For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలో హెమరాయిడ్స్(పైల్స్)నివారణ చర్యలు

|

గర్భాధారణ అనేది తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా గర్భిణీకి. స్త్రీ గర్భం ధరిస్తే చాలా ఆనందం చెంది తన భావోద్వేగాలు చెప్పలేనంతగా ఉంటాయి. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు సంతరించుకొంటాయి. ఫిజికల్ గా మార్పు చెందే ఈ మార్పులు చాలా సాధారణంగానే ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడుతాయి అందరికీ తెలిసిన విషయమే. పొట్టలో బేబీ పెరిగే కొద్దిగా పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాలుగా ఎమోషనల్ కు గురిఅవుతుంటారు. ఉదయం పూటా ఎక్కువ అలసట చెంది వేవిళ్ళు చేసుకోవడం ఇవన్నీ గర్భిణీలో సాధారణంగా కనిపించే మార్పులు.

అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే మార్పులు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఈ మార్పులతోనే కాకుండా మరొకొన్ని ఇతర మార్పులు గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి అసౌంకర్యానికి గురిచేస్తాయి. అలాంటివి చాలా సాధారణమైటువంటి.. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనుభవం కలిగినటువంటివి. వాటిలో ముఖ్యంగా గ్యాస్ తో ఇబ్బంది పడటం, అసంకల్పిత మూత్రవిసర్జన, దుర్వాసన, జుట్టు పెరుగుదల, మొటిమలు, మచ్చులు, హెమరాయిడ్స్ వంటివి చాలా సాధారణ సమస్యలు. హెమరాయిడ్స్ గర్భధారణ సమయంలో చాలా సాధారణం. వారి శరీరంలో అనేక హార్మోనుల మార్పుల వల్ల డైజెషన్ కెపాజిటితి తగ్గుతుంది. ఫలితంగా పైల్స్ కు గురికావల్సి వస్తుంది.

గర్భిణీ పొట్టలో పిండం క్రమంగా పెరుగుతుండటం వల్ల లోయర్ యూట్రస్ మీద ఒత్తిడి పెరగుతుంది. ఫలితంగా బరువు పెరగడం, మలబద్దకం, పైల్స్ గర్భిణీలకు చాలా సాధరణం. కాబట్టి, గర్భిణీల్లో ఈ హెమరాయిడ్స్ సమస్యను నివారించడానికి కొన్నిఉత్తమ మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి ...

నీళ్ళు మరియు లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి:

నీళ్ళు మరియు లిక్విడ్స్ ఎక్కువగా తాగాలి:

గర్భధారణ సమయంలో హెమరాయిడ్స్ నివారించడానికి సాధ్యమైనంత ఎక్కువగా నీళ్ళ మరియు పండ్ల రసాలను తీసుకోవాలి. మలబద్దకానికి ఇది ఒక నేచులర్ చికిత్స వంటిది. ఇలా రెగ్యులర్ గా అలవాటు చేసుకొంటే, జీర్ణవ్యవస్థకూడా అలా అలవాటు పడుతుంది. గర్భిణీ కనీసం ఒక రోజుకు దప్పిక ఉన్నా లేకున్నా పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవడం తప్పనిసరి.

ఫైబర్ ఫుడ్స్ తినాలి:

ఫైబర్ ఫుడ్స్ తినాలి:

పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు ధాన్యాలు, పచ్చికూరలు, తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది . ఫలితంగా హెమరాయిడ్స్ ను ఉపశమనం పొందవచ్చు. డైటరీ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ప్రెగ్నెన్సీ యోగా లేదా స్ట్రెచ్చింగ్:

ప్రెగ్నెన్సీ యోగా లేదా స్ట్రెచ్చింగ్:

గర్భిణీ స్త్రీ చాలా తక్కువగా స్ట్రెచ్చింగ్, శరీరాన్ని సాగదీయడం లేదా డాక్టర్ సలహా మేకు యోగ వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బ్రీతింగ్ వ్యాయామం మరియు ఫ్లోర్ ఎక్సర్ సైజ్ లు డాక్టర్ సలహా తీసుకొని చేయవచ్చు. కడుపులో పిండంకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకొన, వ్యాయామం చేయవచ్చు.

స్థిరంగా ఉండకూడదు:

స్థిరంగా ఉండకూడదు:

సరిగా బౌల్ మూమెంట్ జరగాలంటే, కొంచె కదలికలు ఉండాలి . టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు(పాదాలు)పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెజర్ తగ్గుతుంది. స్థిరంగా కూర్చోవడం వల్ల డైజెస్టివ్ ప్రొసెస్ ఆలస్యం అవుతుంది ఫలితంగా హెమరాయిడ్స్ కు కారణం అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు సిట్టింగ్ పొజీషన్ మార్చుతుండాలి, వెళ్ళకిలా పుడకోవడం, కొద్దిదూరం నడవడం వంటివి చేస్తుండాలి.

డాక్టర్ సహాయం:

డాక్టర్ సహాయం:

డాక్టర్ ను సంప్రధించి సరైన చికిత్సని తీసుకోవల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సహజ పద్దతుల్లో పైల్స్ ను నివారించుకోవచ్చు.

ఉదాహరణకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అయ్యి, పాసేజ్ ను సులభతరం చేస్తుంది. అందుకు ఫైబర్ అధికంగా ఉండే లెగ్యూమ్, అరటి, సిట్రస్ మరియు ఫింగ్ వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా పైల్స్ ను నివారించవచ్చు.

English summary

Prevent Hemorrhoids During Pregnancy

Hemorrhoids are blood vessels around the anus which get swollen. The swollen veins are generally located at the lower part of the anal area. The swollen veins or hemorrhoids stretch the vein walls causing irritated bowel movements. Hemorrhoids are also known as piles.
Story first published: Thursday, March 6, 2014, 18:27 [IST]
Desktop Bottom Promotion