For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా ఉద్యోగి గర్భం పొందితే తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

ప్రస్తుత కాలంలో జీవన ప్రమాణాలు పెరగడతం సిటీల్లో బ్రతకడం కష్టమైపోతోంది. ఇద్దరున్న ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి సంపాదన చేస్తే తప్ప జీవితంలో సుఖంగా గడపలేకపోతున్నారు. అటు వంటి సమయంలో స్త్రీ తప్పని సరి పరిస్థితులల్లో ఉద్యోగాలకు వెళ్ళాల్సి వస్తోంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు, గర్భం ధరించడం అంటే ఆ క్షణాలు వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె జీవితంలో అనేక మార్పులు సంతరించుకుంటాయి. ఈ రోజుల్లో గర్భం అనే తేలికగాతీసుకొంటున్నారు.

ఎందుకంటే గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే వారు క్రితంలో. అయితే ఇప్పుడు అవేం పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన రోజు నుండినే వారి వారి పనులకు హాజరవుతుంటారు. కొంతమంది ప్రసవం అయ్యేంత వరకూ కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే అటువంటి సమయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అందుకు తగినటువంటి కొన్ని సూచనలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ముందే సమాచారం ఇవ్వండి

ముందే సమాచారం ఇవ్వండి

మీరు గర్భం దాల్చిన తరువాత ఉద్యోగం మానాలి అనుకుంటే ఈ విషయాన్నీ ముందుగానే మీపై అధికారికి తెలియ జేయటం చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. దీని వలన వారు ముందు జాగ్రత్తలు తీసుకొని మీ స్థానంలో ఇతరులను బదిలీ చేసి మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేస్తారు.

మంచి ఆహరాన్ని ఎంచుకోండి

మంచి ఆహరాన్ని ఎంచుకోండి

మీరు సాధారణంగా తినే సమయంలో మాత్రమె ఇపుడు కూడా తినకూడదు. ఈ సమయంలో మీకు శక్తి చాలా అవసరం కావున శక్తి స్థాయిలను పెంచే ఆహరాలను ఎంచుకోండి, ఈ ఎంచుకునే ఆహరం కూడా మీ ఆరోగ్యానికి మరియు మీ శిశువుకి హాని కలిగించేదిగా ఉండకూడదు. ఒత్తిడిలను అధికం చేసే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్'లను అధికం చేయండి.

సౌకర్యవంతమైన దుస్తువులను ధరించండి

సౌకర్యవంతమైన దుస్తువులను ధరించండి

సౌకర్యవంతమైన దుస్తువులను ధరించటం మొదటగా తీసుకోవలసిన జాగ్రత్త. మీరు ధరించే దుస్తువులు మీ పిండం పైన ఎలాంటి ఒత్తిడిని కలిగించకూడదు. అంతేకాకుండా, వదులుగా ఉండే దుస్తువులను ధరించటం వలన శ్వాస కూడా సౌకర్యంగా తీసుకోవచ్చు మరియు ఎలాంటి శ్వాస సంభందిత ఇబ్బందులు కూడా కలుగవు. సౌకర్యవంతంగా ఉండటం వలన ఒత్తిడికి కూడా దూరంగా ఉండవచ్చు.

మీరు కూర్చునే స్థలాన్ని అనుగుణంగా ఉంచుకోండి

మీరు కూర్చునే స్థలాన్ని అనుగుణంగా ఉంచుకోండి

ఆఫీసులో మీరు కూర్చునే స్థలంలో అసౌకర్యంగా ఫీల్ అయితే, ఇక నుండి అలకూర్చొవలసిన అవసరం లేదు. మీకు సౌలభ్యంగా, సౌకర్యవంతంగా ఉండేలా కూర్చోండి. వెన్నెముక మరియు మెడకు సౌకర్యవంతంగా ఉండేలా దిండును పెట్టుకోండి. గర్భంతో ఉన్నారు కావున మీరు కూర్చొనే సీటు చాలా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

సెలవు అవసరం అయినపుడు తీసుకోండి

సెలవు అవసరం అయినపుడు తీసుకోండి

గర్భంతో ఉన్నపుడు, సాధారణ సమయంలో చేసిన విధంగా పని చేయవలసిన అవసరం లేదు. ఆరోగ్యంపరంగా సమస్యగా భావించిన లేదా ఏవైనా పరీక్షలు నిర్వహించుకోవలసి వచ్చిన సెలవు తీసుకోవటంలో తప్పేమీ లేదు. అంతేకాకుండా పై అధికారిని మీరు ఇబ్బంది పడే పనులను ఇవ్వకండి అని చెప్పండి.

