For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు విటమిన్ లు అధికంగా తీసుకుంటే కలిగే దుష్ఫలితాలు

By Super
|

మహిళ గర్భవతి గా వున్నపుడు, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా ఉండాలంటే ఆమె మంచి ఆరోగ్యకరమైన మరియు పోషకాలు అంటే విటమిన్ లు, ప్రోటీన్ లు, మినరల్స్ మొదలైనవి కల ఆహారం తీసుకోవాలి. మహిళ ఈ విటమిన్ లను అనేక ఆహారాల నుండి, పండ్లు, ధాన్యాలు, కాయలు, మొదలైన వాటి నుండి పొందగలదు. అయితే, ప్రధానంగా ఈ విటమిన్ లు ఆమె ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. గర్భవతిగా వున్నపుడు, అధిక మోతాదులో కనుక ఈ విటమిన్ లు తీసుకుంటే, అతి క్లిష్ట సమస్యలు ఏర్పడగలవు.

గర్భవతి మహిళకు ఎంత మోతాదులో విటమిన్ లు కావాలి అనే అంశం మా ఆర్టికల్ " గర్భవతి మహిళకు అవసరమైన విటమిన్ లు" అనే దానిలో పేర్కొనటం జరిగింది. మీరు కనుక విటమిన్ లను సహజ పదార్దాలైన పండ్లు, కాయ గూరలు మొదలైన వాటి నుండి తీసుకుంటే ఎట్టి సమస్య లేదు. ఎందుకంటే, మీకు, మీ గర్భానికి ఎట్టి సైడ్ ఎఫెక్ట్ లు వుండవు. కాని, మీరు కనుక విటమిన్ సప్లిమెంట్ లను అంటే విటమిన్ మాత్రలు, పౌడర్, మొదలైనవిగా తీసుకుంటే అపుడు మీరు డాక్టర్ ను సంప్రదించి తీసుకొనవలసి వుంటుంది. ఎందుకంటే, విటమిన్ లు అధికం అయితే, మీ ఆరోగ్యానికి, పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ ఆర్టికల్ లో మేము విటమిన్ లు అధిక మోతాదులో తీసుకుంటే దుష్ఫలితాలు ఎలా వుంటాయి అనేది వివరిస్తున్నాం.

విటమిన్ ఎ

విటమిన్ ఎ

విటమిన్ -ఎ అధికం అయితే పుటుక వైకల్యాలు మరియు లివర్ సమస్యలు వస్తాయి. కనుక విటమిన్ -ఎ మాత్రలు తీసుకునే ముందు ఒక గైనకాలజిస్ట్ సలహా పొందటం మంచిది.

ఫోలిక్ ఆసిడ్

ఫోలిక్ ఆసిడ్

ఫోలిక్ ఆసిడ్ అధికమైతే, కడుపులో నొప్పి, నీళ్ళ విరేచనాలు, దద్దుర్లు, నిద్ర లేమి, చికాకు, కోపం, వికారం, పొట్ట ఉబ్బరం, ప్రవర్తనా మార్పులు, చర్మంపై దద్దుర్లు, తిమ్మర్లు, గ్యాస్, ఆవేశం, ఇంకా ఇతర దుష్ఫలితాలు కలుగుతాయి. పరిశోధకుల మేరకు ఫోలిక్ ఆసిడ్ అధిక కాలం తీసుకుంటే, హార్ట్ సమస్యలు కలగటం లేదా ప్రోస్టేట్ లేదా లంగ్ కేన్సర్ రావటం జరుగుతుంది.

విటమిన్ బి 1

విటమిన్ బి 1

విటమిన్ బి 1 అధికం అయితే, చర్మంపై దద్దుర్లు, అల్లర్జి, ఆందోళన, నిద్ర లేమి, గుండె సమస్యలు, పెదాలు పాలిపోవటం, చాతీ నొప్పి, ఆయాసం, దగ్గు తో రక్తం పడటం లేదా వాంతి వంటివి కలుగుతాయి. ఈ విటమిన్ అధికం అయితే, గుండె, మరియు బ్రెయిన్ లకు కూడా దుష్ఫలితాలు కలుగుతాయి. విటమిన్ బి 1 ఎక్కువ కాలం తీసుకుంటే, బి.పి . గుండె సమస్యలు వస్తాయి.

