For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్నింగ్ సిక్ నెస్ తో పోరాడే హోం రెమెడీస్

By Mallikajuna
|

గర్భవతులందరకు ఉమ్మడి సమస్య ఉదయంవేళ వాంతులు, వికారాలు. ఇవి 4వ వారంనుండి మొదలై షుమారుగా 14 నుండి 16వ వారం వరకు కొనసాగుతాయి. కొంతమందికి గర్భవతి దశ అంతా కూడా ఈ సమస్య వుంటుంది. వికారం, వాంతులు కొద్దిగా అవుతూంటాయి. వేవిళ్ళు ఎందుకు వస్తాయి? గర్భం ధరించినపుడు ఆమెలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయి. హెచ్ సిజి అనే హార్మోన్ ఈ వికారం కలిగిస్తుంది. దీనిని హ్యూమన్ గొనడోట్రోపిన్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రిలీజ్ అయితే వికారం కలుగుతుంది. అండాశయం ఈస్ట్రోజన్ విడుదల చేస్తుంది.

ప్రొజెస్టిరోన్ హార్మోన్ గర్భవతిలో గర్భాశయంలోని కండరాల సడలింపుకు సహకరిస్తుంది. ఇది బేబీ ఎదురుదల మరియు పుటుకలకు తేలికగా వుంటుంది. అదే సమయంలో ఆమె పొట్ట మరియు పేగులను కూడా రిలాక్స్ చేసి అధిక జీర్ణ ఆమ్ల రసాలను ఉత్పత్తి చేసి గుండె మంట వంటివి కలిగిస్తుంది. ప్లాసెంటా ద్వారా ఎనర్జీ పోయినపుడు లో బ్లడ్ షుగర్ స్ధాయి అంటే హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. ఇది కూడా ఆమెలో వికారం కలిగిస్తుంది.

గర్భవతుల్లో సుమారుగా 50 శాతం మహిళలు మార్నింగ్ సిక్ నెస్ లేదా ఉదయ వేళ వికారంతో బాధ పడుతూంటారు. కొంతమందికి ఇది తీవ్రంగా వుంటుంది. పేరుకు ఇది మార్నింగ్ సిక్ నెస్ అయినప్పటికి రోజులో ఏ సమయంలోనైనా రావచ్చు. వికారం, చూపు మందగించుట, ఆకలి లేకపోవుట దీని లక్షణాలు. గర్భవతులకు మొదటి త్రైమాసికంలో ఇది వస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ ఒక్కోసారి డీహైడ్రేషన్ కూడా కలిగించి కడుపులో వున్న బేబీకి హాని కలిగించగలదు. దీనిని పూర్తిగా నివారించలేం కాని తగ్గించవచ్చు. కొన్ని పరిష్కారాలు చూడండి...

విశ్రాంతి బాగా తీసుకోవాలి

విశ్రాంతి బాగా తీసుకోవాలి

మీరు గర్భవతి అయినతర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇది మీకు మరియు మీ కడుపులో పెరిగే బేబీకి మీద బాగా పనిచేస్తుంది. విశ్రాంతి తీసుకొనేటప్పుడు మీ వెనుక భాగంలో దిండును ఎత్తుగా మీకు సౌకర్యవంతంగా వేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆహారం తిన్న తర్వాత మరియు రాత్రి సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మీ నిద్రకు భంగం కలిగించే విధంగా ఒత్తిడికి గురికాకండి.

చాలా నిధానంగా నిద్రలేవాలి

చాలా నిధానంగా నిద్రలేవాలి

నిద్రలేచేటప్పుడు చాలా నెమ్మదిగా నిద్రలేవడానికి అలవాటు చేసుకోవాలి . ఎప్పటిలాగే హాఠాత్తుగా నిద్రలేవకండి. మీశరీరంను సౌకర్యంగా పక్కకు తిరిగి తర్వాత నిధానంగా నిద్రలేవాలి ఏదైన సపోర్ట్ గా పట్టుకొని చాలా నిధానంగా లేవాలి. మీ పొట్టలో బేబీ ఉన్న సంగతిని మర్చిపోకూడదు.

మీకు నచ్చే మీఒంటి సరిపడే ఆహారాలు తీసుకోవాలి

మీకు నచ్చే మీఒంటి సరిపడే ఆహారాలు తీసుకోవాలి

గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ వదిలించుకోవడానికి కెఫిన్ ను నివారించండి. అది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు . అలాగే ఫ్యాటీ ఫుడ్స్ మరియు కారంగాఉన్న ఆహారాలను పూర్తిగా నివారించాలి. అవి మీ ఆరోగ్యానిక చాలా హానికరం అని నిరూపించడం జరిగింది . మీ ఒంటికి సరిపోడే ఆహారాలు చాలా తక్కువ మోతాదలు గంట గ్యాప్ ఇస్తు చిన్న మోతాదుల తీసుకోవాలి . ఎక్కువ పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. మీ పొట్టను ఎక్కువ సమయం కాలీ ఉంచకూడదు. పొట్టలో ఆమ్లాలు ఏర్పడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

భౌతికంగా చురుకుగా ఉండంటి

భౌతికంగా చురుకుగా ఉండంటి

మార్నింగ్ సిక్ నెస్ వల్ల మీరు అలసటకు గురి అవుతారు మరియు మీరు ఎటు కదలలేకుండా చేయవచ్చు . మీరు ఎప్పుడు పడకమీద పడుకోవాలినిపిస్తుంది. కానీ, చిన్న కదలకి చాలా అవసరం. భౌతికంగా కదలికలు కలిగి ఉండటం చాలా అవసరం. దాంతో మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలను నివారించవచ్చు.

కంప్యూటర్ తో మరింత జాగ్రత్త

కంప్యూటర్ తో మరింత జాగ్రత్త

కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారికి కొన్ని సందర్భాల్లో వికారానికి దారితీయవచ్చు, ఒక వేళ అటువంటి సందర్భాల్లో మీరు కంప్యూటర్ ఉపయోగించడం పూర్తిగా నివారించాలి. కానీ మీరు తప్పనిసరిగా ఉపయోగించాలంటే జూమ్ చేసి ఉపయోగించవచ్చు .

అల్లం మరియు ద్రవాలు

అల్లం మరియు ద్రవాలు

సమస్య ఏం ఉన్నా, అల్లం ఒక ఉత్తమ రెమెడీ. అల్లం వికారంకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే ఒక ఉత్తమ పదార్థంఅల్లం. మీరు చల్లని అల్లం టీని తాగవచ్చు, లేదా అల్లం వాసన చూడవచ్చు . అలాగే గర్భధారణ సమయంలో మీకు సాధ్యమైనంత వరకూ ఎక్కువగా ద్రవాలను త్రాగండి. మీరు నీళ్ళు ఎక్కువగా త్రాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత కూడా మార్నింగ్ సిక్ నెస్ కు దారితీయవచ్చు . అందువల్ల సాధ్యం అయినంత వరకూ నీరు త్రాగండి.


English summary

Remedies to fight extreme morning sickness

Pregnancy is the most beautiful period in one’s life! If you are pregnant, there’s this obvious joy in your heart of having that baby. You talk endlessly with your baby. But, while there’s joy, there is also that morning sickness that takes toil on pregnant mothers. Nausea, early into the mornings, is not a new thing associated with pregnancy.
Story first published: Wednesday, January 29, 2014, 10:17 [IST]
Desktop Bottom Promotion