ఆరోగ్యకరమైన స్నాక్స్ వలన వాంతులకు దూరంగా ఉండండి

ఆరోగ్యకరమైన స్నాక్స్ వలన వాంతులకు దూరంగా ఉండండి

మీరు పని చేసే సమయంలో వాంతులు వంటివి కలగటం వలన మీరు చాలా ఇబ్బందులకు గురి అవుతుంటారు వీటి వలన నిర్వహించే పని పైన కూడా ఆసక్తి చూపించలేరు. కావున ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉండే సలాడ్, పండ్లు వంటి వాటిని తినండి. మీ శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవటం వలన వాంతులు కలిగే అవకాశం ఉండదు.

మీ హక్కులను తెలుసుకోండి

మీ హక్కులను తెలుసుకోండి

ప్రతి కంపెనీలో స్త్రీల కోసం గర్భంతో ఉన్నందుకు కొన్ని సెలవులను ఇస్తుంటారు. ఇలాంటి వాటి పైన తప్పకుండా మీరు అవగాహన కలిగి ఉండాలి. కావున మీకు కావలసిన ప్రసూతి సెలవులను వైద్యులు దృవీకరించిన పత్రంను మీ పై అధికారికి అందించి మీరు సెలవు తీసుకోవచ్చు. వీటి గురించిన సమాచారం కోసం ముందుగానే ప్రసూతి సెలవులను తీసుకున్న మీ సహా ఉద్యోగిని అడిగి తెలుసుకోండి.

కంపెనీకి మీ ప్రాముఖ్యత తెలుస్తుంది

కంపెనీకి మీ ప్రాముఖ్యత తెలుస్తుంది

కంపెనీ నియమ నిబందనల ప్రకారం మీకు ఇవ్వవలసిన సెలవులను మంజూరు చేస్తారు. కానీ మీరు లేని లోటును భర్తీ చేయుటకు కావల్సిన వ్యక్తిని వెతుకుటలో కంపెనీ యాజమాన్యం చాలా కష్టపడతారు. ఆ సమయంలో మీ ప్రాముఖ్యత గురించి కంపెనీ యాజమాన్యం మరియు మీ పై అధికారికి తెలిసి వస్తుంది. కానీ ప్రసవం తరువాత చాలా మంది స్త్రీలు తిరిగి ఉద్యోగంలో చేరరు.

మెట్లు ఎక్కకూడదు

మెట్లు ఎక్కకూడదు

సాధారణ సమయంలో మెట్లను ఎక్కినా పర్వాలేదు, బరువు తగ్గడానికి బాగా సహరిస్తుంది. అయితే గర్భందాల్చిన సమయంలో మెట్లను ఎక్కకుండా లిప్ట్ వాడకోవడం ఉత్తమమైన పని. మెట్లు ఎక్కడం వల్ల అలసిపోవడమో లేదా మరేదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మెట్ల ఎక్కకుండా అవాయిడ్ చేయండి. డాక్టర్ సలహా ప్రకారం తప్పనిసరిగా మెట్లను ఎక్కకపోవడమే మంచిది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో మెట్లను ఎక్కాల్సి వస్తే చేతులలో మరే ఇతర బరువులు లేకుండా జాగ్రత్తపడాలి. మెట్ల ఎక్కేటప్పుడు సపోర్ట్ గా హ్యాండీల్స్ పట్టుకొని నెమ్మదిగా ఎక్కాలి. గర్భిణీ స్త్రీలు ఫ్లాట్ గా ఉన్న స్లిప్పర్స్ ను ధరించడం వల్ల స్లిప్ అవ్వకుండా, సౌరకర్యంగాను ఉంటాయి.

కాఫీ మరియు సిగరెట్

కాఫీ మరియు సిగరెట్

కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.

English summary

10 Tips for Pregnant Working Women

Getting pregnant is the most cherished moment in a woman's life. The life of a woman changes after she gets pregnant. These days working women do not quit their job or take maternity leave until the third trimester is about to end. 
Story first published: Tuesday, January 13, 2015, 14:42 [IST]
Desktop Bottom Promotion