For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు : ఈ వెజిటేబుల్స్ సురక్షితమే...

|

మహిళ గర్భణీగా ఉన్నప్పుడు, ఆమెకు వివిధ రకాలుగా ఆకలి కోరికలు పెరుగుతాయి. ఎంత తిన్నాకూడా ఇంకా ఏదో తినాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరికలు ఒక్కో గర్భిణీ స్త్రీలో ఒక్కోవిధంగా ఉంటుంది. ఒకరిలో స్వీట్స్ తినాలనుంటే, మరికొరిలో, కారం తినాలని ఉంటుంది. మరికొరిలో పచ్చికూరలు తినాలినిపిస్తుంది. అయితే, గర్భిణీ స్త్రీలు పచ్చికూరగాయలు తినడం వల్ల కడుపులో పెరిగే ఫీట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని ఒక పాతకాలపు అపోహం ఉంది. కానీ రీసెంట్ గా కొన్ని పరిశోధన ప్రాకారం గర్భిణీ స్త్రీలు పచ్చికూరగాయలను తీసుకోవడం ద్వారా అత్యధికంగా ప్రోటీనులు మరియు మినరల్స్ పొందుతుందని నిర్ధారించారు.

అయితే పచ్చికూరల్లో బ్యాక్టీరియా మరియు హెమగ్లూటనిన్ కలిగి ఉంటాయాని అవి రెడ్ బ్లడ్ సెల్స్ క్రియలకు ఆటంకం కలిగిస్తాయని చెబుతారు. అందువల్ల, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవడానికి ముందు ఉప్పు నీటిలో వెజిటేబుల్స్ ను కొంత సమయం నానబెట్టి, శుభ్రంగా కడిగేసి తర్వాత తీసుకోవాలని ఆహార నిపుణుల యొక్క సలహా.

గర్భధారణ సమయంలో ఒక గుప్పెడు పచ్చికూరలు తీసుకోవడం చాలా మంచిది. మీరు గర్భధారణ సమయంలో మీకు నచ్చిన పచ్చికూరలు తినాలని మీకు ఇష్టంగా ఉంటే, ఈక్రింది కొన్ని ప్రత్యేమైన ఆహారాలను ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం లిస్ట్ అవుట్ చేయబడింది. మరి గర్భధారణ సమయంలో సురక్షితమైన రావెజిటేబుల్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీ గర్భధారణ సమయంలో బ్రొకోలి తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే ఇందులో అధిక శాతంలో విటమిన్స్ కలిగి ఉంటాయి.ఈ విటమిన్స్ కడుపులో పిండం పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

గర్భధారణ సమయంలో పచ్చి వేజిటేబుల్స్ తినడం సురక్షితమే. ముఖ్యంగా ఆస్పరాగస్. పచ్చిగా ఉండే ఆస్పరాగస్ తీసుకోవడం వల్ల కడుపులో పిండం యొక్క బ్రెయిర్ డెవెలప్ మెంట్ కు అవసరం అయ్యే ఫొల్లెట్ అంధిస్తుంది.

పచ్చిబఠానీ:

పచ్చిబఠానీ:

ఒక టేబుల్ స్పూన్ పచ్చిబఠానీలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫొల్లేట్ శిశువు నాడీ వ్యవస్థ ఏర్పడుటకు బాగా సహాయపడుతుంది.

ఆకు కూరలు:

ఆకు కూరలు:

గర్భిణీ స్త్రీలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా పుష్కలమైనటువంటి ఐరన్ శరీరానికి అందుతుంది. మరియు ఇందులో ఫొల్లేట్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శిశువు పెరుగుదలకు చాలా అవసరం అవుతాయి.

కాలే:

కాలే:

ఆకుకూరలాగే, కాలే కూడా మినిరల్స్ మరియు పిండం పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.

కొలార్డ్ గ్రీన్స్:

కొలార్డ్ గ్రీన్స్:

కడుపులో పెరిగే పిండంకు తగినంత క్యాల్షియం అవసరం అవుతుంది. క్యాల్షియం అత్యధికంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ రా కొల్లార్డ్ గ్రీన్స్ . గర్భధారణ సమయంలో పచ్చి కొలార్డ్ ఆకు కూరను తీసుకోవడం మంచిదే.ఇది శిశువు యొక్క బోన్ హెల్త్ కు మరియు స్కెలిటల్ మినిరలైజేషన్ ను కు చాలా మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

ఎవరికైనా సరే క్యాలీఫ్లవర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది పొట్టలో ఎక్కువ గ్యాస్ ఏర్పడుటకు కారణం అవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో తగుమోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండటం చేతా, దీన్ని గర్భిణీలు తీసుకోవడం సురక్షితమే.

బ్రసెల్స్ స్ప్రౌట్స్:

బ్రసెల్స్ స్ప్రౌట్స్:

కేవలం బ్రసెల్స్ స్ప్రౌట్స్ ను గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల, ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి పిండం పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

English summary

Safe To Eat Raw Vegetables During Pregnancy?

When a woman is pregnant, she goes through a number of cravings. There are some pregnant women who crave for raw vegetables during their pregnancy and as per old myths, it is said that raw vegetables consumed during pregnancy is not good for the foetus.
Story first published: Friday, February 21, 2014, 15:10 [IST]
Desktop Bottom Promotion