For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణలో చనుమొనల సంరక్షణకు చిట్కాలు

By Lakshmi Perumalla
|

గర్భధారణ సమయంలో ఒక మహిళ యొక్క శరీరంలో అనేక శారీరక మరియు మానసిక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులకు ప్రధాన కారణం మీ గర్భ సంబంధ హార్మోన్ల వ్యత్యాసాలు అని చెప్పవచ్చు. మీరు ఒక ఆరోగ్యకరముగా మరియు సంతోషంగా గర్భం కలిగి ఉండటానికి ఈ హార్మోన్ల మార్పులు తప్పనిసరి అనేది స్పష్టమైన వాస్తవం. కానీ,అదే సమయంలో మీకు మీ గర్భం సమయంలో కొన్ని ఇబ్బందులు అనుభవంలోకి వస్తాయి. దాదాపుగా ప్రతి మహిళలో వారి గర్భధారణ సమయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటిగా చనుమొనలు(నిపుల్) మృదువుగా ఉండకపోవటం అని చెప్పవచ్చు.

మీ శరీరం మీ శిశువు తల్లిపాలు కోసం సిద్ధంగా తయారవుతుంది. సంబంధిత భౌతిక మరియు హార్మోన్ల మార్పుల వలన మీ చనుమొనలలో విశేషమైన మార్పులు కనపడతాయి. చనుమొనల మార్పులలో పరిమాణం మరియు మృదువైన చనుమొనల పెరుగుదల ఉండవచ్చు. మీ డెలివరీ సమయంలో మీరు దగ్గరగా మీ చనుమొనలు మరియు స్తన పరివేషం ఆకారం మరియు పరిమాణం మారటం మరియు ప్రారంభ స్తన్యము ఒక పసుపు పదార్ధంగా చెమర్చడం గమనించవచ్చు. మీ చిన్న ఒక ఫీడ్ కొరకు మీ శరీరం సన్నాహాలు చేసుకొంటుంది.

గర్భధారణ సమయంలో చనుమొనల రక్షణ మరియు సౌకర్యవంతముగా ఉంచడం చాలా ముఖ్యం. గర్భవతిగా ఉన్న సమయంలో మీరు చనుమొనల సంరక్షణ ఎలా అని ఆలోచిస్తూ కలత చెందాల్సిన అవసరం లేదు. మీకు గర్భం సమయంలో చనుమొనల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు తెలిస్తే చాలా సహాయకారిగా ఉంటుంది. ఇక్కడ గర్భం సమయంలో చనుమొనల సంరక్షణ కోసం ప్రయత్నించటానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

Tips For Nipple Care During Pregnancy

ఒక సౌకర్యవంతమైన బ్రా ధరించాలి

గర్భధారణ సమయంలో మీ రొమ్ము పరిమాణం పెరిగినప్పుడు సరైన బ్రా ఎంచుకోవటం అనేది చనుమొనల సంరక్షణలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మృదువైన కాటన్ తో తయారుచేసిన బ్రాను ధరించటానికి ప్రయత్నించండి. తద్వారా మీ చనుమొనల నొప్పి ఉపశమనంనకు సహాయం చేస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు చనుమొనల సంరక్షణలో భాగంగా మందంగా ఉండే బ్రా ను నివారించటం మంచిది.

ఆలివ్ నూనెను ఉపయోగించండి

ఆలివ్ నూనెతో ఒక చిన్న మర్దన చేయడం అనేది గర్భధారణ సమయంలో చనుమొనల సంరక్షణ కోసం ఒక మంచి ఆలోచన. ఇది చర్మం తేమగా ఉండటానికి సహాయం చేస్తుంది. పొడి చర్మంనకు సంబంధించిన ఏటువంటి సమస్యను అయిన నివారించడానికి సహాయపడుతుంది. ఇది గర్భధారణ సమయంలో సర్వసాధారణం.

చనుమొనలకు సబ్బు ఉపయోగించకూడదు

చనుమొనలకు సబ్బు ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే చనుమొనలను పొడిగా చేస్తుంది. చనుమొనలు ఎక్కువగా పొడిగా మారి చివరికి పగుళ్ళకు దారితీయవచ్చు. సువాసనలు కలిగిన సబ్బులకు బదులుగా ఒక మంచి మాయిశ్చరైజింగ్ శుద్ది లోషన్ ఉపయోగించవచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు చనుమొనల సంరక్షణ కోసం గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన పాయింట్.

మాయిశ్చరైజింగ్ క్రీములు

మీరు మీ చనుమొనలు పొడిగా ఉన్నాయని భావిస్తే అప్పుడు ఒక మంచి మాయిశ్చరైజింగ్ శుద్ది లోషన్ మరియు క్రీములను ఉపయోగించవచ్చు. ఇది మీ చనుమొన తేమగా ఉండటానికి సహాయం చేస్తుంది. ప్రత్యేకంగా గర్భధారణ సమయంలో చనుమొనల సంరక్షణ కోసం తయారు చేసే ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చనుమొన ప్రొటెక్టర్

బాధాకరమైన చనుమొనలను వదిలించుకోవటానికి సహాయపడే చనుమొన ప్రొటెక్టర్ మార్కెట్ లో లభిస్తాయి. మీ చనుమొన మరియు మీ బట్టల మధ్య అవరోధంగా పనిచేస్తుంది. మహిళలకు గర్భం సమయంలో చనుమొనల సంరక్షణకు చనుమొన ప్రొటెక్టర్ చాలా సహాయకారిగా ఉంటాయి.

ఐస్ ప్యాడ్స్ ఉపయోగించాలి

గర్భధారణ సమయంలో మృదువైన చనుమొనలకు ఒక కష్టమైన పరిస్థితి వస్తుంది. మీ చనుమొనల విశ్రాంతి కొరకు ఒక ఐస్ ప్యాడ్ ఉపయోగించడం ఒక మంచి ఆలోచన. ఇది నొప్పి తగ్గించి హాయిగా ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో మీ చనుమొనల రక్షణలో భాగంగా దీనిని చేయండి.

రొమ్ము ప్యాడ్స్

మీ రొమ్ముల నుండి లీకేజ్ అనుభవం ఉంటే అప్పుడు మీ చనుమొనల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం ముఖ్యం. ఒక మంచి నాణ్యత గల రొమ్ము ప్యాడ్స్ ఉపయోగించాలి. మీ చనుమొనలను పొడి మరియు శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా అంటువ్యాధులు రాకుండా నివారించవచ్చు. మీరు గర్భం సమయంలో చనుమొనల సంరక్షణ తప్పనిసరిగా చేయాలనే పాయింట్ ను గుర్తుంచుకోండి.

English summary

Tips For Nipple Care During Pregnancy

Pregnancy is a time when a woman’s body passes through various physical and emotional changes. The main reason for these changes is the hormonal variations associated with your pregnancy.
Story first published: Friday, January 10, 2014, 17:50 [IST]
Desktop Bottom Promotion