవొచ్చు.

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

స్వోర్డ్ ఫిష్, రాజు మాకేరెల్ మరియు షార్క్ వంటి పెద్ద సముద్ర నీటి చేపలను నివారించండి. వీటికి బదులుగా రాహు, కట్ల, హిల్సా, సుర్మై వంటి స్థానిక చెరువులలో కనిపించే చేపలను ఆహారంగా తీసుకోండి.

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

సంరక్షణకారులతో నిల్వ చేయబడిన చేపలను ఆహారంగా నివారించండి.

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

ప్రెగ్నెన్సీ చిట్కా - చేపలు తినే సమయంలో జాగ్రత్తగా ఉండండి

చివరిడి మీరు చేప ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం వలన కలిగే భర్తీని ఒమేగా -3 కొవ్వు ఆమ్లం కలిగిన ఫ్లాక్సీద్ , పెరుగు, గుడ్లు వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

English summary

Pregnancy Tip – Be cautious while eating fish

Fish can be an excellent source of omega-3 fatty acids and proteins, that can do a great deal of good to you and your baby during your pregnancy. But keep in mind that you need to be cautious with your seafood consumption to ensure that it doesn’t harm your baby in any way.
Story first published: Thursday, September 11, 2014, 16:03 [IST]
Desktop Bottom Promotion