For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు చలికాలంలో ఎలా ఉండాలి? రక్షణ కల్పించే మార్గాలు

|

మహిళలు గర్భం పొందిన తర్వాత 9నెల కాల వ్యవధిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాతవరణంలో కూడా మార్పులు చేసుకోవడం వల్ల వాటిని ఎదుర్కోక తప్పదు. గర్భం పొందిన తర్వాత ప్రతి నెలనెలకు శరీరంలో మార్పులు జరగడం సహజం. వాతావరణానికి అనుగుణంగా మీ శారీర మార్పులు కూడా మార్చుకోవడం చాలా అవసరం.

గర్భిణీలు నివసించే ప్రదేశాలు, వాతవరణం ఒక సవాల్ గా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో గర్బిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. చాలా వరకూ ఎక్కువ మంది గర్భిణీ స్త్రీల యొక్క శరీరం అధిక వేడిని కలిగి ఉంటారు . శీతాకాలం వారి శరీరాన్ని మరియు మనస్సును చల్లబరుస్తుంది. అయితే, ఈ శీతాకాలంలో జలుబు దగ్గు వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తలనొప్పిగా మారుతాయి.

ఇవే కాదు, మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవల్సి ఉంటుంది. ఫుట్ పాత్ ల మీద, మంచి కప్పబడి ఉంటుంది. తెలియక కాలు జారితే, ప్రమాధం జరిగే అవకాం ఉంది, కాలు స్లిప్ అవ్వడం లేదా క్రింద పడటం తల్లి, బిడ్డకు సురక్షిత కాదు, కాబట్టి, శీతాకాలంలో సైడ్ వాక్స్ మరియు స్ట్రీట్ వాక్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అందువల్ల శీతాకాలంలో మీరు తీసుకోవల్సిన కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా సూచించడం జరిగినది. గర్బిణీ స్త్రీలకు సురక్షితమైన గర్భధారణ మరియు ప్రసవం జరగాలంటే, వింటర్ కేర్ చాలా అవసరం.

1. శీతాకాలానికి అనుగుణంగా దుస్తులు ధరించాలి: ముఖ్యంగా గర్భిణీ అనుసరించాల్సి మొదటి పని. ఇంట్లో ఉన్నప్పుడు కంటే బయట వెళ్ళినప్పుడు శరీరం మొత్తం కవర్ అయ్యేలా రెండు మూడు లేయర్స్ గా శరీరాన్ని వెచ్చగా కప్పి ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా పాదాలు, వేళ్ళకు రక్షణ కల్పించాలి. ముఖ్యంగా మీ అంతట మీరు సౌకర్యవంతంగా తయారవ్వడం చాలా అవసరం.

2. వాతావరణంలో తేమ లేదా వేడి: గర్భాధారణ కాలంలో, శీతాకాలంలో ఇంట్లో హుముడిటి ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరకంగా హెల్ప్ అయినా, గర్భిణీల్లో మాత్రం డ్రై వింటర్ వల్ల తడి పొడి గాలితో ముక్కులు డ్రైగా మారి ముక్కుకు నుండి రక్తస్రావం అవ్వడం జరుగుతుంది. ఇది కూడా శ్వాససంబంధిత సమస్యలకు మరియు ఆస్త్మాకు దారితీస్తుంది. కాబట్టి, శరీరంలో ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోవాలి.

3. బాడీలోషన్ : శీతాకాలంలో గర్బం పొందిన వారు తప్పక పాటించాల్సిన చిట్కా చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడు చర్మంను తేమగా ఉంచుకోవాలి. చర్మం పొడిబారి చర్మం దురదగా మరియు డ్రైగా మార్చుతుంది అలా జరగకుండా బాడీలోషన్ అప్లై చేస్తుండాలి . అందుకు సువాసనా భరితం కానీ, హైపో అలర్జిక్ కానటువంటి బాడీలోషన్ అప్లై చేయాలి

4. వ్యాధినిరోధకత పెంచుకోవాలి: శీతాకాలంలో శరీరంలో వ్యాధినిరోధకత తగ్గడం సహజం. అయితే రోగాల బారిన పడకుండా ఉండాలంటే, వ్యాధినిరోధకతను పెంచుకోవాలి . ముఖ్యంగా చాలా త్వరగా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండి, అదనపు వింటర్ కేర్ ను తీసుకోవాలి. శీతాకాలంలో జబ్బు పడకుండా ఉండాలంటే మీ చేతులను తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉన్న ఆరెంజ్ మరియు బ్రొకోలీ ఎక్కువగా తీసుకోవాలి.

Tips For Pregnant Women To Survive Winter

5. ఎక్కువగా నీళ్ళు త్రాగాలి: ఈ విషయంలో మాత్రం వాతావరణ మార్పలతో సంబంధం లేకుండా అన్ని సీజన్స్ లో నీరును ఎక్కువగా త్రాగాలి . గర్భధారణ సమయంలో గర్భిణీలకు ఎక్కువగా నీరు అవసరం అవుతుంది. గర్భిణీలు శరీరాన్ని ఎప్పుడు హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం. ఇది హైడ్రేట్ చేయడం మాత్రమే కాదు , చలికాలంలో డ్రై స్కిన్ నివారిస్తుంది, తలనొప్పిని ప్రీటర్మ్ లేబర్ ను నివారిస్తుంది.

English summary

Tips For Pregnant Women To Survive Winter

Pregnancy lasts for nine months. There is no doubt that you should be ready for the various climatic changes that you are going to face. When you are pregnant, you can be sure that your body goes through immense amount of changes. While preparing for your physiological changes, it is important to consider the climatic changes as well.
Story first published: Tuesday, November 18, 2014, 18:31 [IST]
Desktop Bottom Promotion