For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం మొదటి దశలో, మొదటి వారంలో జరిగే పిండాభివృద్ధి

|

గర్భ నిర్దారణ జరిగిన తరువాత, స్త్రీలు కాలాన్ని లెక్క పెట్టడం ప్రారంభిస్తారు. గర్భం అనేది, మొదటగా అండం ఫలదీకరణ చెందిన తరువాత గర్భదశ ప్రారంభం అవుతుంది. గర్భం ధరించబోయే, స్త్రీ చాలా తెలివిగా ఉంటుంది. కావున, గర్భంలో ఉండే దశలో గురించి, ముందే తెలుసుకోవాలని పరితపిస్తుంటుంది. మీకోసం, ఇక్కడ వారం-వారం గర్భవతిలో జరిగే మార్పులు, పిండం యొక్క అభివృద్ది గురించి ఇక్కడ తెలుపబడింది.

సాధారణంగా, పూర్తి గర్భదశ 42 వారాల పాటు ఉంటుంది, కానీ 40 వారాల పాటూ మాత్రమె అని కొంత మంది నమ్ముతుంటారు. గర్భం ధరించిన మొదటి వారంలో, మీ శరీరంలో ఎలాంటి మార్పులను గమనించలేరు. మీ రోజు వారి పనులను లేదా వ్యాయామాల పరంగా, మొదటి వారం ఏ విధంగానూ ప్రభావిత పరచదు.

Baby's Development in Pregnancy Week 1

మొదటి వారంలో శరీరంలో కలిగే మార్పులు

గర్భ దశలో, మొదటి వారంలో, భౌతిక పరంగా ఎలాంటి మార్పులు కనపడవు కానీ, మనం గుర్తించలేని మార్పులు మాత్రం కలుగుతాయి. ముఖ్యంగా మితిమీరిన వాయువులు, తాత్కాలిక అశాంతి లేదా ఉద్రేకత, డోకులు మరియు మలబద్ధకం వంటి అనుభవాలకు గురవుతుంటారు. కాలం మీరుతున్న కొలది, అలసట కూడా పెరుగుతుంది. మానసిక కల్లోలాలు మరియు నిరాశ వంటివి సాధారణంగా కలుగుతూనే ఉంటాయి. గర్భ నిర్దారణ జరుగిన తరువాత వైద్యుడిని, ప్రశ్నలను అడగటం సంకోచించకండి.

Baby's Development in Pregnancy Week 1

మొదటి వారంలో పిండాభివృద్ధి

మొదటి వారంలో పిండంలో ఎలాంటి అభివృద్ధి జరగదు. గర్భం ధరించిన తరువాత, రెండవ వారంలో మీరు గర్భవతి అనే భావనను పొందుతారు. ఫలదీకరణ జరిగిన తరువాత, మొదటి వారంలో సాంకేతిక మార్పులు జరిగిన పిండాన్ని 'బ్లాస్టోసైట్' అంటారు. అనగా ఈ దశలో, ఫలదీకరణ చెందిన పిండం కణ విచ్చిత్తికి గురవుతుంది. ఆ తరువాత బ్లాస్టోసైట్, తరువాత అభివృద్ధి కోసం ''ప్లాసేంటా''లోకి వెళుతుంది.

Baby's Development in Pregnancy Week 1

మొదటి వారం గర్భవతులకు సూచనలు

తల్లికాబోతున్నారని తెలిసి భయందోలనలకు గురవకండి. ఇంకా 42 వారాలు మిగిలి ఉన్నాయి. మీకు వచ్చే సందేహాలు, ఆందోళనల గురించి వైద్యుడిని లేదా మీ ఆరోగ్య నిపుణులు అడిగి తెలుసుకోండి. మీ భయాందోళనలను మరియు సందేహాలను వారు తీరుస్తారు.

Baby's Development in Pregnancy Week 1

మీ జీవితంలో, మధుర క్షణాలను, భావాలను ముఖ్య వ్యక్తిగా భావించే వారితో చెప్పండి. ఇలా చేయటం వలన శిశువు గురించిన ఆలోచనలు గుర్తుకు రావు. అంతేకాకుండా, షేర్ చేసుకునే వ్యక్తి మానసిక స్థైర్యాన్ని అందిస్తాడు.

Baby's Development in Pregnancy Week 1

సలహాల కోసం చిన్న పిల్లల పుస్తాకాన్ని తీసుకోండి. అన్ని రకాల పుస్తకాల ఒకే విషయాలను తెలుపుతాయి. వీటిని చదవటం వలన మంచి సలహాలను పొందుతారు.
మీరు తీసుకునే ప్రతి ఆహర విషయంలో జాగ్రత్తలను తీసుకోండి, ఎందుకంటే, మీరు తినే ఆహారమే మీ శిశువుకి కూడా ఆహరం.

Baby's Development in Pregnancy Week 1

పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తినండి. ఫోలిక్ ఆసిడ్ కోసం ఎక్కువగా నారింజ రసంను తీసుకోండి.

ఆరోగ్యకరమైన గర్భం కోసం, సిగరెట్ మరియు ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి.
ఆహార ప్రణాళిక మరియు వ్యాయామాల గురించి వైద్యుడిని అడిగి తగిన తెలుసుకోండి.

Baby's Development in Pregnancy Week 1

వ్యాయామాలను అధికంగా అనుసరింకండి, తేలికపాటి వ్యాయామాలు సరిపోతాయి.

గర్భ దశ మొదటి వారంలో, గర్భం పొందామన్న ఆతురతలో, ప్రతిదీ లేదా ప్రణాలికలను అతి ఎక్కువగా తయారు చేస్తుంటాము. ప్రతి నిమిషాన్ని మరియు సమస్యను ఆనందంగా అనుభవించటం అలవాటుగా చేసుకోండి.

English summary

Baby's Development in Pregnancy Week 1

There is no development of the baby in the first week. You are considered pregnant only during the second week when conception has occurred. In the fist week of pregnancy after fertilistion the baby is technically referred to blastocyte.
Story first published: Saturday, March 7, 2015, 16:22 [IST]
Desktop Bottom Promotion