విటమిన్ బి - 6

విటమిన్ బి - 6

విటమిన్ బి - 6 కనుక అధిక మోతాదు అయితే, శరీరం తిమ్మిర్లు, బిగుసుకు పోవటం, నరాలు చిట్లటం జరుగుతుంది. ఎండకు భరించలేరు. గుండె మంట, నొప్పి, చర్మంపై దద్దుర్లు, వాంతి వికారం వంటి సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి.

విటమిన్ బి 12

విటమిన్ బి 12

విటమిన్ బి 12 దీర్ఘ కాలంలో ఓవర్ డోస్ వాడితే కేన్సర్ వచ్చే అవకాశం వుంది. విటమిన్ బి 12 కణాల విభజన అధికం చేస్తుంది. దీనికి కేన్సర్ కణాలకు, మంచి కణాలకు తేడా తెలియదు. కనుక కేన్సర్ కణాలను కూడా వేగంగా అధికం చేస్తుంది. శరీర వివిధ భాగాలలో దురదలు, గుండె సరిగా పనిచేయక పోవటం, కళ్ళు తిరగటం, తరచుగా తల నొప్పి రావటం వంటివి సాధారణంగా ఏర్పడతాయి. గర్భవతికి రక్త హీనత వుంటే, లుకేమియా అనే వ్యాధిని కూడా కలిగిస్తుంది. కనుక విటమిన్ బి 12 కొరకు తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి. జాతీయ ఆరోగ్య సంస్థ మేరకు లేబర్ వ్యాధి కలవారు విటమిన్ బి 12 తీసుకొనరాదు. అది వారికి కంటి చూపు నష్ట పరుస్తుంది. పాంక్రియాస్ కేన్సర్ కూడా వచ్చే అవకాశాలు వుంటాయి.

విటమిన్ సి

విటమిన్ సి

రీసెర్చ్ మేరకు విటమిన్ సి అధికం అయితే, కిడ్నీ రాళ్ళను ఏర్పరుస్తుంది. విటమిన్ సి అధికం అయితే అది శరీరంలో పలుకులు గా గట్టిపడి, తర్వాత కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ పలుకులు మరింత పెద్దవి అయి గట్టిపడి రాళ్ళు గా మారితే అవి మూత్ర పిండాలలో రాళ్ళు గా మారతాయి.

విటమిన్ డి

విటమిన్ డి

విటమిన్ డి అధికం అయితే, అది మీ రక్తంలో కాల్షియం స్థాయి పెంచి ఆకలి తగ్గటం, వికారం, వాంతులు కలిగిస్తూ హైపర్ కాల్సేమియా అనే వ్యాధి కలిగిస్తుంది. కాల్షియం అధికం అయితే గుండె జబ్బులు కూడా వస్తాయి. బలహీనత, తరచుగా మూత్రం పోయటం, కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. దీర్ఘ కాలం విటమిన్ డి తీసుకుంటే కిడ్నీ లు శాశ్వతంగా నష్ట పోయే ప్రమాదం కలదు. రక్తంలో సాల్ట్ అధికం అయి మరణించే ప్రమాదం కలదు. కనుక విటమిన్ డి తీసుకునే వారు ముందుగా డాక్టర్ ను సంప్రదించాలి.

విటమిన్ -ఇ

విటమిన్ -ఇ

విటమిన్ - ఇ అధికం అయితే, గర్భవతికి కడుపులోని బిడ్డ మరణించి పుట్టటం లేదా పుట్టిన బిడ్డకు సమస్యలు రావటం జరుగుతుంది. కనుక, విటమిన్ -ఇ మాత్రలు తీసుకునే ముందు డాక్టర్ ను తప్పక సంప్రదించాలి.

English summary

side effects of vitamin overdose during pregnancy

If you are taking any Vitamin supplement like Vitamin pills, powder etc to fulfill your body need then you need to concern with doctors first because Vitamin overdose can be very harmful for pregnant woman and for her baby also. In this article we are going to describe about Side defects of Vitamin overdose.
 
 
Story first published: Thursday, February 6, 2014, 11:15 [IST]
Desktop Bottom Promotion