For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఏర్పడే రిలేషన్ షిప్ ప్రాబ్లెమ్స్

By Lakshmi Perumalla
|

సాధారణంగా మహిళ గర్భిణీ అని నిర్ధారించుకొన్నప్పటి నుండి తనతో పాటు, తన కడుపులో పెరుగుతున్న శిశువు కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త పాత్రపోషిస్తూ ఆనంధించడం మొదలు పెడుతుంది. అయితే అది పురుషుల్లో మాత్రం అలా ఉండదు. అతను తండ్రి అయిన తర్వాత అంటే శిశువు జన్మించిన తర్వాత మాత్రమే ఆ భావనలు అతనిలో(తండ్రిలో)ప్రారంభమవుతాయి. ఆ కారణం చేతనే చాలా మంది పురుషలు గర్భదారణలో ఉన్న తమ పార్ట్నర్ యొక్క భావోద్వేగాలను తెలుసుకోలేకపోతారు. దాంతో గర్భధారణ సమయంలో కొన్ని రిలేషన్ లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతాయి.

20శాతం మహిళలు తప్ప మిగిలిన వారంత గర్భధారణ సమయంలో తప్పనిసరిగా భావోద్వేగాలకు గురి అవుతుంటారు మరియు రిలేషన్ షిప్ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అదే సమయంలో గర్భిణీ చాలా ఛాలెంజింగ్ గా మరియు ఎక్సైటింగ్ గా ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఎటువంటి రిలేషన్ షిప్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పార్ట్నర్ ను మంచిగా అవగాహన చేసుకోవడం వల్ల సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. అంటే మీ సమస్యలను పరిస్కరించడానికి సమర్థవంతమైన మార్గాలను తెలుసుకొన్నప్పుడు, గర్భధారణ సమయంలో మరింత తేలికగా, సంతోషంగా ఉండగలుగుతారని అర్ధం.


అంత వరకూ మీ కడుపులో పెరుగుతున్నా శిశువుకు ఒక సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తూ , ఎమోషనల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది శారీరికంగా మరియు మానసికంగా ప్రతి బింబిస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో పార్ట్న మరింత ఎమోషనల్ గా గురికాకముందు మరింత గొప్ప జాగ్రత్లు మరియు సపోర్ట్ తీసుకొన్నట్లైతే సంబంధ సమస్యలను నివారించుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఎదురయ్యే కొన్ని సాధారణ సమస్యలు ఇక్కడ కొన్నింటిని మీకోసం అంధిస్తున్నాం.

మద్దతు మరియు అవగాహన లేకపోవడం :

మద్దతు మరియు అవగాహన లేకపోవడం :

గర్భధారణ సమయంలో మాంద్యం (డిప్రెషన్) మరియు ఆందోళన, జీవిత భాగస్వాములు మధ్య సంతోషంగా లోపించడానికి ప్రధాన కారణాలలో ఒకటి అని చెప్పవచ్చు. . అర్ధం చేసుకోవడం మరియు అవగాహన చేసుకోవడం ముఖ్యంగా మీ పార్ట్నర్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇది చాలా అవసరం.

కమ్యూనికేషన్ లేకపోవడం :

కమ్యూనికేషన్ లేకపోవడం :

గర్భదారణ సమయంలో సంబంధంలో సమస్యలు ఉత్పన్నమయ్యేది ముఖ్యగా జంట ఇద్దరూ ఒకరి భావాలు ఒకరు, ఒకరితో ఒకరు పంచుకోకపోవడం దాంతో ఇద్దరి మద్య కమ్యూనికేషన్ కొరవడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ డిప్రెషన్ మూడ్ లో ఉన్నప్పుడు ఆమె భర్త , తన భార్యతో మాట్లడకపోవడం వల్ల , ఆమె తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తుంది.

భావోద్వేగపు అంతరాయం:

భావోద్వేగపు అంతరాయం:

కొన్ని సందర్భాల్లో ఆమె భర్త ఇటువంటి సమస్యలను డీల్ చేయడానికి సవాలుగా ఉంటుంది. అయితే ఆమె యొక్క మిశ్రమ భావోద్వేగాలు పరిగణలోకి తీసుకొని, తన పార్ట్నర్ గురించి విస్తృత అవగాహన మరియు వారి భాగస్వామి కోసం గౌరవం అభివృద్ధి చేయాలి . మానసిక కల్లోలం మొదటి త్రైమాసికంలో సమయంలో సాధారణ మరియు మరింత సాధారణం మరియు వారు గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత పెరుగడంతో ఇటువంటి సమస్యలు ఏర్పడుతాయి.

బలహీనమైన కుటుంబ బంధాల :

బలహీనమైన కుటుంబ బంధాల :

చాలా వరకూ గర్భధారణ సమస్యలు కొన్నింటిత అనుసందానించి బడి ఉంటాయి , గర్భవతి ఆందోళన , నిరాశ, ఒత్తిడి , మరియు అసౌకర్యం భావన వంటి భావాలు అధిక సమస్యలకు దారితీస్తుంది. . ఈ గర్భధారణ సమయంలో మరింత తీవ్రమైన సంబంధం సమస్యలకు దారితీస్తుంది .

మహిళల శారీరక మార్పులు :

మహిళల శారీరక మార్పులు :

స్త్రీలు గర్భధారణ సమయంలో ఏర్పడే శారీరక మరియు భావోద్వేగపు సమస్యల వల్ల బరువు పెరగడం, డిప్రెషన్, మరియు అలసటగా భావించడం వంటివన్నీ జీవిత భాగస్వాములు మధ్య లైంగిక సంబంధం మీద ప్రభావం చూపుతుంది.

అపార్థాలు :

అపార్థాలు :

గర్భవతిగా ఉన్నప్పుడు సంబంధం సమస్యలు ఈ రోజుల్లో సాధారణం . చాలా తరచుగా మ్యారేజ్ బ్రేకప్ అవుతా ఉంటుంది. ఇంకా చాలా చిన్న అపార్థాలే పార్ట్నర్స్ మద్య పెద్దపెద్ద అపార్థాలకు దారి తీస్తుంది . ఇవి అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కూడా ఉంటాయి.

డిప్రెషన్ చెందిన పార్ట్నర్:

డిప్రెషన్ చెందిన పార్ట్నర్:

ముందుగా, మీరు తరచూ మూడ్ మారడాన్ని మరియు డిప్రెషన్ మద్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోవాలి. అయితే డిప్రెషన్ అతి పెద్ద సమస్య మరియు కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. 10శాతం గర్భిణీలు చుట్టూ కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించవచ్చు.

వాదనలు :

వాదనలు :

గర్భిణీ చాలా చిన్న విషయాలపై డిప్రెషన్ అవ్వడం మరియు సెల్ఫ్ క్రిటికల్ గా మారుతుంది. కాబట్టి, వాదనలు నివారించడం మరియు ఆమె ఫీలింగ్స్ మరియు భావోద్వేగాలను అర్ధం చేసుకోవడం మంచిది .

మీ భాగస్వామి మద్దతు ఇవ్వడం ఎలా ?

మీ భాగస్వామి మద్దతు ఇవ్వడం ఎలా ?

గర్భదారణ సమయంలో సంబంధంలో సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు మరియు ఇద్దరు ఒకరికొకరు చాలా కమ్యూనికేట్ చేయవచ్చు. ఇద్దరూ కూడా గర్భధారణ గురించి మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకొని సంబంధం బలోపేతం చేసుకొని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలి.

Story first published: Friday, January 17, 2014, 14:33 [IST]
Desktop Bottom Promotion