For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల చర్మ సమస్యలను నివారించే వంటింటి చిట్కాలు

|

సాధారణంగా గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు డార్క్ సర్కిల్స్ మరియు పగిలిన పెదాలు కలిగి ఉండటం సహజం . అదే విధంగా గర్భధారణ సమయంలో మరొకన్ని చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. ప్రసవం తర్వాత వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. గర్భధారణ కాలంలో వచ్చే సిన్క్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలలో శరీరం మీద కొన్ని ప్రదేశాల్లో చర్మం నల్లగా మారడాన్ని చోలస్మా (లేదా మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)అంటారు. ఈ సమస్య గర్భిణీల్లో చాలా సహజం. చాలా వరకూ ఇలాంటి చర్మ సమస్యలనే ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది కాబట్టి, మీ కుటుంబ చరిత్ర గురించి ఆరాతీసి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక మరో విషయం గర్భధారణ సమయంలో గర్భిణీలు ఎలాంటీ బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోకూడదు. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించడానికి ఇంటి చిట్కాలే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. గర్భధారణ సమయంలో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

1. నిమ్మరసం -పసుపు:

1. నిమ్మరసం -పసుపు:

పోస్ట్ ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించడానికి ఒక ఉత్తమ హోం రెమెడీ ఇది. ఒక బౌల్లో ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడు పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. బాదం-కుంకుమపువ్వు:

2. బాదం-కుంకుమపువ్వు:

ప్రెగ్నెన్సీ స్కిన్ పిగ్మెంటేషన్ కు బెస్ట్ హోం రెమెడీ ఇది . బాదం మిక్సీలో వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్నిస్కిన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి . ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. పెరుగు:

3. పెరుగు:

ప్రసవం తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే హోం రెమెడీస్ లో బెస్ట్ హోం రెమెడీ పెరుగు . డార్క్ స్కిన్ ప్యాచ్ లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేయాలి . 20నిముషాలు ఎండిపోయే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. బొప్పాయి ఆకలు పౌడర్:

4. బొప్పాయి ఆకలు పౌడర్:

బొప్పాయితో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. అలోవెరా కూడా జోడించవచ్చు. డ్రైరోస్ పౌడర్, పసుపు, మరియు మల్తానీ మట్టిని ఒక బౌల్లో వేయాలి. దానికి పాలు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా మిక్స్ చేసి ఎఫెక్టివ్ ఎరియాలో ప్యాక్ వేసుకోవాలి.

5. కలబంద:

5. కలబంద:

అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కలబంద. ఎందుకంటే ఇందులో పవర్ ఫుల్ ఆస్ట్రిజెంట్ కలిగి ఉంటుంది. కాబట్టి, దీన్ని ఎఫెక్టెడ్ ప్లేస్ లో అప్లై చేయాలి.

6.టమోటో అండ్ ఓట్ మీల్:

6.టమోటో అండ్ ఓట్ మీల్:

టమోటోలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . స్కిన్ ప్యాచ్ ను తేలికపరుస్తుంది . ఓట్ మీల్ ఒక మంచి ఎక్స్ ఫ్లోయేట్ ఏజెంట్ . దీనికి టమోటోచేర్చితే చర్మానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందిస్తుంది. అరచెంచా టమోటో రసం రెండు చెంచాలా ఓట్ మీల్ మరియు పెరుగు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి . ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

7. పసుపు -నేచురల్ ఆయిల్స్ :

7. పసుపు -నేచురల్ ఆయిల్స్ :

పసుపు చాలా త్వరగా హీలింగ్ పవర్ ను కలిగి ఉంటుంది . కాబట్టి, పుసుపుకు (ఆముదం, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా గ్రేప్ సీడ్ ఆయిల్)మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని స్కిన్ పిగ్మెంటేషన్ ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. రెడ్ ఆనియన్:

8. రెడ్ ఆనియన్:

ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని నేరుగా పట్టించి మర్ధన చేయాలి.

