For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం పొందడానికి ముందు దంపతులు చేయాల్సిన 10 పనులు

By Super
|

అన్ని జంటలూ పిల్లల్ని ఎంతో ఇష్టపడతారు. శిశువు కుటుంబంలో ప్రేమకు చిహ్నం. మీరు బిడ్డను కనాలి అనుకుంటే, మీరు, ఒక జంటగా గర్భం ముందు చేయాల్సిన కొన్ని పనులను నిర్ధారించుకోండి. ఎక్కువగా, పురుషులు గర్భానికి సంబంధించిన పుస్తకాలు, చిట్కాల గురించి ఆశక్తి చూపారు. వారికి పిల్లలు కావాలని ఆశక్తి ఉంటుంది కానీ గర్భానికి ముందు స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆవశ్యకత గురించి ఆలోచించరు.

సరే, ఇక్కడ గర్భం ముందు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి...అందులో మొట్టమొదట, ప్రధానమైనది కొన్ని ఇబ్బందులకు గురౌతారనే విషయాన్నీ మిమ్మల్ని మీరే మానసికంగా తయారుచేసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన గర్భం, ఆరోగ్యకరమైన బిడ్డను కనాలంటే, గర్భధారణకు మార్గాన్ని తయారుచేసుకోవడానికి గర్భానికి ముందే మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.

జంటలు గర్భం ముందు చేయాల్సిన ముఖ్యమైన పని రహస్యాలను దాచకుండా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు భౌతికంగా, మానసికంగా, ఆర్ధికంగా స్థిరంగా ఉంచడానికి చేయాల్సిన చాలా ముఖ్యమైన విషయం. పిల్లడు పుట్టిన తరువాత మాత్రమే ఖర్చులు ఎక్కువగా ఉంటాయని మీరు ఊహిస్తారు, గర్భం సమయంలో కూడా ఖర్చు తక్కువేమీ ఉండదు. కొద్దిపాటి అదనపు జాగ్రత్తలు అద్భుతాలను సృష్టిస్తాయి. చాలామంది కొత్త జంటలు గర్భం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోరు. ఇక్కడ గర్భానికి ముందు తీసుకోవాల్సిన 10 మంచి విషయాలు, కొన్ని విలువైన చిట్కాలు ఇవ్వబడ్డాయి.

గర్భధారణ ముందు వైద్యుడిని సంప్రదించాలి:

గర్భధారణ ముందు వైద్యుడిని సంప్రదించాలి:

జంటలు పిల్లలు కలగడానికి ముందు పూర్తిగా శారీరక పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమైన పని. దీనివల్ల ఏవైనా సంతానోత్పత్తి లేదా వ్యాధులు ఉన్నాయా అని తెలుసుకుని, వాటిని ప్రాధమిక దశలోనే అడ్డుకోవచ్చు.

గర్భ నిరోధక మాత్రలు వాడరాదు:

గర్భ నిరోధక మాత్రలు వాడరాదు:

జంటలు తెలుసుకోవాల్సిన మరో ప్రధాన విషయం గర్భానికి కనీసం 2 నెలల ముందే గర్భనిరోధక మాత్రలు మానేయాలి. అప్పుడు మాత్రమే, మీరు మీ సాధారణ నెలసరి సైకిల్ ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలం గర్భనిరోధక మాత్రలు వేసుకొని ఉంటే, ఇంతకు ముందుతో పోలిస్తే, మీ నెలసరి సైకిల్ లో మార్పులు వస్తాయి. ఈ మందులు వాడడం ఆపాక మీ హార్మోన్ స్థాయిలు సాధారణ పరిస్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది. సూక్ష్మాన్ని గ్రహించండి.

ఫోలిక్ యాసిడ్ వాడడం ప్రారంభించండి:

ఫోలిక్ యాసిడ్ వాడడం ప్రారంభించండి:

ఇది పిల్లలు పుట్టడానికి ముందు జంటలు చేయవలసిన మరో ముఖ్యమైన విషయం. మరో 3 నుండి 6 నెలలలో గర్భందాల్చాలి అనుకునే స్త్రీలు ఫోలిక్ యాసిడ్ అనే మల్టీవిటమిన్ ని ప్రతిరోజూ తీసుకోవడం మొదలుపెట్టండి.

బండిమీద ప్రయాణాలు మానండి:

బండిమీద ప్రయాణాలు మానండి:

గర్భవతి కావాలని అనుకునే మహిళ బండి మీద ప్రయాణం చాలా ప్రమాదకరమైనది, దీనిని మానుకోవాలని సూచన.

ఆరోగ్యకర ఆహరం:

ఆరోగ్యకర ఆహరం:

మీరు ప్రతిరోజూ మీ రెఫ్రిజిరేటర్ లో తాజా పండ్లు, కూరగాయలు, గింజల తో నింపి ఉంచాలని నిర్ధారించుకోండి.

ధూమపానం, మద్యపానం పట్ల జాగ్రత్త వహించండి:

ధూమపానం, మద్యపానం పట్ల జాగ్రత్త వహించండి:

ధూమపానం, మద్యపానం ఆరోగ్యాన్ని పడుచేస్తాయి, వీటిని గర్భానికి ముందు మానివేయడం మంచిదని సూచన.

ఆరోగ్యకర బరువు ఉండడం ఒక లక్ష్యం:

ఆరోగ్యకర బరువు ఉండడం ఒక లక్ష్యం:

మీరు శిశువును మోయడానికి సరిపడినంత ఆరోగ్యకరమైన బరువు ఉండేట్లు చూసుకోవాలి. ఇది గర్భం ముందు మీరు చేయవలసిన ప్రధానమైన పనులలో ఒకటి.

కాఫీ తాగడం తగ్గించండి:

కాఫీ తాగడం తగ్గించండి:

ఎక్కువగా కెఫీన్ వాడకం వల్ల గర్భస్రావం ఏర్పడగలదు, గర్భం తరువాత తీసుకోవచ్చు. అందువల్ల మీరు శిశువుకు జన్మనిచ్చే ముందు చేయవలసిన మరో పని.

వ్యాయామ కార్యక్రమాలను అనుసరించండి, ప్రమాదాలకు దూరంగా ఉండండి:

వ్యాయామ కార్యక్రమాలను అనుసరించండి, ప్రమాదాలకు దూరంగా ఉండండి:

ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా మంచి పద్ధతి, డ్రై క్లీనింగ్, ఆటో షాపులలో తరచుగా కనిపించే రసాయనాలకు, ఎరువులకు దూరంగా ఉండండి. వీటివల్ల గర్భధారణ కష్టమౌతుంది.

డబ్బును సరిగా నిర్వహించండి:

డబ్బును సరిగా నిర్వహించండి:

మీ డబ్బును గర్భానికి ముందు, తరువాత కావలసిన అత్యవసర ఖర్చులకోసం ఆదా చేయండి.

English summary

10 Things Couples Must Do Before Pregnancy

All couples are fond of having babies. A baby is the symbol of love in the family. If you have planned to have a baby, you, as a couple should make sure that you few things to do before pregnancy. Mostly, men do not pour into pregnancy related books and tips.
Story first published: Friday, February 27, 2015, 17:32 [IST]
Desktop Bottom Promotion