For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..

|

జామకాయ స్వీట్ ఆరోమా వాసన కలిగి మంచి టేస్ట్ ను కలిగి ఉంటుంది. అందుకు ఈ పండును అందరూ ఎక్కువగా ఇష్టపుడతారు. ముఖ్యంగా గర్భినీ మహిళలు మరింత ఎక్కవుగా ఇష్టపడుతారు . ఇది చాలా ఎక్కువ పోషకాలు కలిగిన పండు . ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. అంతే కాదు జామకాయలో ఐరన్, క్యాల్షియం, థైయమిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పర్ లు కూడా ఎక్కువే...

గర్భిణీ మహిళలు జామకాలు తినడం సురక్షితమేనా? గర్భిణీలు జామకాయ తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జామకాయలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎ లు గర్భిణీలకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి.

ఏదేమైనా , గర్భిణీస్త్రీలు ఏలాంటి పండ్లు తినాలనుకున్నా, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే పండ్లలో చాలా వరకూ గర్భిణీలకు హానీ కలిగించే పండ్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లలో నిమ్మ. అలాగే బొప్పాయి, పైనాపిల్ వంటివాటికి గర్భిణీలు దూరంగా ఉండాలి. అయితే జామకాయను నిరభ్యరంతరంగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

గర్భాధారణ సమయంలో గర్భిణీలు జామకాయ తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఏ పండ్లు తిన్నా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఏవైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి . మరి గర్భిణీలు జామ కాయను తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. వ్యాదినిరోధకశక్తి పెరుగుతుంది:

1. వ్యాదినిరోధకశక్తి పెరుగుతుంది:

గర్భిణీ స్త్రీలు జామకాయ తినడం వల్ల ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచి గర్భధారణ సమయంలో ఎలాంటి జబ్బులు రాకుండా ఎదుర్కొంటుంది.

2. గర్భిణీకలు ఎక్కువ పోషకాలు అందిస్తుంది:

2. గర్భిణీకలు ఎక్కువ పోషకాలు అందిస్తుంది:

గర్భిణీస్త్రీలు వారితో పాటు మరియు కడుపులో పెరిగే శిశువుకు కూడా తగినంత పోషకాలు అందివ్వాలి. పిండం పెరుగుదలకు అవసరం అయ్యే పూర్తి పోషకాలు ఈ జామకాలో పుష్కలంగా ఉన్నాయి. మరియు తల్లికి కూడా సరిపడా పోషకాలు అందుతాయి.

3. బ్లడ్ ప్రెజర్ ను నిర్వహిస్తుంది:

3. బ్లడ్ ప్రెజర్ ను నిర్వహిస్తుంది:

గర్భిణీ స్త్రీలో ఎక్కువ హైబ్లడ్ ప్రెజర్ కు గురి అవుతుంటారు . గర్భధారణ సమయంలో ఇది చాలా కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి పండిన జామకాయను తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది .

4. బేబీలో నెర్వస్ సిస్టమ్ :

4. బేబీలో నెర్వస్ సిస్టమ్ :

పొట్టలో పెరిగే శిశువుకు ఆరోగ్యవంతమైన నాడీవ్యవస్థ మరియు బ్రెయిన్ కోసం ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ జామకాయల్లో పుష్కలంగా ఉంటుంది . కాబట్టి, దీన్ని ఖచ్చితంగా గర్భధారణ సమయంలో తీసుకోవాలి.

5. మనస్సును ప్రశాంతపరుస్తుంది:

5. మనస్సును ప్రశాంతపరుస్తుంది:

గర్భధారణ సమయంలో కార్టిసోల్ అనే కంటెంట్ ఉత్పత్తి అవుతుంది . ఇది గర్భాధారణకు చాలా హాని కలిగిస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ జామకాయను తినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

6. మలబద్దకాన్ని నివారిస్తుంది:

6. మలబద్దకాన్ని నివారిస్తుంది:

జామకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్దక సమస్యను నివారిస్తుంది.

7. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

7. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

గర్భధారణ సమయంలో షుగర్ అటాక్ అవ్వడం చాలా సాధారణం. దీన్నే జస్టేషనల్ డయాబెటిస్ అంటారు . దీని వల్ల గర్భధారణ సమయంలో మరియు ప్రసవ సమయంలో చాలా కష్టం అవుతుంది . కాబట్టి రెగ్యులర్ గా జామకాయ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసి, డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.

8. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

8. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

జామకాయలో ఉండే విటమిన్ ఎ, తల్లి బిడ్డలో బ్లైడ్ నెస్ నివారిస్తుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది.

9. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

9. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

గర్భిణీ స్త్రీలు చాలా సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి అవుతుంటారు . ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా లికోపిన్ మరియు విటమిన్ సిలు కూడా శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే టాక్స్ ను తొలగిస్తుంది.

10. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

10. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

గర్భిణీ స్త్రీలు అజీర్తికి మరియు జీర్ణ సమస్యలకు గురి అవ్వడం చాలా సాధారణం. అయితే రెగ్యులర్ గా జామకాయను తినడం వల్ల గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ ను నివారిస్తుంది.

English summary

10 Benefits Of Guava During Pregnancy

Guava has a very sweet aroma and taste. It is liked by most pregnant women because of it's aroma. It is a very nutritious fruit. It is rich in vitamins and minerals. Guava also contains iron, calcium, thiamine, potassium, magnesium and phosphorus etc.
Story first published: Wednesday, April 22, 2015, 17:46 [IST]
Desktop Bottom Promotion