For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీల కొరకు టాప్ 10 విటమిన్ ఫుడ్స్

|

మహిళలలు గర్భం ధరించిన తర్వాత కడుపులో పెరిగే బిడ్డతో సహా, తల్లికి కూడా అనేక రకాల విటమిన్స్ అవసరం అవుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు విటమిన్ ఎ, డి, సి లు చాలా అవసరం. సాధారణంగా కంటే గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలకు విటమిన్ ఫుడ్స్ ఎందుకు అవసరం అంటే? ఎందుకంటే కడుపులో పెరిగి శిశువు పెరుగుదలకు, మరియు ఆరోగ్యానికి చాలా అవసర అవుతాయి.

గర్భిణీలకు అవసరం అయ్యే ఈ విటమిన్స్ కొన్ని నేచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను డాక్టర్ సలహా మేరకు రెగ్యులర్ గా ప్రతి రోజూ లేదా వీక్లీ తీసుకోవల్సి ఉంటుంది. గర్భణీస్త్రీలు తీసుకోవల్సిన 8 ఖచ్చితమైన విటమిన్స్ ఫుడ్స్ ను బోల్డ్ స్కై పట్టిక తయారు చేసి, మీకు అందిస్తోంది. గర్భిణీ స్త్రీలు, ఇటువంటి ఆహారాలు తీసుకోవడాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి . అలాగే ఇలాంటి విటిమన్ ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకొనే ముందు మీ గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. విటమిన్ మోతాదు ఎక్కవైన శిశువు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

పాలు:

పాలు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవడం, గర్భిణీకి చాలా ఆరోగ్యకరం. బాగా కాచీ, మీగడ తీసేసిన పాలను తీసుకోవాలి.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లు గర్భంలో పిండం ఏర్పాటు విటమిన్ ఎ మరియు విటమిన్ డి, పుష్కలమైన పోషకాలు చాలా అవసరం. కాబట్టి, వారంలో ఒకసారి లేదా రెండు సార్లు గుడ్డును తినడం చాలా అవసరం.

చేపలు:

చేపలు:

చేపలు(సార్డిన్స్): ఈ టేస్టీ చేపల్లో విటమిన్ డి పుష్కలం. ఉప్పగా ఉండే ఈ చేపలు(సార్డిన్స్ ) నిల్వచేసినవైతే చాలా తక్కువగా తీసుకోవాలి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

గర్భిణీ స్త్రీలు ఆకలి అనిపించినప్పుడు, ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలను తీసుకోవాలి. వీటి నుండి విటిమన్ ఎ పుష్కలంగా శరీరానికి అందుతుంది.

జామకాయ- గ్రేఫ్ ఫ్రూట్ :

జామకాయ- గ్రేఫ్ ఫ్రూట్ :

గర్భంలో శిశువు పెరుగుదలకు, ఈ పుల్లని గ్రేప్ ఫ్రూట్ చాలా బాగా సహాయడపడుతుంది. అలాగే తల్లిని కూడా ఆరోగ్యంగా మరియు యాక్టివ్ గా ఉంచతుంది. మరియు జామకాయ: బాగా పండిన జామ పండులో ‘విటమిన్ సి' పుష్కలంగా ఉంటుంది. రోజులో ఒక సారి జామకాయను తీసుకోవండి ఒక మంచి అలవాటు.

డ్రై నట్స్:

డ్రై నట్స్:

డ్రై నట్స్ లో పుష్కలమైన విటమిన్ ఇ ఉంటుంది. ఒక గుప్పెడు నట్స్ (బాదాం మరియు పిస్తా)వంటి వాటిని తప్పని సరిగా తినాలి. ఈ నట్స్ బేబీకి ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

విటమిన్ కె ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది. గర్భాధారణ సమయంలో విటమిన్ కె పొందడానికి, ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం.

బీన్స్:

బీన్స్:

ఎండిన బీన్స్ కూడా ఒక మంచి ఆహారపదార్థం. కానీ ఎక్కువగా తినకూడదు. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ఎ, సి, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అనేక సూక్ష్మ పోషకాలను అందించి, ఆయా వ్యాధుల బారి నుండి కాపాడి ఆరోగ్యవంతులుగా చేసాయి.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

గొదమనూక, సెరల్స్, పొట్టుబియ్యం, బ్రెడ్తో తయారయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫైబర్, విటమిన్-, ఫొలిక్ యాసిడ్ లభిస్తుంది. గర్భం దాల్చిన 3 నెలల వరకు ఈ ఫోలిక్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది శిశువుకి పుట్టుకతో వచ్చే లోపాలను రాకుండా నిరోధిస్తుంది.

బాదం:

బాదం:

బాదంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది. బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది. ఇక పనీర్‌లో పుష్కలమైన క్యాల్షియం ఉంటుందంటారు. ఇది శిశువు ఎముకలకు మరియు పెరుగుదలకు బాగా సహాయపడుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

English summary

Top 10 Vitamin Foods for Pregnant Women

During the nine months of pregnancy, it is essential for an expectant mother to get the proper nutrition for the health of her baby. But with morning sickness, pregnancy cravings and food aversions, eating right can be tough. On top of that, many women don't know what to eat. Here is a list of some of the foods that are beneficial to pregnancy, in no particular order.
Story first published: Wednesday, April 9, 2014, 17:37 [IST]
Desktop Bottom Promotion