For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసూతి సమయం లో శారీరక నియంత్రణ లో లేని 6 విషయాలు

By Super
|

పిల్లలని కనడం అంత తేలికేమీ కాదు. కావాలంటే ఏ తల్లినయినా అడిగిచూడండి. మీ చెవులు వారికి అప్పగిస్తే పిల్లలని కనడం గురించి రకరకాల కధలు చెప్తారు. ఒక్కోసారి కొన్ని కధలు మిమ్మల్ని బాగా వేదనకి కూడ గురిచేసి ఆ రోజంతా మనసు పాడయ్యేవి గా కూడా ఉంటాయి.

ప్రసవించే సమయం లో శరీరం మీద నియంత్రణ ఉండదు.ఆ సమయం లో స్త్రీలు నొప్పి తప్ప మరేమీ తెలియని ప్రపంచం లో ఉంటారు.ఈ ప్రసూతి నొప్పులకి తోడు వాంతులు లేదా రేచనమయిపోవచ్చు.ఇంకా ఆపాన వాయువుని అధికం గా విడుదల చెయ్యచ్చు.ఇవన్నీ ఎవ్వరికీ పైకి కనిపించని , ఎవ్వరూ కనీసం చూడాలనుకోని విషయాలు.

READ MORE: ప్రెగ్నెన్సీ లో ఈ 6 లక్షాణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి

వీటిని ఎలాగూ నియంత్రించుకోలేరు కాబట్టి, డాక్టర్లు ప్రసూతి గదిలోకొచ్చే ముందు స్త్రీలని టాయిలెట్ కి వెళ్ళిరమ్మంటారు.

విరేచనం:

విరేచనం:

మీ యోనీ గుండా ఓ చిన్న ప్రాణిని బయటకి తేవడమంటే మాటలు కాదు.మీ లోపలి శిశువు ని బయటకి నెట్టే క్రమం లో ప్రేగుల మీద ఒట్టిడి కలిగి ప్రసూతి బల్ల మీదే విరేచనం అయిపోవచ్చు.ప్రసవ సమయంలో ఇది సాధారణం .

బీపీ:

బీపీ:

ప్రసాఒతి సమయం లో బీపీ తరచుగా మారుతూ ఉంటుంది.కొంత మంది స్త్రీలకి బీపీ బాగా ఎక్కువ గాఉంటే, ఇంకొంతమంది నొప్పులు తట్టుకోలేకపోవడం వల్ల బీపీ బాగా పడిపోతుంది.ఏది ఏమైనా కానీ ప్రసవ సమయం లో బీపీ ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మూత్రం:

మూత్రం:

విరేచనమే కాకుండా కొంత మంది స్త్రీలు మూత్రాన్ని కూడా విసర్జిస్తారు.ప్రసవ సమయం లో జరిగే కొన్ని శారీరక నియంత్రణ లేని వాటిల్లో ఇది కూడా ఒకటి .

ఆపాన వాయువు విడుదల

ఆపాన వాయువు విడుదల

ఇంకొక భయంకరమైన విషయం తెలుసా?? ప్రసవ సమయం లో స్త్రీలు ఆపాన వాయువు ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.కొంతమంది స్త్రీలు వెన్నెముక కి మత్తు(ఎపీడ్యూరల్) ఇవ్వగానే ఆపాన వాయువువిడుదల చేస్తారు.

మాయ

మాయ

గర్భస్థ పిండాన్ని మాయ మరియు వాటర్ బ్యాగ్ అనబడే సంచీ లాంటి నిర్మాణం రక్షిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చిన వెంటనే ఈ వాటర్ బ్యాగ్ కూడా బయటకొచ్చెయ్యాలి.ఒక్కోసారి ఈ మాయ బయటకి రావడం వెంటనే జరగచ్చు లేదా దాదాపు అరగంట పైన కూడా పట్టొచ్చు.

వికారం లేదా వాంతులు

వికారం లేదా వాంతులు

ప్రసవ సమయం లో వికారానికి లోనయ్యి వాంతి చేసుకోవడం అసాధారణమేమీ కాదు.స్త్రీలకి అసౌకర్యం కలగటం వల్ల వారు తిన్నదంతా వాంతి చేసేసుకుంటారు .

English summary

Six Things That Happen To You While Giving Birth : Pregnancy Tips in Telugu

Six Things That Happen To You While Giving Birth : Pregnancy Tips in Telugu,Giving birth is no easy task, ask any mum. Lend them your ears and they will narrate stories which might even damage your entire day.
Desktop Bottom Promotion