For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకొనట్ వాటర్ తో గర్భిణీలకు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

గర్భిణీలకు కొబ్బరిబోండాంతో అద్భుత లాభాలు

|

పచ్చికొబ్బరి సాధారణ వ్యక్తులకు మాత్రమేకాదు, గర్భిణీలకు కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు?అవును, ఎందుకంటే పచ్చికొబ్బరిలో పొటాసియం మరియు ఎలాక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్స్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. తాజా పరిశోధనల ప్రకారం ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నూనెను ఏవిధంగా తీసుకొన్న ఆరోగ్యానికి చాలా లాభం. ముఖ్యంగా ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు కంట్రోల్ చేయడానికి, హార్మోన్ ఉత్పత్తికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొబ్బరి బోండాలోని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

10 Benefits Of Coconut Water During Pregnancy

ఫ్రెష్ కొబ్బరి మాత్రమే కాదు, తాజా కోకనట్ వాటర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు తగిన మోతాదులో లేదా పరిమాణంలో కొబ్బరి నీరు తీసుకోవల్సి ఉంటుంది . ముఖ్యంగా తాజా కొబ్బరినీరు ఆరోగ్యనానికి ఎక్కువ లాభాలను అందిస్తుంది. మరీ ముఖ్యంగా కొబ్బరి బోండాం కట్ చేసిన వెంటనే నీరు త్రాగితే అందులో ఉండే తాజా ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అప్పుడే కోకనట్ వాటర్ యొక్క రుచికి కూడా బాగుటుంది. కొబ్బరి నీళ్ళు త్రాగడం మాత్రమే కాదు, ప్రత్యామ్నాయంగా లేలేతగా ఉండే కొబ్బరిని కూడా తినవచ్చు.

కొబ్బరిలో ఉండే షుగర్ కంటెంట్ హెల్తీ లెవల్స్. మరో న్యూట్రీషియన్ విటమిన్ సి, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం మరియు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే గర్భణి స్త్రీల విషయానికి వస్తే, కొబ్బరి యొక్క ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే, ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే. గమనిక: ఆహారపరంగా గర్బిణీలు ఏ ఆహారం తీసుకోవాలన్నా, తీసుకొనే ముందు డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం...

గర్బిణీలకు తాజా కొబ్బరితో 10 ప్రయోజనాలు:

1. వ్యాధినిరోధకత:

1. వ్యాధినిరోధకత:

తాజా కొబ్బరి వ్యాధినిరోధకతను పెంచుతుంది. అందువల్ల, గర్భిణీలు కోకనట్ వాటర్ ను వారానికి రెండు సార్లు తీసుకోవాలి. డాక్టర్ సలహాతో రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు.

2. మలబద్దకం నివారిస్తుంది:

2. మలబద్దకం నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో గర్భిణీలను ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య మలబద్దకం. ఈ సమస్య ఉన్నవారు, రెగ్యులర్ గా కోకనట్ వాటర్ త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది మరియు గర్భిణీల్లో హార్ట్ బర్న్ నివారిస్తుంది .

3. చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

3. చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

కొబ్బరి నీళ్ళలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కోకొనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది.

4. జీర్ణక్రియకు:

4. జీర్ణక్రియకు:

కొబ్బరి బోండాంలోని నీళ్ళు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిచుకోవాలనుకొనే వారు కోకనట్ వాటర్ ను తీసుకోవాలి.

5. ఎనర్జీ ఇస్తుంది:

5. ఎనర్జీ ఇస్తుంది:

గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు.

6. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది:

6. డీహైడ్రేషన్ ను నివారిస్తుంది:

గర్భిణీల్లో డీహైడ్రేషన్ ను నివారించుకోడానికి ఒక ఉత్తమ మార్గం తరచూ కోకోనట్ వాటర్ త్రాగుతుండాలి.

7. బ్రెస్ట్ మిల్క్:

7. బ్రెస్ట్ మిల్క్:

కోకనట్ వాటర్ లో ఉండే కొన్నిముఖ్య అంశాలు గర్భిణీలో పాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది . బెస్ట్ మిల్క్ బేబీకి చాలా ఆరోగ్యకరం.

8. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్:

8. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్:

ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణలు లేవు. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే గుణాలు కోకోనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.

9. అలసటను తగ్గిస్తుంది:

9. అలసటను తగ్గిస్తుంది:

కొబ్బరి నీళ్ళు అలసటను తగ్గిస్తుంది? చాలా సాధారణంగా అలసటకు గురి అవుతుంటారు . అలాంటి వారు రెగ్యులర్ గా కొబ్బరి నీళ్ళు త్రాగుతుండాలి.

10. మార్నింగ్ సిక్ నెస్:

10. మార్నింగ్ సిక్ నెస్:

కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

English summary

10 Benefits Of Coconut Water During Pregnancy

Benefits Of Coconut Water During Pregnancy:Are you wondering about the benefits of coconut during pregnancy? Well, coconuts are rich in potassium and high in electrolytes. It also contains vitamins, calcium and magnesium too.
Desktop Bottom Promotion