For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ వేడుకను సరదాగా జరుపుకునే 6 కుటుంబ ఆచారాలు

By Super
|

గర్భధారణ చాలామంది మహిళలకు నిజమైన ఒక కల. ఇది ఒక ఆడపిల్ల నిజంగా స్త్రీ అయ్యే సరైన సమయం. ఇది మీకే కాకుండా మీ కుటుంబం మొత్తం వేడుక జరుపుకునే సమయం. స్త్రీలు ఈ అందమైన ప్రయాణంలో ఎన్నో సంప్రదాయాలతో తల్లి అవుతారు. ఈ క్రతువులు కేవలం సంప్రదాయం కోసమే కాదు, తల్లి కాబోయే ఆమెకు ప్రేమను, తోడ్పాటును చూపించుకొనే ఒక మార్గం కూడా. శిశువు రాకకోసం ప్రపంచం మొత్తంలోని కుటుంబాలు ఈ వేడుకను ఎలా జరుపుకుంటాయో చూద్దాం.

6 Fun Family Rituals To Celebrate Pregnancy: Pregnancy Tips in Telugu

భారతదేశంలో:
భారతీయ సంప్రదాయాలు జీవితంలోని అన్ని దశలను గుర్తిస్తాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కాదు, భారతీయ స్త్రీలు రాబోయే పిల్లల పుట్టినరోజును జరుపుకోవడానికి విస్తృతమైన పూజలను నిర్వహిస్తారు. భారతదేశం చాలా విశాలమైనది. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో గర్భధారణను వివిధ రకాలుగా జరుపుకుంటారు: ఉత్తర భారతదేశంలో ఈ క్రతువును ‘గోద్ భరి’ అంటారు. ఈ వేడుక సరదా ఆటలు, అద్భుతమైన ఆహరం, పుష్కలమైన బహుమతులతో కూడుకొని ఉంటుంది.

మహారాష్ట్రలో, గర్భధారణ వేడుకను దోహల్జీవాన్ గా పిలుస్తారు.
వెస్ట్ బెంగాల్ లో, శిశువు పుట్టుకను షాద్ అనే పేరుతో పిలుస్తారు. ‘షాద్’ అంటే ‘ఇష్టం’, ‘కోరిక’. అందువల్ల, ఈ క్రతువులో అన్ని పదార్ధాలు గర్భం దాల్చిన స్త్రీకి ఇష్టమైన పదార్ధాలను తయరుచేస్తారు.

దక్షిణ భారతదేశంలో, ఈ వేడుక సీమంతం, పులికుడి లేదా వలైకాపు అనే పేర్లతో విసదీకరించబడింది. ఈ వేడుకను 5, 7, లేదా 9 మాసాలలో జరుపుకుంటారు. ఈ శిశువు సంప్రదాయాలలో, గర్భిణీ స్త్రీ సాంప్రదాయ దుస్తులు ధరించడం, బోలెడన్ని బహుమతులతో నిండిపోతుంది. ఈ వేడుకకు గుర్తుగా స్త్రీ గాజులను ధరిస్తుంది. కుటుంబీకులు, స్నేహితులు వచ్చి గర్భిణి స్త్రీని ఆరోగ్యవంతమైన శిశువు జన్మించాలని ఆశీర్వదిస్తారు.


చైనా:
చైనాలో, గర్భిణీ స్త్రీ, ఆమె కుటుంబీకులు చైనీయుల దేవతైన బోధిసత్వ గ్యాన్ యాన్ (దయామయురాలు), జిన్ హువా ఫు రెం (లేడీ గోల్డెన్ ఫ్లవర్) ని ప్రార్ధిస్తారు. ఈ ప్రార్ధనలు శిశువు, తల్లి ఇద్దరి రక్షణకు చేస్తారు.


బ్రెజిల్:
‘చ దే బెబే’ (బేబీ టీ) అనేది గర్భధారణ వేడుకలో ఒక పార్టీ లాంటిది. ఇది కేవలం స్త్రీల పార్టీ మాత్రమే, ఇది గొప్ప విందుతో, బహుమతులతో గర్భిణీ స్త్రీని ముద్దుచేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఇరాన్:
సిస్మూనీ పార్టీ అనేది సాధారణంగా శిశువు జననానికి మూడు నెలల ముందు జరిగే ఒక కుటుంబ ఆచారం. గర్భిణీ స్త్రీ కుటుంబీకులు, స్నేహితులు ఇంకా పుట్టని బేబీకి బహుమతులు తెస్తారు, మంచి స్వభావంతో సరదాగా మునిగిపోతారు.


దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా వాళ్ళు గర్భిణీ స్త్రీ ఆరోనేలలో స్టోర్కే పార్టీ అని చేసుకుంటారు. బహుమతులు, నవ్వును, సరదాలు ఉండే ఈ పార్టీ కేవలం ఆడవారికి మాత్రమే.


యూరోప్, అమెరికా
దక్షిణ దేశాలలో గర్భిణీ స్త్రీని గారాబం చేయడానికి బేబీ షవర్ చాలా ప్రసిద్ది చెందింది. అతిధులు పుట్టబోయే బిడ్డకు బహుమతులు తెస్తారు, దానితోపాటి తల్లికి కుడా తెస్తారు. కుటుంబీకులు, స్నేహితులు తల్లికాబోయే వారిని ఆశ్చర్యపరచడానికి ఈ బేబీ షవర్ ని ఏర్పాటుచేస్తారు. నిజానికి, ఈ వేడుకను కొత్త శిశువుకు అవసరమైన వస్తువులు అన్నీ ఉన్నాయని నిర్ధారించడానికి చేస్తారు. ఇది ఎదురుచూసే తల్లిదండ్రులకు ఆర్ధిక భారం తగ్గించడానికి ఏర్పాటు చేసే మార్గం.


Story first published: Saturday, June 20, 2015, 15:17 [IST]
Desktop Bottom Promotion