9. కీరదోసకాయ:

9. కీరదోసకాయ:

చర్మం పగుళ్ళు మరియు స్కార్స్ వంటి సమస్యలకు బెస్ట్ హోం రెమెడీ . ఇది స్కిన్ టాన్ మరియు పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . కీరదోసకాయ రసాన్ని ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి.

10. టండర్ కోకనట్:

10. టండర్ కోకనట్:

ఎలాంటి స్కిన్ పిగ్మెంటేషన్ అయినా నివారించే మ్యాజికల్ పవర్ టండర్ కోకనట్ లో పుష్కలంగా ఉంది. కాటన్ బాల్స్ తో స్కిన్ ప్యాచ్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

11. పాలు -తేనె:

11. పాలు -తేనె:

మీ అలసిన చర్మంను ఫ్రెష్ గా మార్చుకోవాలంటే పాలు మరియు తేనె మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి ఇది చాలా త్వరగా ఫలితాన్ని అందిస్తుంది . మరియు స్కిన్ పిగ్మెంటేషన్ ను చాలా త్వరగా తగ్గిస్తుంది.

12. సాండిల్ ఉడ్ పౌడర్ -కీరదోసకాయ:

12. సాండిల్ ఉడ్ పౌడర్ -కీరదోసకాయ:

గందంలో హీలింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, స్కిన్ ప్రొబ్లమ్స్ తొలగిపోతాయి. గందం పొడిని టమోటో లేదా కీరదోసకాయ జ్యూస్ తో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల స్కిన్ డిస్ కలర్ ను తగ్గిస్తుంది.

13. తేనె మరియు బాదం:

13. తేనె మరియు బాదం:

తాజాగా పౌడర్ చేసి బాదం పొడిలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా జోడించి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి, ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

14. ఎగ్ వైట్ :

14. ఎగ్ వైట్ :

ఇది కమిలిన చర్మంను నివారిస్తుంది. ఒక ఎగ్ వైట్ లో పుదీనా ఆకులు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక చెంచె కీరదోసకాయ గుజ్జు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మాస్క్ లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

15. ఆరెంజ్ పీల్:

15. ఆరెంజ్ పీల్:

ముందుగా ఎండిన ఆరెంజ్ తొక్క పౌడర్ ను చల్లటి పాలలో వేసి, తర్వాత దానికి తేనె మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ మరియు ప్యాచ్ లను తొలగిస్తుంది.

16. వాటర్ మెలోన్:

16. వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్ వాటర్ ను లేదా పుచ్చకాయ గుజ్జును ముఖానికి రోజులో మూడు నాలుగు సార్లు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ మరియు మొటిమలు నివారించబడుతాయి .

17. అవొకాడో:

17. అవొకాడో:

అవొకాడో గుజ్జును ప్యాక్ లో వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ నివారించవచ్చు మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది.

18. బంగాళదుంప:

18. బంగాళదుంప:

బంగాళదుంప రసం కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు రెగ్యులర్ గా దీన్ని ఉపయోగిస్తుంటే, స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిపోతుంది.

19. జామ మరియు అరటి:

19. జామ మరియు అరటి:

జామ మరియు అరటి రెండు కలిపి మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు పండ్ల మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

20. వైట్ వెనిగర్:

20. వైట్ వెనిగర్:

వెనిగర్ కూడా స్కిన్ పిగ్మెంటేషన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . చుర్మ యొక్క డిస్కలర్ ను తొలగిస్తుంది . చర్మం చాలా బ్రూట్ గా మరియు క్లియర్ గా మార్చుతుంది.

English summary

20 Home Remedies To Get Rid Of Pregnancy Skin Pigmentation

During pregnancy it is very common to have dark circles and chapped lips. However on the brighter side, these pregnancy- induced skin problems are never enduring and will resolve within a couple of months after delivery.
Story first published: Wednesday, February 18, 2015, 18:06 [IST]
Desktop Bottom Promotion